ప్రముఖ నిర్మాతపై పోక్సో కేసు.. ఎందుకంటే? | Case Filed Against Bollywood Producer Ekta Kapoor And Her Mother Shobha Under POCSO Act | Sakshi
Sakshi News home page

Ekta Kapoor: బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌పై పోక్సో కేసు..!

Published Sun, Oct 20 2024 5:20 PM | Last Updated on Sun, Oct 20 2024 5:32 PM

case filed against Bollywood Producer Ekta Kapoor and her Mother Shobha

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌ చిక్కుల్లో పడింది. బాలీవుడ్‌లో ప్రముఖ వెబ్ సిరీస్‌కు సంబంధించి ఆమెపై కేసు నమోదైంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ఆల్ట్ బాలాజీలో ప్రసారమవుతోన్న గంధీ బాత్‌ సీజన్‌-6కు సంబంధించిన ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సిరీస్‌లో మైనర్ బాలికలకు సంబంధించిన అసభ్యకరమైన దృశ్యాలను చూపించారన్న ఆరోపణలతో పోక్సో యాక్ట్‌ కింద ఆమెతో పాటు తల్లి  శోభా కపూర్‌ పేరు కూడా చేర్చారు.

ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆల్ట్ బాలాజీలో  గంధీ బాత్ సీజన్- 6 స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌ను ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 2021 మధ్య ప్రసారం చేశారు. బాలాజీ టెలిఫిల్మ్ లిమిటెడ్ బ్యానర్‌పై ఈ సిరీస్‌ తెరకెక్కించారు. ఈ సంస్థకు వీరిద్దరు యజమానులు కావడంతో ముంబయి పోలీసులు చర్యలు చేపట్టారు. మైనర్లకు సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలు చూపారని ముంబయి పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వివాదాస్పద ఎపిసోడ్ ప్రస్తుతం ఓటీటీలో ప్రసారం కావడం లేదు.

కాగా.. బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ఈ ఏడాది లవ్, సెక్స్ ఔర్ ధోఖా- 2 మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement