పన్నెండేళ్ల తర్వాత.. ఆయన సరసన! | Ajay Devgn to romance Aishwarya Rai Bachchan in 'Baadshaho'? | Sakshi
Sakshi News home page

పన్నెండేళ్ల తర్వాత.. ఆయన సరసన!

Published Fri, Apr 8 2016 11:11 PM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM

పన్నెండేళ్ల తర్వాత.. ఆయన సరసన!

పన్నెండేళ్ల తర్వాత.. ఆయన సరసన!

తల్లయిన తర్వాత దాదాపు నాలుగేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు ఐశ్వర్యారాయ్. ‘జజ్బా’తో మళ్లీ నటన మొదలుపెట్టిన ఆమె వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘సరబ్‌జీత్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అజయ్ దేవగణ్ హీరోగా మిలన్ లూథ్రియా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ‘బాద్‌షా హో’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. కరీనా కపూర్, ప్రియాంకా చోప్రా లాంటి పేర్లు మొదట ప్రచారంలోకొ చ్చాయి.

కానీ, ఆయన ఐశ్వర్యారాయ్‌ని కలిసి, కథ కూడా వినిపించారని భోగట్టా. ఐశ్వర్యకి కథ బాగా నచ్చిందని, నటించడానికి సుముఖంగా ఉన్నారని వినికిడి. అదే జరిగితే పన్నెండేళ్ల తర్వాత అజయ్, ఐష్ కలిసి నటించే చిత్రం ఇదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement