రణబీర్ కపూర్ నటించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ వంటి సినిమాల విజయంపై ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సినిమాలు భారీ విజయాలు సాధించడానికి కారణమైన ప్రేక్షకులను జావేద్ నిందించారు.
భారత ప్రముఖ గేయ రచయిత, ఐదు జాతీయ అవార్డుల విన్నర్ అయిన జావేద్ అక్తర్ యానిమల్ సినిమాపై పరోక్షంగా కామెంట్ చేశారు. ఔరంగాబాద్‌లో జరిగిన అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన ప్రసంగంలో ప్రస్తుత చిత్రాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్ నటించిన యానిమల్ చిత్రం గురించి నేరుగా ప్రస్తావించకుండానే ఆయన ఆందోళనను వ్యక్తం చేశారు.
తాజాగా వచ్చిన ఒక చిత్రంలో ఒక పురుషుడు.. స్త్రీని తన షూ నాకమని అడిగితే.. మరోక చిత్రంలో ఒక స్త్రీ హీరోను చెంపదెబ్బ కొడుతుంది. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఎలా ఆధరిస్తారో అర్థం కావడం లేదని జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. ఇదీ ఏ మాత్రం ఆమోదయోగ్యమనది కాదని ఆయన చెప్పారు. సమాజానికి ఇది ఎంతో ప్రమాదకరం అని ఆయన ఆందోళన చెందారు.
యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్, త్రిప్తి డిమ్రీ మధ్య ఈ సీన్ జరుగుతుంది. రణబీర్ కనుచూపుతో తన షూ నాకమని త్రిప్తి డిమ్రీకి చెప్పుతాడు. మరొకటి షాహిద్ కపూర్, కియారా అద్వానీ నటించిన కబీర్ సింగ్ చిత్రంలోనిది అందులో హీరోను కియారా చెంపదెబ్బ కొడుతుంది. మరోక సీన్‌లో హీరోయిన్‌పై బూతు పదాన్ని ఉపయోగిస్తూ హీరో చెంపదెబ్బ కొడుతాడు. ఇదే చిత్రం తెలుగులో అర్జున్‌రెడ్డిగా వచ్చిన విషయం తెలిసిందే. జావేద్ అక్తర్ టార్గెట్ చేసిన ఈ రెండు చిత్రాలను కూడా డైరెక్ట్ చేసింది సందీప్‌రెడ్డి వంగా. పరోక్షంగా సందీప్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి.
గతంలో కూడా జావేద్ ఇలాంటే వ్యాఖ్యలే చేశారు. ఆనంద్ బక్షి రాసిన సాహిత్యంపై కూడా వివాదస్పద వ్యాఖ్యలే చేశారు. 90ల నాటి చిత్రం ఖల్ నాయక్ నుంచి 'చోలీ కే పీచే' పాట భారీ విజయాన్ని అందుకుంది. ఆ పాట లిరిక్స్‌తో పాటు అందులో మగవారి వస్త్రధారణ కూడా మహిళల మాదిరి ఉండటం ఆయన తప్పుబట్టారు. కానీ ప్రేక్షకుల అఖండ మద్దతుతో ఇలాంటివి మరిన్నీ వస్తున్నాయిని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు చూడాలి అనే విషయంలో కూడా బాధ్యత వహించాలి.. ఇలాంటి వాటిని మెచ్చుకుంటూ పోతే రాబోయే రోజుల్లో ఇలాంటి చిత్రాలే ఎక్కువ వస్తాయి. ఇప్పటికైనా ఇటువంటి చిత్రాలకు దూరంగా ఉండాలని జావేద్ అక్తర్ ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment