స్టార్‌ రైటర్‌కు బీజేపీ నేత కౌంటర్‌ | Javed Akhtar Feud with BJP MP Narasimha Rao over Mecca Verdict | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 19 2018 10:29 AM | Last Updated on Thu, Apr 19 2018 11:03 AM

Javed Akhtar Feud with BJP MP Narasimha Rao over Mecca Verdict - Sakshi

బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావు.. గేయ రచయిత జావెద్‌ అక్తర్‌

సాక్షి, ముంబై : మక్కా మసీదు పేలుడు కేసు తీర్పు బాలీవుడ్‌ రచయిత, బీజేపీ నేతకు మధ్య ట్వీట్ల యుద్ధానికి దారితీసింది. తీర్పుపై స్పందించిన ప్రముఖ గేయ రచయిత జావెద్‌ అక్తర్‌.. ‘మిషన్‌ పూర్తయ్యింది. మక్కా పేలుడు కేసులో విజయం సాధించిన ఎన్‌ఐఏకు నా అభినందనలు. ఇక ప్రపంచంలో జరిగే కులాంతర వివాహలపై దర్యాప్తు చేపట్టేందుకు ఎన్‌ఐఏకు సమయం దొరికింది’ అంటూ బుధవారం ఓ ట్వీట్‌ చేశారు. 

దీనికి ఏపీ బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు(యూపీ తరపున ప్రాతినిథ్యం) తన ట్వీటర్‌లో స్పందించారు. ‘జావెద్‌ గారూ.. కాంగ్రెస్‌ చేస్తున్న హిందూ ఉగ్రవాదం ఆరోపణలను ఖండించే నిజాయితీ మీకుందని ఆశిస్తున్నా. సినిమాల్లో పాటలు రాసినట్లుగానే మీరు రాహుల్‌గాంధీ కోసం కల్పిత కథనాలను రాస్తున్నారేమో అనిపిస్తోంది. విద్వేషపూరిత చర్యలు మానుకుని.. మంచి సలహాలు ఇవ్వండి’ అంటూ నరసింహారావు ట్వీట్లు చేశారు. దీనికి కౌంటర్‌గా దిగ్గజ రచయిత మరో ట్వీట్‌ చేయగా.. దానికి బదులిస్తూ బీజేపీ ఎంపీ మరో ట్వీట్‌ చేశారు. ఇలా వాళ్ల ట్వీట్ల పర్వం కొనసాగుతున్న వేళ.. జావెద్‌ ట్వీట్లను ఆయన ఫ్యాన్స్‌, మరోవైపు బీజేపీ నేతలేమో నరసింహారావు ట్వీట్లను వైరల్‌ చేస్తూ విమర్శలు గుప్పించుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement