బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్‌తో కలిసి మూడు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసినట్లు దర్శకుడు మిలన్ లుథ్రియా
తెలిపారు. ఆమెతో కలిసి పనిచేసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తమ ఇద్దరి కాంబినేషనల్ వచ్చే చిత్రాలు అద్భుతమైన సృజనాత్మకతను సంతరించుకుంటాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. సోమవారం ఐఏఎన్‌ఎస్ వార్తా సంస్థతో మాట్లాడిన లుథ్రియా.. ఇప్పటి వరకూ తమ ఇద్దరి కాంబినేషనల్ నిర్మితమైన చిత్రాలు విజయవంతమైనట్లు తెలిపారు
గతంలో లూథారియా దర్శకత్వం వహించిన ‘వన్స్ అపాన్ టైమ్ ఇన్ ముంబయి’, ద థర్టీ పిక్చర్ చిత్రాలను ఏక్తాక పూర్ తన సొంత బ్యానర్ అయిన బాలాజీ టెలిఫిలింస్‌లోనే నిర్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చేస్తున్న ‘వన్స్ అపాన్ టైమ్ ఇన్ ముంబయి దోబరా’ తో కలిపి మూడో ప్రాజెక్టును ఏక్తా బ్యానర్‌లో పూర్తి చేసినట్లు మిలన్ తెలిపారు.
చిత్రీకరణ సమయంలో ఒకరి నుంచి ఒకరు చాలా విషయాలు నేర్చుకున్నామన్నారు. కొన్ని సమయాల్లో తమ ఆలోచనలు ఒకే రకంగా ఉన్నా, విరుద్ధమెన భావాలు సంతరించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏక్తాకపూర్‌లో ఉన్న కాన్ఫిడెన్స్ లెవిల్స్ తనకు బాగా నచ్చుతాయని లూథారియా అన్నారు. ‘ మా కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని’ పేర్కొన్నారు.
‘ఏక్తాతో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉంది’
Published Mon, Aug 5 2013 6:56 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement
Advertisement