'ఫ్యామిలీ, మాస్ ఆడియెన్స్ కోసమే చెన్నై ఎక్స్ ప్రెస్'
'ఫ్యామిలీ, మాస్ ఆడియెన్స్ కోసమే చెన్నై ఎక్స్ ప్రెస్'
Published Sun, Aug 4 2013 9:43 PM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
'చెన్నై ఎక్స్ ప్రెస్' ఇంటిల్లిపాది కలిసి చూసే చిత్రం అని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తెలిపాడు. ప్రస్తుతం షారుఖ్ ఆరోగ్య పరిస్థితి సహకరించకున్నా.. చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో బిజిబిజీగా ఉన్నారు. ఓం శాంతి ఓం చిత్రం తర్వాత దీపికా పదుకోనే, షారుఖ్ లను కలిపి దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందించిన చిత్రం ఆగస్టు 9 తేదిన విడుదలయ్యేందుకు సిద్ధమైంది.
దీవానా, డర్, బాజీగర్, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే చిత్రాల్లాగే అటు ఫ్యామిలీ, ఇటు మాస్ అభిమానులను చెన్నై ఎక్స్ ప్రెస్ ఆకట్టుకుంటుందని షారుఖ్ ధీమా వ్యక్తం చేశాడు. గత పదేళ్లుగా రోహిత్ శెట్టి చిత్రాలను నిర్మించడంతోపాటు గోల్ మాల్ చిత్రంతో విజయాన్ని సాధించాడని.. ఇక చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రం తర్వాత సూపర్ హిట్ అందించిన దర్శకుల జాబితాలో ఆయన చేరడం ఖాయమన్నారు.
చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంలో కామెడీ, డ్రామా, రొమాన్స్ , యాక్షన్ తోపాటు అన్ని రకాల వెరైటీలతో రోహిత్ చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాన్ని అందించాడని షారుఖ్ అభినందించాడు. ఇటీవల భుజానికి గాయం కారణంగా చేయించుకున్న సర్జరీని లెక్క చేయకుండా షారుఖ్... శెట్టి, దీపికా పదుకోనెలతో కలిసి ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
Advertisement
Advertisement