
సుర్‌తాల్ యహా(
తబలా మాంత్రికుడు జాకీర్ హుస్సేన్ వాద్యవిన్యాసంలో.. గళమాంత్రికుడు హరిహరన్ కురిపించిన గానామృతంలో.. సిటీ సంగీత ప్రియులు ఓలలాడారు. ఘజల్స్ గడపగా పేరొందిన దక్కనీ సీమలో విరబూసిన హరిహరన్ ఘజల్స్ వేవేల వహ్వాలు అందుకున్నాయి. హరిహరన్, జాకీర్‌హుస్సేన్‌లు రూపొందించిన ‘హాజిర్-2’ ఆల్బమ్ ప్రమోషన్‌లో భాగంగా మాదాపూర్‌లోని సైబర్‌సిటీ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం వీరిరువురూ ఇచ్చిన ప్రదర్శన ఆద్యంతం అలరించింది.
‘కుచ్ దూర్ హమారే సాత్..’ ‘దిల్ సే హర్ గుజ్రీ బాత్..’ ‘జియా జియా నా జియా..’ అంటూ హరిహరన్ ఆలపించిన ఘజల్స్‌కు ప్రేక్షకులు తన్మయులయ్యారు. రెండు దశాబ్దాల కిందట ఈ జంట నుంచి ‘హాజిర్’ అల్బమ్ వెలువడింది. ‘హాజిర్ -2’ పేరిట మరోసారి కలవటం ఆనందంగా ఉందన్నారు హరిహరన్. హైదరాబాద్‌లో వీరిద్దరూ కలసి కాన్సర్ట్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.