GVL Narasimha Rao
-
త్వరలో ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు
-
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు
-
జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయంటూ గురువారం భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే మూడు నుంచి ఆరు నెలలలోగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు జరుగుతాయని జోస్యం చెప్పారు. రానున్న మార్పులకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలు విష ప్రచారం చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో నిధుల దుర్వినియోగం జరిగిందని కాగ్ నిర్ధారించిందని, కాగ్‌కు కేంద్రంతో గానీ, ఏ రాజకీయ పార్టీతో గానీ సంబంధం లేదని అన్నారు. అక్రమాలు జరిగినందుకు చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలే శిక్షిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీని టీడీపీ ప్రచార వేదికగా మార్చారని ఆరోపించారు. -
టీటీడీపై కేంద్రం పెత్తనం.. అంతలోనే వెనక్కి
సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు తిరుమల్లోని ఇతర ఆలయాలను పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకోవాలనే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే తిరుమలలోని పలు ఆలయాలు, వాటి చరిత్రను కేంద్ర పురవాస్తు శాఖ పరిశీలించింది. ఆలయాలు, నిర్మాణాలు పూర్వకాలంలో నిర్మాణమైనట్లుగా పురావస్తు శాఖ వెల్లడించింది. వీటితో పాటు ఇతర ఆలయాలు, భవనాల వివరాలు అందించాలని టీటీడీ ఈవోకు కేంద్ర పురవాస్తు శాఖ లేఖ రాసింది. దీంతో టీటీడీ రాష్ట్ర పురవాస్తు శాఖకు వివరాలు అందించినట్లు సమాచారం. తిరుమలలో పురాతన కట్టడాలకు రక్షణ కరువైందని ఫిర్యాదులు వచ్చినట్లు కేంద్ర పురావస్తు శాఖ వెల్లడించింది. పురాతన కట్టడాలను తొలగించి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని, భక్తులు ఇచ్చిన విలువైన కానుకలు సరిగ్గా భద్రపరచట్లేదని, పూర్వకాలంలో రాజులు ఇచ్చిన ఆభరణాలు భద్రతకు నోచుకోవట్లేదనే ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకొన్నట్లు కేంద్ర పురావస్తు శాఖ ప్రకటించింది. దీంతో తిరుమలలోని పురాతన కట్టడాలు అన్నింటిని పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకొనే అవకాశం ఉంది. అయితే టీటీడీ నుంచి పూర్తి స్థాయిలో సమాచారం అందలేదని, అందిన వెంటనే అధికారులు తిరుమలలో సందర్శించే అవకాశం ఉన్నట్లు పురావస్తు అధికార వర్గాలు వెల్లడించాయి. పరిశీలన అనంతరం పలు కట్టడాలను ఆధీనంలోకి తీసుకొనే అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. దీనిపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవుడిపై కేంద్రం పెత్తనం ఏంటని నిలదీస్తున్నారు. అదంతా అబద్ధం : ఎంపీ జీవీఎల్ నరసింహరావు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రం ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటుందన్న ప్రచారం అబద్ధమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు అన్నారు. ఈ విషయంపై కేంద్ర సాంస్కృతిక శాఖా అధికారులతో మాట్లాడామని, అటువంటి అవకాశమే లేదని వ్యాఖ్యానించారు. దేవస్థానం నుంచి కేంద్రం జోక్యం కోరితే పరిశీలిస్తారని తెలిపారు. కేవలం రాజకీయ దురుద్ధేశంతో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని జీవీఎల్ విమర్శించారు. అంతలోనే వెనక్కి తగ్గిన కేంద్రం : తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు తిరుమలలోని ఆలయాలను ఆధీనంలోకి తీసుకోవటంపై కేంద్రం వెనక్కి తగ్గింది. పురావస్తు శాఖ ఢిల్లీ నుండి విజయవాడ కార్యాలయానికి పంపిన లేఖను కేంద్ర పురావస్తు శాఖ వెనక్కు తీసుకోనుందని, ఈ మేరకు తమకు సమాచారం వచ్చినట్లు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. సమాచారం లోపం కారణంగానే ఈవోకు లేఖ పంపామంటూ పురావస్తు శాఖ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. -
చంద్రబాబు చెంపదెబ్బలు వేసుకోవాలి
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు దేవుడి సాక్షిగా చెంపదెబ్బలు వేసుకోవాలని.. హిందువులు, దేశ ప్రజలందరికీ ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రపంచంలో హిందువులందరూ ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన టీటీడీ బోర్డులో తాను క్రిస్టియన్ అని చెప్పుకున్న అనితను సభ్యురాలిగా నియమించడం హిందువులను అవమానించడం కాదా? హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కాదా? ఇది వేరే మతాల వాళ్ల ఓట్లను కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన దుశ్చర్యగా చెప్పకతప్పదు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. అనిత స్వయంగా ఆ బాధ్యత నుంచి తప్పుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన ప్రభుత్వం హిందువులు, దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పుకుని, దేవుడి సాక్షిగా చెంపదెబ్బలు వేసుకుని ఈ తప్పిదం మళ్లీ చేయనని ప్రజలకు చెప్పాలి..’ అని నరసింహారావు డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ కుట్ర చేస్తోందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా.. ‘ఇది ధర్మపోరాటం అని చెప్పి కోట్లలో డబ్బులు ఖర్చు చేయడం తప్ప వారు చేసిందేమీ లేదు. మానసిక ఒత్తిళ్లకు.. రకరకాల భయాందోళనలకు సీఎం గురయ్యారు. నిన్న జరిగిన తంతు కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా దూషించడానికి వాడుకున్నారు తప్పితే ఒక మర్యాద కలిగిన పార్టీ, ఒక హోదా ఉన్న వ్యక్తులు చేసే వ్యవహారంలా లేదు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన కుటుంబ ప్రతిష్టను, ఎన్టీయార్ పేరును, తెలుగు ప్రజల గౌరవాన్ని పూర్తిగా మంటగలిపారు. ఆయన క్షమాపణ చెప్పాలి’ అని నరసింహారావు డిమాండ్ చేశారు. -
‘ఈ తీర్పు రాహుల్ గాంధీకి చెంపపెట్టు’
-
‘ఈ తీర్పు రాహుల్ గాంధీకి చెంపపెట్టు’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై అనవసరంగా ఆరోపణలు చేశారంటూ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ లోయ మృతి కేసును అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిందన్నారు. ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు స్పందించారు. జస్టిస్ లోయ కేసును రాజకీయం చేయాలని చీప్ ట్రిక్ ప్లే చేస్తున్నారని విమర్శించారు. మీకు రాజకీయంగా ఉన్న, వ్యక్తిగతంగా ఉన్నా అవి బయట చూసుకోండి తప్ప, ఇక్కడ కాదని కోర్టు చెప్పిన విషయాల్ని గుర్తుచేశారు. ఈ తీర్పు అమిత్ షాపై ఆరోపణలు చేసేవారికి చెంపపెట్టు లాంటిది అన్నారు. లోయ కేసు పిటిషన్ల వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని ఆరోపించారు. ఇకపై అలాంటి ప్రయత్నాలు మానుకుని బీజేపీకి, అమిత్ షాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జస్టిస్ లోయ మృతి కేసు విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెంపపెట్టు లాంటిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. పేదరికం నుంచి వచ్చిన నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కావడం కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీకి ఇదేమీ కొత్త కాదంటూ మండిపడ్డారు. దేశంలో మత కల్లోలాలు సృష్టించే పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. మజ్లిస్ పార్టీ లౌకిక వాదం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని ఎద్దేవా చేశారు. మోదీని తిట్టడానికే వామపక్షాలు ఐదు రోజుల సభలు పెట్టుకుందని లక్ష్మణ్ విమర్శించారు. -
స్టార్ రైటర్‌కు బీజేపీ నేత కౌంటర్
సాక్షి, ముంబై : మక్కా మసీదు పేలుడు కేసు తీర్పు బాలీవుడ్ రచయిత, బీజేపీ నేతకు మధ్య ట్వీట్ల యుద్ధానికి దారితీసింది. తీర్పుపై స్పందించిన ప్రముఖ గేయ రచయిత జావెద్ అక్తర్.. ‘మిషన్ పూర్తయ్యింది. మక్కా పేలుడు కేసులో విజయం సాధించిన ఎన్ఐఏకు నా అభినందనలు. ఇక ప్రపంచంలో జరిగే కులాంతర వివాహలపై దర్యాప్తు చేపట్టేందుకు ఎన్ఐఏకు సమయం దొరికింది’ అంటూ బుధవారం ఓ ట్వీట్ చేశారు. దీనికి ఏపీ బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు(యూపీ తరపున ప్రాతినిథ్యం) తన ట్వీటర్లో స్పందించారు. ‘జావెద్ గారూ.. కాంగ్రెస్ చేస్తున్న హిందూ ఉగ్రవాదం ఆరోపణలను ఖండించే నిజాయితీ మీకుందని ఆశిస్తున్నా. సినిమాల్లో పాటలు రాసినట్లుగానే మీరు రాహుల్‌గాంధీ కోసం కల్పిత కథనాలను రాస్తున్నారేమో అనిపిస్తోంది. విద్వేషపూరిత చర్యలు మానుకుని.. మంచి సలహాలు ఇవ్వండి’ అంటూ నరసింహారావు ట్వీట్లు చేశారు. దీనికి కౌంటర్‌గా దిగ్గజ రచయిత మరో ట్వీట్ చేయగా.. దానికి బదులిస్తూ బీజేపీ ఎంపీ మరో ట్వీట్ చేశారు. ఇలా వాళ్ల ట్వీట్ల పర్వం కొనసాగుతున్న వేళ.. జావెద్ ట్వీట్లను ఆయన ఫ్యాన్స్, మరోవైపు బీజేపీ నేతలేమో నరసింహారావు ట్వీట్లను వైరల్ చేస్తూ విమర్శలు గుప్పించుకుంటున్నారు. Mission accomplished !! . My congratulations to NIA for their grand success in Mecca Masjid case. Now they have all the time in the world to investigate inter community marriages !!! — Javed Akhtar (@Javedakhtarjadu) 18 April 2018 Javed Ji, Wish you had the honesty to condemn @INCIndia for "Hindu Terror" formulation. Seems you are in awe of @RahulGandhi for writing a fictional script like you have done so well in films. OR, is "Hindu Terror" also your brainwave as your reported idea of "Maut Ka Saudagar?" https://t.co/35MTCJJal5 — GVL Narasimha Rao (@GVLNRAO) 18 April 2018 Dear Mr Rao , I don’t believe in terms like Hindu or Muslim terror . These terms wrongly accuse a whole community . An average person of every community wants peace and harmony . Troublemakers are the vested interest n the mad fringe and sadly no community is devoid of them — Javed Akhtar (@Javedakhtarjadu) 18 April 2018 Javed Ji, Pl do not attempt fake equivalence on terrorism with Islam. Jehadis wage a war in the name of Islam for "Zannat". Terror preachers like Zakir Naik aren't Buddhists but Islamists. @INCIndia paid a heavy price for your sordid ideas. Pl continue advising @RahulGandhi!! https://t.co/zVmBNO4GlZ — GVL Narasimha Rao (@GVLNRAO) 19 April 2018 -
ఏడాదిలో తెలంగాణను త్రిపుర చేయగలం
సాక్షి, హైదరాబాద్ : ప్రజల్లో చైతన్యం కలిగిస్తే తాము అధికారంలోకి వచ్చే పరిస్థితులు రావటానికి ఏడాది కాలం సరిపోతుందని, త్రిపురలో తాము చేసి చూపించింది తెలంగాణలో కూడా సాధ్యమేనని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నా రు. ఈ దడ పుట్టే ప్రధానమంత్రి నరేంద్రమోదీపై బురద జల్లే రాజకీయాలకు టీఆర్ఎస్ నేతలు తెరదీశారని ఆయన విమర్శించారు. తెలంగాణలో తమ బలం తగ్గుతోందని తెలియటంతో సీఎం కేసీఆర్‌లో భయం పట్టుకుందని, అదే భయంతో ఉన్న ఇతర రాష్ట్రాల నేతలను కూడగట్టుకుని ఫ్రంట్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కానీ అలాంటి ఏ ఫ్రంట్ కూడా మోదీ ముందు నిలవబోవని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ సీట్ల సంఖ్యను మరింత పెంచుకుంటుందని జోస్యం చెప్పారు. బుధవారం సాయంత్రం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దక్షిణాదిలో ఎక్కువ సీట్లు సాధిస్తాం.. తెలంగాణ, ఆంధ్ర సహా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈసారి ఎక్కువ సంఖ్యలో సీట్లు సాధిస్తామని, ఆ సంఖ్య 40 నుంచి 50 సీట్ల వరకు ఉండేలా చూస్తున్నామని జీవీఎల్ పేర్కొన్నారు. 2014లో ఐదు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు 21 రాష్ట్రాలను కైవసం చేసుకుందని, ప్రధాని మోదీకి ఇంకా ఆదరణ పెరుగుతోందని, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అదే భయం పట్టుకుందని చెప్పారు. బంగారు తెలంగాణ అని కేసీఆర్ అంటున్నా, ఆయన కుటుంబం బంగారం కావటం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ఎలాగైనా ప్రజల దృష్టిని మరల్చేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దక్షిణాది రాష్ట్రాలకు పెద్దగా నిధులివ్వలేదనే ప్రచారం ఇందులో భాగమేనని అన్నారు. హామీలతో కాంగ్రెస్ కాలం వెళ్లదీస్తే బీజేపీ అసలు సామాజిక న్యాయం అమలు చేస్తోందన్నారు. మోదీని తిట్టడమే వారి ఎజెండా హైదరాబాద్‌లో సీపీఎం జాతీయ సమావేశాలు ప్రధాని మోదీని దూషించటంతో మొదలయ్యాయని, అదే రకంగా ముగించే అవకాశం ఉందని, మోదీని తిట్టడమే అన్ని పార్టీలకూ సింగిల్ ఎజెండాగా మారిపోయిందని జీవీఎల్ పేర్కొన్నారు. -
తెలుగు రాష్ట్రాల సీఎంలకు భయం పట్టుకుంది
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు భయం పట్టుకుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అన్నారు. వాళ్ల ఉనికి కోసం రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారని ఆయన విమర్శించారు. అంతేకాక తెలుగు రాష్ట్రాల సీఎంలు వారి స్థాయి మరిచి ప్రధానమంత్రి మోదీపై బురద జల్లుతున్నారని ఎంపీ మండిపడ్డారు. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ కుటుంబంలో బంగారం మాయం అవుతుందని ఆయన ఎద్దేవా చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అప్పుడు ఐదు రాష్ట్రాలు.. ఇప్పుడు 21 రాష్ట్రాలు ‘మొదట్లో ఐదు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ప్రస్తుతం 21 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాం. ఏ ప్రభుత్వం చేయని పనులు మా ప్రభుత్వం చేసింది. బీజేపీ విస్తరణ కొనసాగుతూ వస్తుంద’ని రాజ్యసభ ఎంపీ పేర్కొన్నారు. కేవలం మోదీని తిట్టడానికే ఈ సభలు ‘కమ్యూనిస్టులు కేవలం నరేంద్ర మోదీని తిట్టడానికే జాతీయ మహాసభలు పెట్టుకున్నారు. మోదీ చేతిలో త్రిపురలో కమ్యూనిస్టు పార్టీ ఘోరంగా ఓడిపోయింది. తిట్టడం ద్వారానే వారు ఆనందం పొంతున్నార’ని ఆయన అన్నారు. ఉనికి కోసం ఆరోపణలు.. తన ఉనికి కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ మోదీపై ఆరోపణలు చేస్తుంది. దక్షిణాది రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం లేదని చెప్తున్నారు. కాంగ్రెస్ హయాంలో కేవలం రూ.3 లక్షల కోట్లు ఇచ్చారు.. కానీ మా ప్రభుత్వం రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందని ఎంపీ జీవీఎల్ తెలిపారు. అంతేకాక 8 కోట్ల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు, 4 కోట్ల కుటుంబాలకు కరెంట్ ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. కేంద్రం 50 శాతం నిధులను నేరుగా రాష్ట్రాలకు ఇస్తుందన్నారు. ఏదైనా ఒక విషయం మాట్లాడేప్పడు తెలుసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు. పేద వారికి సాయం చేసే పార్టీ ఉందంటే అది బీజేపీ మాత్రమే అని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తాం.. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో భూ స్థాపితం కాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. ఓడిపోతామనే భయంతో వారు ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారు.. అందుకే ఫ్రంట్లతో పేరుతో ఊదరా గొడుతున్నారు.. ఎటువంటి ఫ్రంట్ వచ్చిన మోదీకి ప్రతిఘటన ఇవ్వలేవని రాజ్యసభ ఎంపీ ధీమా వ్యక్తం చేశాడు. 2019 ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుంది. తెలంగాణలో కూడా అత్యధిక స్థానాలు గెలుపొంది అధికారంలోకి వస్తామని ఆయన అన్నారు. తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీని బలోపేతం చేసే విధంగా కార్యక్రమాలను చేస్తామని ఎంపీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ నిధులు ఇచ్చామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీతో పొత్తులు ఉండవని రాజ్యసభ ఎంపీ జీఎల్‌వీ నర్సింహారావు స్పష్టం చేశారు. -
టీడీపీని తెలుగు కాంగ్రెస్ పార్టీ అనడం మంచిది
-
‘ఎన్టీఆర్ స్థాపిస్తే... చంద్రబాబు స్టెప్నీగా మార్చారు’
