
హరిహరన్, అక్తర్ల 'థీమ్ సాంగ్'
తిరువనంతపురం: వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న జాతీయ క్రీడలకు ప్రముఖ గాయకుడు-స్వరకర్త హరిహరన్, రచయిత జావేద్ అక్తర్... ఇతివృత్త గీతం(థీమ్ సాంగ్) అందించనున్నారు. 35వ జాతీయ క్రీడలు జవనరి 31న ప్రారంభంకానున్నాయి. దీనికోసం మూడు నిమిషాల పాటు సాగే ప్రారంభ గీతాన్ని హిందీ భాషలో జావేద్ అక్తర్ రాయనున్నారు. హరిహరన్ సంగీతం సమకూర్చనున్నారు.
ఈ ప్రారంభ గీతావిష్కరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఆటగాళ్ల క్రీడాస్ఫూర్తిని చాటేలా ఈ పాట ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎంఎఫ్ రేడియో ద్వారా దీన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.