Hariharan
-
పాజిటివ్ వచ్చినంత మాత్రాన అందరికీ ఆక్సిజన్ అవసరం ఉండదు
-
సుర్తాల్ యహా(
తబలా మాంత్రికుడు జాకీర్ హుస్సేన్ వాద్యవిన్యాసంలో.. గళమాంత్రికుడు హరిహరన్ కురిపించిన గానామృతంలో.. సిటీ సంగీత ప్రియులు ఓలలాడారు. ఘజల్స్ గడపగా పేరొందిన దక్కనీ సీమలో విరబూసిన హరిహరన్ ఘజల్స్ వేవేల వహ్వాలు అందుకున్నాయి. హరిహరన్, జాకీర్‌హుస్సేన్‌లు రూపొందించిన ‘హాజిర్-2’ ఆల్బమ్ ప్రమోషన్లో భాగంగా మాదాపూర్‌లోని సైబర్‌సిటీ కన్వెన్షన్ సెంటర్లో శనివారం వీరిరువురూ ఇచ్చిన ప్రదర్శన ఆద్యంతం అలరించింది. ‘కుచ్ దూర్ హమారే సాత్..’ ‘దిల్ సే హర్ గుజ్రీ బాత్..’ ‘జియా జియా నా జియా..’ అంటూ హరిహరన్ ఆలపించిన ఘజల్స్‌కు ప్రేక్షకులు తన్మయులయ్యారు. రెండు దశాబ్దాల కిందట ఈ జంట నుంచి ‘హాజిర్’ అల్బమ్ వెలువడింది. ‘హాజిర్ -2’ పేరిట మరోసారి కలవటం ఆనందంగా ఉందన్నారు హరిహరన్. హైదరాబాద్‌లో వీరిద్దరూ కలసి కాన్సర్ట్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. -
చిన్నారి మోక్షజ్ఞ హత్య కేసులో బాబాయి అరెస్టు
-
'నాన్నకు నాపై ప్రేమలేదనే మోక్షజ్ఞను హత్యచేశా'
గుంటూరు: తెనాలికి చెంది చిన్నారి మోక్షజ్ఞ తేజ హత్య కేసులో బాబాయి హరిహరన్ను తాడేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా హరిహరన్ మాట్లాడుతూ తన తండ్రి రాంబాబు తనపై ప్రేమ చూపించడంలేదన్న కసితోనే మోక్షజ్ఞను హతమార్చినట్లు చెప్పాడు. మోక్షజ్ఞ తేజ మృత దేహం కృష్ణానదిలో దొరికిన విషయం తెలిసిందే. ఈ కేసు పూర్వాపరాలు.... తెనాలి బాలాజీరావుపేటలోని మహేంద్రకాలనీకి చెందిన గోడపాటి రాంబాబు పొన్నూరులో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. అతని ముగ్గురు కుమారుల్లో పెద్దవాడైన భాస్కరరావు భార్య విమలప్రియతో కలిసి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న వీరిద్దరూ తమ కుమారుడైన చిన్నారి మోక్షజ్ఞ తేజను ఆరు నెలల కిందట తెనాలిలో ఉంటున్న తాతయ్య, నానమ్మ రాంబాబు, జానకిల వద్ద వదిలి వెళ్లారు. రాంబాబు రెండో కుమారుడు చంద్రశేఖర్ కూడా ఉద్యోగంలో స్థిరపడ్డారు. మూడవ కుమారుడు హరిహరన్ ఇంజినీరింగ్ చదివినప్పటికీ జులాయిగా తిరుగుతుండేవాడని బంధువులు తెలిపారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం మోక్షజ్ఞ తేజ తండ్రి భాస్కరరావు తెనాలి వచ్చి పద్ధతి మార్చుకోవాలని తమ్ముడు హరిహరన్‌కు హితబోధ చేసి వెళ్లారు. దీనిని మనసులో పెట్టుకున్న హరిహరన్ గత నెల 23వ తేదీ బుధవారం సాయంత్రం ఆ చిన్నారిని బయటకు తీసుకెళ్లాడు. రాత్రికి ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెతకనారంభించారు. ఈ క్రమంలో కృష్ణానది వద్దకు వచ్చిన రాంబాబు రెండో కుమారుడు చంద్రశేఖర్‌కు కనకదుర్గమ్మవారధి వద్ద పెద్ద సంఖ్యలో జనం ఉండడంతో కంగారుపడి వెళ్లి చూడగా చిన్నారి మోక్షజ్ఞ నదిలో శవంగా కనిపించాడు. చిన్నారిని తీసుకువచ్చిన బాబాయి హరిహరన్ వారధిపై నుంచి విసిరి నదిలో పడేసి ఉంటాడనే నిర్ధారణకు పోలీసులు వచ్చారు. ఇంటి నుంచి నిందితుడు తెచ్చిన పంచను పోలీసులు వారధిపై కనుగొని ఇక్కడ నుంచే హత్య చేసి ఉంటాడని భావించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న హరిహరన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, తన బిడ్డను తండ్రి, కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని మోక్షజ్ఞ తల్లి విమల ప్రియ ఆరోపించారు. తన భర్త భాస్కరరావుకు జాతకాల పిచ్చి ఉందని ఆమె చెప్పారు. బాబు మృతికి జాతకాల పిచ్చే కారణమని ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ''జాతకాల పిచ్చికి నా బిడ్డ బలయ్యాడు.నా కడుపున పుట్టడమే వాడు చేసిన నేరమా? బిడ్డ పుట్టగానే జాతకం బాగాలేదంటూ పూజలు చేశారు. నా బిడ్డ జాతకంలో తండ్రికి ప్రాణహాని ఉందని ఎవరో సిద్ధాంతి చెప్పారట. నా బిడ్డ కనిపించకుండా పోతే ఒక రోజంతా నాకు తెలియకుండా చేశారు. నేను తెనాలి వచ్చి చూసేంత వరకూ ఆ విషయాన్ని దాచారు. నేనూ, నా బిడ్డ వారికి అడ్డుగా ఉన్నామని చెబితే వారి జీవితాల్లోంచి వెళ్ళిపోయేదాన్ని. అంతేగాని ఇంత ఘాతుకానికి తెగబడి నాకు కడుపుకోత మిగులుస్తారా? నా బిడ్డ ఎలా చనిపోయాడు? ఎవరు చంపారనే విషయాలు బయటకు రావాలి'' అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు భాస్కరరావుతో పెళ్ళైనప్పటి నుంచి ఆయన జాతకాల పిచ్చికి ఎన్నోసార్లు గొడవలు జరిగాయని ఆమె చెప్పారు. పెళ్లయిన కొత్తలో మామకు ప్రమాదం జరిగితే, తనను పెళ్లి చేసుకోవడం వల్లే ఇలా జరిగిందంటూ వేధించాడని చెప్పారు. అయినా పట్టించుకోకుండా ఇన్నాళ్లూ కాపురం చేశానని తెలిపారు. బాధితుల సమస్యలు విన్న ఎస్పీ మాట్లాడుతూ ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించి దర్యాప్తు కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. కన్న బిడ్డ చనిపోవడంతో తమ కోడలు షాక్‌కు గురైందని విమల మామ రాంబాబు చెప్పారు. షాక్ వల్లే అలా మాట్లాడి ఉంటుందని అనుకుంటున్నానన్నారు. తమ కోడలు విమలప్రియ మంచిదేనని చెప్పారు. ఆమె అలా మాట్లాడినందువల్ల తానేమీ బాధపడటం లేదన్నారు. తన కొడుకు హరిహరన్పై కేసు నమోదు చేయమని పోలీసులకు నిజాయతీగా చెప్పానని ఆయన తెలిపారు. -
పసి ప్రాణంపై కసి
*కనకదుర్గమ్మ వారధి వద్ద ఘోరం *నదిలోకి విసిరేసి అన్న కుమారుడిని అంతం చేసిన బాబాయి *తాతయ్య, నానమ్మల వద్దకు వచ్చి బాబాయి చేతికి చిక్కిన చిన్నారి *ఇంటికి రాలేదని వెతుకుతూ వస్తుండగా కనిపించిన మృతదేహం * గుండెలు పగిలేలా రోదిస్తున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ముద్దుముద్దు మాటలు మూగబోయాయి.. బుడిబుడి అడుగులు ఆగిపోయాయి.. ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న చిన్నారి ఇక లేడని తెలిసిన ఆ తల్లిదండ్రుల హృదయాలు తల్లడిల్లాయి. హైదరాబాద్‌కు చెందిన ఏడాదిన్నర చిన్నారి మోక్షజ్ఞ తేజను సొంత బాబారుు హరిహరన్ బుధవారం అర్ధరాత్రి దాటాక కనకదుర్గమ్మ వారిధి పై నుంచి కృష్ణానదిలోకి విసిరి కసిగా ఉసురు తీశాడని తేలడంతో గుండెలు పగిలేలా ఆ దంపతులు రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. తాడేపల్లి రూరల్(గుంటూరు) : అసూయ ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఘాతుకానికి కారకుడైన నిందితుడూ కనిపించకుండా పోయాడు. అసూయతో ఏడాదిన్నర వయస్సుగల చిన్నారిని సొంత బాబాయే కాలయముడై కృష్ణానదిలోకి విసిరి హత్య చేయడం సంచలనం కలిగించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగినట్టుగా భావిస్తున్న ఈ సంఘటనలో మృతి చెందిన చిన్నారిని గురువారం తాడేపల్లి పోలీసులు కనుగొన్నారు. కనకదుర్గమ్మ వారధి 28, 29 ఖానాల మధ్య నదిలో తేలియాడుతున్న మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన చిన్నారి మోక్షజ్ఞతేజ(18 నెలలు)ను తెనాలిలో ఉంటున్న సొంత బాబాయి గోడపాటి హరిహరణ్ వారధిపై నుంచి నదిలోకి విసిరి చంపినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు, కుటుంబీకులు బంధువుల కథనం మేరకు మోక్షజ్ఞతేజ హత్యోదంతానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తెనాలి బాలాజీరావుపేటలోని మహేంద్రకాలనీకి చెందిన గోడపాటి రాంబాబు పొన్నూరులో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. అతని ముగ్గురు కుమారుల్లో పెద్దవాడైన భాస్కరరావు భార్య విమలప్రియతో కలిసి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న వీరిద్దరూ తమ కుమారుడైన చిన్నారి మోక్షజ్ఞ తేజను ఆరు నెలల కిందట తెనాలిలో ఉంటున్న తాతయ్య, నానమ్మ రాంబాబు, జానకిల వద్ద వదిలి వెళ్లారు. ఏఎస్ఐ రాంబాబు రెండో కుమారుడు చంద్రశేఖర్ కూడా ఉద్యోగంలో స్థిరపడగా, మూడవ కుమారుడు, ఈ సంఘటనలో నిందితుడైన హరిహరణ్ ఇంజినీరింగ్ చదివినప్పటికీ జులాయిగా తిరుగుతుండేవాడని బంధువులు తెలిపారు.ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం చిన్నారి మోక్షజ్ఞతేజ తండ్రి భాస్కరరావు తెనాలి వచ్చి పద్ధతి మార్చుకోవాలని తమ్ముడైన హరిహరణ్‌కు హితబోధ చేసి వెళ్లారు. దీనిని మనసులో పెట్టుకున్న హరిహరణ్.. బుధవారం సాయంత్రం ఆ చిన్నారిని బయటకు తీసుకెళ్లాడు. రాత్రికి ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెతకనారంభించారు. ఈ క్రమంలో కృష్ణానది వద్దకు చేరుకున్న రాంబాబు రెండో కుమారుడు చంద్రశేఖర్‌కు కనకదుర్గమ్మవారధి వద్ద పెద్ద సంఖ్యలో జనం ఉండడంతో కంగారుపడి వెళ్లి చూడగా చిన్నారి మోక్షజ్ఞ నదిలో శవంగా కనిపించాడు. దీంతో ఒక్కసారిగా చంద్రశేఖర్ ‘బాబాయి చేతిలో బలైపోయావా నాన్నా’ అంటూ బోరున విలపించాడు. అనంతరం అక్కడకు చేరుకున్న మంగళగిరి రూరల్ సీఐ చిట్టెం కోటేశ్వరరావు, తాడేపల్లి ఎస్ఐ దుర్గాసి వినోద్‌కుమార్‌లకు జరిగిన విషయాన్ని చంద్రశేఖర్ వివరించారు. చిన్నారిని తీసుకువచ్చిన బాబాయి హరిహరణ్ వారధిపై నుంచి విసిరి నదిలో పడేసి ఉంటాడనే నిర్ధారణకు వచ్చారు. వారధిపై ఇంటి నుంచి నిందితుడు తెచ్చిన పంచను పోలీసులు కనుగొని ఇక్కడ నుంచే హత్య చేసి ఉంటాడని భావించారు. చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని మంగళగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
కమల్ సినీజీవితంపై ఓ పుస్తకం
ఇటీవలే షష్టి పూర్తి చేసుకున్న అయిదు దశాబ్దాల సినీ అనుభవజ్ఞుడు కమలహాసన్. ప్రాంతీయ, భాషా భేదాలకు అతీతంగా అభిమానుల్ని సంపాదించుకున్న ఆయనకు కెమేరా ముందు, వెనుక ఎదురైన అనుభవాలు అనేకం. ఆయన జీవిత కథ ఇప్పటికీ సాధికారికంగా పుస్తక రూపంలో రాలేదు. అయితే, ఇప్పుడు ఆయన సినీ జీవిత కృషిని ప్రస్తావిస్తూ ఒక పుస్తకం సిద్ధమైంది. ‘సిటిజన్ కె’ పేరిట కమలహాసన్ సినీ జీవిత చరిత్ర పుస్తకంగా రానుంది. దీర్ఘకాలంగా కమలహాసన్‌కు మిత్రుడూ, అభిమాని, స్వయంగా చిత్ర రూపకర్త, జర్నలిస్టు అయిన హరిహరన్ ఈ పుస్తకం రాస్తున్నారు. ‘ప్రసాద్ ల్యాబ్స్’ వారు నిర్వహిస్తున్న ప్రసాద్ ఫిల్మ్ అకాడెమీకి ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్న ఆయన జీవిత కథలో పూర్తిగా కమల్ సినీ జీవితాన్ని అందిస్తున్నారు. ఈ విషయంపై కమల్ స్పందిస్తూ, ‘‘నా సినీ కృషిని చాలాకాలంగా హరిహరన్ సన్నిహితంగా పరిశీలిస్తున్నారు. ఆ రకంగా ఈ రచన చేసే సాధికారికత ఆయనకుంది. అయితే నా వ్యక్తిగత జీవితంలోని హాట్ హాట్ అంశాలను తెలుసుకోవాలనుకొనేవారిని మాత్రం ఈ పుస్తకం నిరాశపరుస్తుంది’’ అని నవ్వేశారు. ‘‘నా వ్యక్తిగత జీవితం గురించి రాస్తే, కొందరిని అనివార్యంగా నొప్పించాల్సి వస్తుంది. అది సరైన పని కాదు. కాబట్టి, నా గురించి రాయడాన్ని నేను వ్యతిరేకిస్తుంటాను. అయితే, ఇది నా సినీ కృషి మీద పుస్తకం కాబట్టి, ఒప్పుకున్నా’’ అని ఈ నిత్యనూతన నట, దర్శకుడు వివరించారు. అన్నట్లు, కమల్ జీవితకథను ఆయన మాజీ భార్య సారిక పుస్తక రూపంలో తెస్తున్నట్లు ఆ మధ్య కొన్ని వార్తలు వచ్చాయి. కమల్ మాత్రం ఆ వార్తల్ని కొట్టిపారేశారు. ‘‘సారిక అలాంటి పుస్తకం ఏమీ రాయడం లేదు. కాబట్టి, దాన్ని నేను ఆపడమనే ప్రసక్తే లేదు. అవతలివాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ఎలా గౌరవించాలో మా కుటుంబంలో ప్రతి ఒక్కరికీ తెలుసు’’ అని కమలహాసన్ అన్నారు. -
హరిహరన్, అక్తర్‌ల 'థీమ్ సాంగ్'
తిరువనంతపురం: వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న జాతీయ క్రీడలకు ప్రముఖ గాయకుడు-స్వరకర్త హరిహరన్, రచయిత జావేద్ అక్తర్... ఇతివృత్త గీతం(థీమ్ సాంగ్) అందించనున్నారు. 35వ జాతీయ క్రీడలు జవనరి 31న ప్రారంభంకానున్నాయి. దీనికోసం మూడు నిమిషాల పాటు సాగే ప్రారంభ గీతాన్ని హిందీ భాషలో జావేద్ అక్తర్ రాయనున్నారు. హరిహరన్ సంగీతం సమకూర్చనున్నారు. ఈ ప్రారంభ గీతావిష్కరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఆటగాళ్ల క్రీడాస్ఫూర్తిని చాటేలా ఈ పాట ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎంఎఫ్ రేడియో ద్వారా దీన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
మోహ్ అప్‌నేహి రంగ్ రంగ్ మె రంగ్ దే..!
మాండలిన్‌పై సూఫీ గీతం! హరిహరన్‌తో వహ్వాలు అందుకున్న శ్రీనివాస్! ‘‘ఇక్కడ అస్తమించిన సూర్యుడు మరెక్కడో ఉదయిస్తాడు! శుక్రవారం చెన్నైలో నిశ్చలమైన మాండలిన్ శ్రీనివాస్ వేళ్లు మరెక్కడో వేళ్లూనుకుని సంగీత సుధలు పలికిస్తాయి! సరస్వతి ఆయన వేలి కొసలలోకి ప్రవహిస్తుంది కాబట్టే ‘హంసధ్వని’ మన చెవులకు సోకుతుంది! చూస్తూ ఉండండి.. మరేదో తంత్రీ వాయిద్యంతో ఆరేళ్లలో ‘కార్నెగీ హాల్లో’ ప్రపంచాన్ని విస్మయపరుస్తాడు’’ .. మాండలిన్ శ్రీనివాస్ వాద్యకచేరీని ప్రముఖ గాయకుడు హరిహరన్‌తో వీనులవిందుగా ఆలకించిన హైద్రాబాదీల మనోగతం అది! ఏ సందర్భంలో? పద్మవిభూషణ్, సంగీత్ మార్తాండ్ పండిట్ జస్రాజ్ తన తండ్రి, సోదరుల పేరుతో నెలకొల్పిన ‘పండిట్ మోతీరామ్ పండిట్ మణిరామ్ సంగీత్ సమారోహ్’ ఉత్సవాలలో పాల్గొనేందుకు మాండలిన్ శ్రీనివాస్ 2004లో నగరానికి విచ్చేశారు. శ్రీనివాస్ అంటే ఎవరు? సమకాలీన మొజార్ట్! సమకాలీన యహుది మెనుహిన్! మాండలిన్ పుట్టిన తర్వాత కర్ణాటక-హిందుస్తానీ శాస్త్రీయ సంగీతాన్ని పలికించిన అనితరుడు! తూర్పుపడమరల గాయకులు, వాద్యవేత్తలతో వివిధ అంతర్జాతీయ వేదికలపై పాల్గొన్నవాడు! జాన్ మెక్లగిన్ - గిటార్, జకీర్ హుసేన్-తబలా, సెల్వగణేష్-కంజీర, ఘటం.. శంకర్ మహదేవన్ గాత్రంతో యు. శ్రీనివాస్ మాండలిన్‌ను విని మంత్రముగ్ధులైన ప్రేక్షకులు ఆయనను ప్రత్యక్షంగా చూసే అవకాశం విడుచుకుంటారా? శ్రీనివాస్‌ను వినేందుకు, చూసేందుకు సంగీతాభిమానులైన హైద్రాబాదీలు కిక్కిరిసి పోయారు. 2004, డిసెంబర్ 20వ తేదీ, మంగళవారం ఆహ్లాదకరమైన సాయంత్రం.. జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే సాధ్యమైన సంగీత సంగమం ప్రారంభమైంది. పద్మశ్రీ హరిహరన్’ ‘మోహము చెలిపై ముంచిన వాడా..’ తరహాలోని సూఫీ గీతాన్ని అందుకున్నారు! ‘‘మోహె అప్నెహీ రంగ్ మె రంగ్ దే రంగీలా తూ తో సాహెబ్ మొర మెహబూబ్ హి ఇలాయీ...’’ పాటవిని ప్రేక్షకులు పరవశులైనారు! మాండలిన్‌పై శ్రీనివాస్ విన్పించాలి. క్రీ.పూ. 3వేల సంవత్సరాలనాటి తంత్రీ వాద్యం అనేక రూపాలలో పరిణామం చెందుతూ పేర్లను మార్చుకుంటూ ‘మాండలిన్’ అనే పాశ్చాత్యపరికరంగా రూఢి అయిన తర్వాత తొలిసారిగా భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని పలికించిన శ్రీనివాస్ సూఫీ గీతాన్ని ఎలా విన్పిస్తారు? చెవులు రిక్కించి ఉత్కంఠకు లోనైనారు రసహృదయులైన ప్రేక్షకులు! ఏమా అనుభూతి? ఆ శబ్దసౌందర్యానికి గాయకుడైన హరిహరన్ పులకించి పోయాడు. పలుమార్లు ‘వహ్వా’లను పలికారు. ప్రేక్షకుల సంగతి చెప్పాలా? బాలురు నృత్యం చేశారు! శ్రీనివాస్ ‘శిశుర్వేత్తి’ కదా! - పున్నా కృష్ణమూర్తి