సాక్షి, విజయవాడ : గత నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా ఊసేత్తని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనూహ్యంగా యూటర్న్ తీసుకుని తాము సైతం పోరాడుతున్నట్లు నటించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూ తీవ్ర విమర్శల పాలవుతున్నారు. తాజాగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఏపీ సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో గురువారం ఇక్కడి మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకొచ్చాక చంద్రబాబు చేసిన మోసాలు, అవకతవకలు బయటకొస్తుంటే హోదా ముసుగులో డ్రామాలాడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి దేశంలోని 21 రాష్ట్రాల్లో అధికారం కట్టబెట్టారని గుర్తుచేశారు. అప్రజాస్వామిక లక్షణాలున్న పార్టీ కాంగ్రెస్ అని, అందుకే జాతీయస్థాయిలో కాంగ్రెస్ తన ఉనికి కోల్పోతుందన్నారు. 'ఏపీలో అనేక కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి.. అవి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయి. టీడీపీని తెలుగుదేశం అనడం కంటే తెలుగు కాంగ్రెస్ పార్టీ అనడం మంచిది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దివంగత సీఎం ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే... చంద్రబాబు మాత్రం కాంగ్రెస్‌కు స్టెప్నిగా మార్చారు. కాంగ్రెస్‌తో జతకలిసి ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాలను సరిగా జరగనివ్వలేదు. ప్రత్యేక హోదా వస్తే ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో.. వాటినే ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఇచ్చాము. టీడీపీలాగా బీజేపీ రోజుకొక మాట మాట్లాడదు. బీజేపీ ఆంద్రప్రదేశ్‌కి అన్యాయం చేసిందని విష ప్రచారం చేస్తున్నారని' జీవీఎల్ విమర్శించారు. ఈ కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టి... ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న నిరసన దీక్షను అడ్డుకోవాలని కుట్రలు చేశారని ఆరోపించారు. రౌడీ రాజకీయాలను పార్లమెంట్ లొనే అనుకున్నా. రోడ్డు మీదకు కూడా తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అవకతవకలు రోజుకోకటి బయటకు వస్తున్న వాటికి సమాధానం చెప్పకుండా ప్రత్యేక హోదా ముసుగులో డ్రామాలు ఆడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం 750 కోట్ల రూపాయాలు ఖర్చుపెట్టి ఎవరికీ కనిపించని భవనాలు కట్టింది. గుంటూరు జిల్లా రూరల్‌లో టీడీపీ విద్యార్థి విభాగం బీజేపీ కార్యాలయంపై దాడి చేయడాన్ని జీవీఎల్ నరసింహారావు తీవ్రంగా ఖండించారు. -
మా దీక్షలకు ఆటంకం కలిగించాలని టీడీపీ యత్నం
-
బీజేపీ దీక్షపై టీడీపీ కుట్ర..
సాక్షి, విజయవాడ : భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న నిరాహార దీక్షను అడ్డుకనేందుకు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) యత్నిస్తోందని బీజేపీ రాజ్యసభ ఎంపీ, అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. పార్లమెంటు ఉభయ సభలను సజావుగా సాగనీయకుండా అడ్డుపడిన ప్రతిపక్షాల తీరుకు నిరసనగా జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) ఎంపీలు దేశవ్యాప్తంగా ఒక రోజు(గురువారం) నిరహార దీక్షకు దిగుతున్న విషయం తెలిసిందే. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఏకమై పార్లమెంటును అడ్డుకున్నాయని నరసింహారావు అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. విజయవాడలోని లెనిన్ సెంటర్లో దీక్షకు పోలీసుల అనుమతి కోరగా తిరస్కరించారని చెప్పారు. పార్లమెంటు నిర్వహణలో అడ్డుపడటమే కాక, బీజేపీ శాంతియుతంగా నిరాహార దీక్షకు కూడా టీడీపీ అడ్డుపడుతోందని అన్నారు. బుధవారం లెనిన్ సెంటర్లో సీపీఐ దీక్షకు అనుమతించారని, బీజేపీకి అదే స్థలంలో దీక్షకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ధర్నా చౌక్‌లో నిరాహార దీక్షకు విజయవాడ కమిషనర్ అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ తో జత కట్టిన తెలుగు దేశం పార్టీ పార్లమెంట్ నిర్వహణ లో అడ్డు పడడమే కాక, భాజపా చేస్తున్న శాంతియుత నిరాహార దీక్షకు కూడా అడ్డు పడుతోంది. లెనిన్ సెంటర్ లో దీక్షకు ఆఖరి నిమిషం లో అనుమతి నిరాకరించారు, అదే చోట CPI కు నిన్న ధర్నా కు అనుమతించారు. ఇప్పుడు ధర్నా చౌక్ లో దీక్ష. pic.twitter.com/maIhvBXsuW — GVL Narasimha Rao (@GVLNRAO) 12 April 2018 -
చంద్రబాబువి నిందా రాజకీయాలు
సాక్షి, న్యూఢిల్లీ: స్నేహం చేసిన వారిని వంచించే అలవాటు బీజేపీకి లేదని చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తీవ్ర వ్యాఖ్యానాలు చేశారు. బుధవారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబును ఏమన్నారనేది ఆయన మాటల్లోనే.. ‘నాలుగేళ్లు మా భాగస్వామిగా ఉండి ఇప్పుడు నిందా రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ స్నేహితులను చేసుకుంటుంది తప్పితే వంచించే అలవాటు లేదు. మేం స్నేహానికి విలువ ఇస్తాం.. ప్రజలను గౌరవిస్తాం.. అభివృద్ధికి విలువ ఇస్తాం.. విభజన చట్టంలో ఉన్న వాటితో పాటు లేనివీ కూడా మేం చేసిన తీరు నరేంద్ర మోదీ మహత్తుకు అద్దంపడుతుంది. ఎందుకంటే మేం సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సూత్రాన్ని నమ్ముతాం. మా నుంచి టీడీపీ విడిపోయినా ఏపీ పట్ల మా చిత్తశుద్ధి, అంకితభావం కొనసాగుతాయి. మేం ఆంధ్రప్రదేశ్‌పై దాడి చేస్తున్నామనే స్థాయికి వారి ఆరోపణలు చేరుకున్నాయి. పొత్తు వల్ల 15 సీట్లు తక్కువ వచ్చాయని ఆయన అనడం మమ్మల్ని చాలా బాధించింది. 2014లో మాతో పొత్తు లేకుంటే మీరు ఎక్కడుండేవారు. ఇలా నిందారోపణలు చేయడం సరికాదు.. ఎవరైనా వారి రాజకీయ పంథాను ఎన్నుకోవచ్చు. కానీ మేం వైఎస్సార్సీపీకి దగ్గరవుతున్నట్టు ఆరోపించారు. రాజకీయాలు చేయవచ్చుగానీ అవాస్తవ రాజకీయాలు చేయరాదు..’ అన్నారు. జగన్మోహన్రెడ్డిపై ఆర్థిక నేరారోపణలు ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలు అనేక దర్యాప్తులు చేస్తుంటాయని, జగన్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారని, కేసు విచారణ జరుగుతోందన్నారు. టీడీపీ ఎందుకు విడిపోయిందని అనుకుంటున్నారని ప్రశ్నించగా మాకు స్నేహితులను వంచించే అలవాటు లేదు. అది మా డీఎన్ఏలోనే లేదు అన్నారు. చంద్రబాబు ఆరోపణల్లో పస లేదు.. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో పస లేదన్నారు. విశ్వసనీయత లేని ఆరోపణలను ప్రజలు కూడా నమ్మరన్నారు. ఈరోజు ఆయన చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో విషయం లేదని, రాజకీయంగా ఆరోపణలు చేస్తేనే నిలదొక్కుకుంటామన్న దురాశ మాత్రమే కనిపిస్తోందన్నారు. రాష్ట్రానికి మేం ఏం చేశామో ప్రజలందరికీ తెలుసునని, రెవెన్యూ లోటు కింద రూ.22 వేల కోట్లు ఇచ్చాం అంటే రాష్ట్రం పట్ల మేం శ్రద్ధ చూపినట్లా? వివక్ష చూపినట్లా? అని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన నిధులను సద్వినియోగం చేయకుండా, పెద్ద మొత్తంలో అప్పులు చేసి మమ్మల్ని విమర్శించడం తగునా? అన్నారు. రూ.1050 కోట్లు అభివృద్ధి నిధులు ఇస్తే వాటి ఖర్చు వివరాలు ఇప్పటికీ చెప్పలేదు.. అండర్‌గ్రౌండ్ డ్రౌనేజీకి రూ.1000 కోట్లు ఇస్తే రూ.230 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు.. జవాబుదారీ తనం లేదు. ఇంకా నిధులు రాలేదని రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు మనసులో ఏముందో తెలుసుకునే పరిజ్ఞానం, సామర్థ్యం తమకు లేదని, ఆయనకున్నదల్లా రాజకీయ అభద్రత మాత్రమే అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానన్న అభద్రతాభావానికి లోనై కూర్చున్న కొమ్మనే నరుక్కునేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ స్పెషల్ పర్పస్ వెహికిల్ ద్వారా రాష్ట్రానికి ఇచ్చే రూ.16 వేల కోట్ల వల్ల రాష్ట్ర రుణ పరిమితిపై ఎలాంటి ప్రభావం చూపబోదని, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. -
చంద్రబాబు కూర్చున్న కొమ్మను నరుక్కున్నారు
-
‘వైఎస్సార్సీపీ ఉచ్చులో టీడీపీ విలవిల’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకునేలా మెడలు వంచిన ఘనత వైఎస్సార్సీపీకే దక్కుతుందని ఏపీ బీజేపీ చీఫ్ కంభంపాటి హరిబాబు అన్నారు. వైఎస్సార్సీపీతో బీజేపీ ఎన్నటికీ కలవబోదని, అలాంటిదేదో జరుగుతుందనుకోవడం చంద్రబాబు భ్రమేనని స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో జీవీఎల్, గోకరాజులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ సీఎంపై నిప్పులు చెరిగారు. ‘‘ఇవాళ టీడీపీ అజెండాను నిర్దేశిస్తున్నది వైఎస్సార్సీపీనే. హోదా రావాలంటే మంత్రులు రాజీనామా చేయాలన్న జగన్ డిమాండ్ మేరకు చంద్రబాబు తన మంత్రులను ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం విషయంలోనూ అదే జరిగింది. చంద్రబాబు మెడపై వైఎస్సార్సీపీ కత్తిపెట్టగానే ఆయనా అవిశ్వాసం పెట్టారు. ఏ రకంగా చూసినా వైఎస్సార్సీపీ పన్నిన ఉచ్చులో టీడీపీ పడింది’’ అని హరిబాబు వ్యాఖ్యానించారు. అలా ఉండే బాబు ఇలా: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ‘‘ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన చంద్రబాబును ఇవాళ ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకప్పుడు నేతలు ఆయన కోసం ఏపీ భవన్‌కు వెళ్లేవారు.. ఇప్పుడు ఆయనే అందరి దగ్గరికి వెళ్లి బతిమాలుకుంటున్నారు. ఒక్క శరద్ పవార్ తప్ప పెద్ద నాయకులెవరినీ చంద్రబాబు కలవలేదు. నాలుగేళ్లుగా ఆయన చేసిన పనులకు లెక్కలు అడిగితే ఇవ్వడంలేదు. అమరావతి అంటే అమ్మో అవినీతి అని భయపడుతున్నారు. ఇచ్చిన నిధులు ఏం చేశారంటే చెప్పరు. పైగా వైఎస్సార్సీపీతో బీజేపీ కలుస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని జీవీఎల్ మండిపడ్డారు. -
చాలా నిజాలు బయటపెడతాం
సాక్షి, అమరావతి: అమిత్ షా లేఖ ద్వారా చెప్పిన విషయాలు మొదటి విడత మాత్రమేన ని, ఇంకా చాలా నిజాలను ప్రజల ముందు పెడతామని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసింద న్న వాదన ఒకవేళ నిజమైతే అందుకు సీఎం చంద్రబాబుతోపాటు టీడీపీ ప్రభుత్వ అసమర్థతే కారణమని స్పష్టం చేశారు. ఇచ్చిన నిధులను ఖర్చు పెట్టే సత్తా లేకపోవడం అసమర్థతేనని పేర్కొన్నారు. ఆయన మంగళ వారం విజయవాడలోని విలేకరులతో మాట్లాడారు. ‘‘నాలుగేళ్లు కేం ద్రంలో ఉన్న టీడీపీ మంత్రులు రాష్ట్రాన్ని ఎం దుకు అభివృద్ది చేసుకోలేకపోయారు? అంటే వాళ్లు రాష్ట్ర ప్రయోజనాల గురించి కేంద్రంతో మాట్లాడలేదా?’’ అని ప్రశ్నించారు. ప్రతిపక్షం లేని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు గంటల తరబడి అసత్యాలు చెప్తున్నారని ఆరోపించారు. -
టీడీపీ ప్రజలను మోసం చేయాలని చూస్తుంది
-
రాజకీయాల్లో ఎవరు త్యాగం చేయరు..
సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో ఎవరు త్యాగం చేయరని ఆయన చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. జీవీఎల్ నరసింహారావు శనివారం ‘సాక్షి’ తో మాట్లాడుతూ..‘2010 ఎన్నికల్లో పొత్తు కోసం వెంపర్లాడింది ఎవరో అందరికీ తెలుసు. నరేంద్ర మోదీ హవా చూసి పొత్తుకు చంద్రబాబు ఉత్సాహం చూపించారు. తప్పని పరిస్థితుల్లోనే బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. రాజకీయా కారణాలతోనే ఎన్డీయే నుంచి చంద్రబాబు తప్పుకున్నారు. ఎన్డీయే నుంచి వెళ్లిపోవాలని చంద్రబాబుకు మేం చెప్పలేదు. నిన్న, మొన్నటి వరకూ ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు రాజకీయ వ్యూహాత్మకంగా ఉండటానికే ఇప్పుడు హోదా గురించి మాట్లాడుతున్నారు. దురుద్దేశంతోనే ఎన్డీయేపై చంద్రబాబు బురద జల్లుతున్నారు. రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నప్పుడు ఏదైతేనేమీ అన్న ఆయన ఇప్పడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. రాజకీయంగా ఒత్తిడికి గురయ్యే ఎన్డీయే నుంచి వైదొలిగారు. కేంద్ర మంత్రులతో మంచి పరిచయాలతో నాలుగేళ్లు ప్రభుత్వంలో ఉండి రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా దేని కోసం పనిచేశారు?. ఢిల్లీకి 29సార్లు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా దేని కోసం వచ్చారు?. దేశవ్యాప్తంగా 25 లక్షల ఇళ్లు ఇస్తే.. అందులో ఏపీకే 8 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. వెనుకబడిన జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు రాయితీలు కల్పించాం. చట్టంలో లేని అంశాలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై లేకపోయినా..