ర్యాంపుపై అదరగొట్టిన షబానా - జావేద్ అఖ్తర్ | Shabana azmi - javed akhtar walk the ramp at IIJW | Sakshi
Sakshi News home page

ర్యాంపుపై అదరగొట్టిన షబానా - జావేద్ అఖ్తర్

Published Wed, Aug 7 2013 3:31 PM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM

ర్యాంపుపై అదరగొట్టిన షబానా - జావేద్ అఖ్తర్

ర్యాంపుపై అదరగొట్టిన షబానా - జావేద్ అఖ్తర్

ముంబైలో జరుగుతున్న భారత అంతర్జాతీయ జ్యూయెలరీ వీక్ వేదికపై బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ, ఆమె భర్త, గేయ రచయిత జావేద్ అఖ్తర్ మెరుపులు మెరిపించారు. దంపతులిద్దరూ కలిసి తొలిసారిగా ర్యాంప్పై నడిచి ఆహూతులను అలరించారు. గోలెచా జ్యూయెల్స్ తరఫున వీరు ర్యాంపుపై నడిచి, ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకున్నారు. 61 ఏళ్ల షబానా ఎరుపు, నలుపు లెహంగా ధరించి, నెక్లెస్ పెట్టుకోగా, జావేద్ అఖ్తర్ నల్లటి షేర్వానీ ధరించి తానూ రకరకాల నగలు పెట్టుకున్నారు.

'రాయల్ ఇండియన్ బ్రైడ్స్' పేరుతో నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోలో అద్భుతమైన కట్ వజ్రాలు, సానపట్టని ముడి వజ్రాలు, ముత్యాలు, పగడాలు, కెంపులు.. ఇలా ఎన్నింటినో ప్రదర్శించారు. ఉమ్రావో జాన్, లక్ బై ఛాన్స్, ద్రోణ లాంటి అనేక సినిమాలకు ఆభరణాలు సమకూర్చడంతో పాటు మిస్ ఇండియా యూనివర్స్ కిరీటాలను కూడా గోలెచా జ్యూయెలరీ సంస్థ అందించింది. బుధవారం నాటి ప్రదర్శనలో షబానా జంట ధరించిన నగలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ విక్రం ఫడ్నిస్ డిజైన్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement