Milan Luthria
-
పన్నెండేళ్ల తర్వాత.. ఆయన సరసన!
తల్లయిన తర్వాత దాదాపు నాలుగేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు ఐశ్వర్యారాయ్. ‘జజ్బా’తో మళ్లీ నటన మొదలుపెట్టిన ఆమె వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘సరబ్జీత్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అజయ్ దేవగణ్ హీరోగా మిలన్ లూథ్రియా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ‘బాద్షా హో’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. కరీనా కపూర్, ప్రియాంకా చోప్రా లాంటి పేర్లు మొదట ప్రచారంలోకొ చ్చాయి. కానీ, ఆయన ఐశ్వర్యారాయ్‌ని కలిసి, కథ కూడా వినిపించారని భోగట్టా. ఐశ్వర్యకి కథ బాగా నచ్చిందని, నటించడానికి సుముఖంగా ఉన్నారని వినికిడి. అదే జరిగితే పన్నెండేళ్ల తర్వాత అజయ్, ఐష్ కలిసి నటించే చిత్రం ఇదే! -
‘ఏక్తాతో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉంది’
బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్‌తో కలిసి మూడు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసినట్లు దర్శకుడు మిలన్ లుథ్రియా తెలిపారు. ఆమెతో కలిసి పనిచేసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తమ ఇద్దరి కాంబినేషనల్ వచ్చే చిత్రాలు అద్భుతమైన సృజనాత్మకతను సంతరించుకుంటాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. సోమవారం ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో మాట్లాడిన లుథ్రియా.. ఇప్పటి వరకూ తమ ఇద్దరి కాంబినేషనల్ నిర్మితమైన చిత్రాలు విజయవంతమైనట్లు తెలిపారు గతంలో లూథారియా దర్శకత్వం వహించిన ‘వన్స్ అపాన్ టైమ్ ఇన్ ముంబయి’, ద థర్టీ పిక్చర్ చిత్రాలను ఏక్తాక పూర్ తన సొంత బ్యానర్ అయిన బాలాజీ టెలిఫిలింస్లోనే నిర్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చేస్తున్న ‘వన్స్ అపాన్ టైమ్ ఇన్ ముంబయి దోబరా’ తో కలిపి మూడో ప్రాజెక్టును ఏక్తా బ్యానర్లో పూర్తి చేసినట్లు మిలన్ తెలిపారు. చిత్రీకరణ సమయంలో ఒకరి నుంచి ఒకరు చాలా విషయాలు నేర్చుకున్నామన్నారు. కొన్ని సమయాల్లో తమ ఆలోచనలు ఒకే రకంగా ఉన్నా, విరుద్ధమెన భావాలు సంతరించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏక్తాకపూర్లో ఉన్న కాన్ఫిడెన్స్ లెవిల్స్ తనకు బాగా నచ్చుతాయని లూథారియా అన్నారు. ‘ మా కాంబినేషన్లో వచ్చిన సినిమాలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని’ పేర్కొన్నారు.