చాలా అంశాల్లో ఏపీకి సహకరించాం. కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ ఇవ్వమని చెప్పలేదు. పరిశీలనలో ఉన్నాయని మాత్రమే చెప్పాం. విభజన చట్టంలోని 80శాతం అంశాలను అమలు చేశాం. నాలుగేళ్లుగా కేంద్రంతో మిత్రపక్షంగా ఉండి హఠాత్తుగా చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు కేంద్రంపై ఆరోపణలు చేయడం దారుణం. రాజకీయ అవసరాల కోసం అసెంబ్లీ సీట్లను పెంచాలనడం సరికాదు. అది ప్రజలపై భారం పడుతుంది. పార్టీ ఫిరాయింపులను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో సమర్థించదు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ఫిరాయింపులు జరిగాయి. వాళ్ల అవసరాల కోసమే అసెంబ్లీ సీట్లను పెంచాలని కోరుతున్నారు. ఎవరి మద్దతు లేకుండానే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రాజకీయ పార్టీగా ఎదుగుతాం. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించాం. దానికి సంబంధించిన 80 శాతం నిధులను రాష్ట్రానికి ఇచ్చాం. సరైన వివరణ ఇవ్వకుండానే ప్రాజెక్ట్ అంచనాలను భారీగా పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పకుండా నిధులు అడిగింది. కేంద్రం, రాష్ట్రాం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రాజెక్ట్ ఖర్చులను చెప్పాల్సిన కనీస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా ఎన్నికల్లో గెలిచే సత్తా బీజేపీకి ఉంది. ఓటుకు కోట్లు కేసు కోర్టు పరిధిలో ఉంది. దానిపై పొలిటికల్ కామెంట్ చేయను. అవసరాల కోసం ఏర్పడే ఫ్రంట్లను ప్రజలు సమర్థించరు. చంద్రబాబు కుమారుడు లోకేశ్‌పై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి. వాటిపై స్పందించాల్సినంత సమాచారం నా దగ్గర లేదు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత ఉంది.నాలుగేళ్లు పాలించినా రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయాననే దౌర్భాగ్య స్థితిలో చంద్రబాబు ఉన్నారు. ప్రధాన కార్యాలయానికి విజయసాయి రెడ్డి వెళ్లడంలో తప్పేముంది. ఎవరైనా ప్రధాని కార్యాలయానికి వెళ్లొచ్చు.’ అని అన్నారు. -
‘బీజేపీని కార్నర్ చేస్తున్న టీడీపీ’
-
‘బీజేపీని కార్నర్ చేస్తున్న టీడీపీ’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యంకాదని, అందుకే సాయం చేస్తామని కేంద్రం చెప్పినట్టు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని మాట ఇచ్చారు కాబట్టే ఆ మాటపై నిలబడ్డామన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నప్పుడు తలూపిన చంద్రబాబు ఇప్పుడెందుకు కొత్తపాట పాడుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఇంకా పదేళ్ల సమయం ఉందని, ప్రజలు వాస్తవాలు తెలుకోవాలని కోరారు. తాము మిత్రధర్మాన్ని విస్మరించలేదని, టీడీపీ నాయకులే రాజకీయ లబ్ధి కోసం తమను కార్నర్ చేస్తున్నారని వాపోయారు. కాగా, ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఇద్దరు టీడీపీ ఎంపీలు కేబినెట్ పదవులకు రాజీనామా సమర్పించారు. అయితే తమ ఎంపీలు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా కొనసాగుతారని టీడీపీ ప్రకటించింది. -
‘ఇంకా రాజకీయాలు చేయొద్దు’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా అంశం చట్టంలో లేకపోయినా ఎన్నికల సమయంలో ఇచ్చేందుకు అంగీకరించామని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ప్రత్యేక హోదా సాధ్యం కాకపోవడంతోనే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... హోదా ఉన్న రాష్ట్రాలకు, లేని రాష్ట్రాలకు నిధుల్లో 30 శాతం తేడా ఉంటుందని వెల్లడించారు. ఈ మొత్తాన్ని ప్యాకేజీ రూపంలో ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చిందని, ఈ ప్రతిపాదనకు చంద్రబాబు అంగీకరించారని చెప్పారు. ప్రత్యేక హోదాతో సమానంగా ప్యాకేజీ నిధులు వస్తాయని, కొంతమంది హోదా పేరుతో రాజకీయం చేస్తున్నారన్నారు. విభజన హామీల అమలుకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే 9 జాతీయ సంస్థలను ఏపీకి ఇచ్చామని, మరిన్ని సంస్థలను త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. పన్ను రాయితీలను కూడా కేంద్రం ప్రకటించిందని, ఇంకా రాజకీయాలు చేయడం మంచిది కాదని నరసింహారావు అన్నారు.