న్యూయార్క్: ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ పార్థివ దేహాన్నిఅమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఖననం చేశారు. ఫెర్న్‌వుడ్ సిమెట్రీలో గురువారం ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. అక్కడికి సమీపంలో జరిగిన సంతాప కార్యక్రమంలో శివమణి తదితర కళాకారులు డ్రమ్స్‌తో జాకిర్ హుస్సేన్‌కు సంగీత నివాళులరి్పంచారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న జాకిర్ హుస్సేన్(73) సోమవారం శాన్‌ఫ్రాన్సిస్కోలో కన్నుమూయడం తెలిసిందే.
ఆయనకు తుది వీడ్కోలు పలికిన వారిలో కుటుంబసభ్యులు, సన్నిహితులతోపాటు సంగీత కళాకారులు, సంగీత ప్రేమికులు మొత్తం 300 మంది వరకు హాజరయ్యారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి కూడా హాజరయ్యారు. పద్మ విభూషణ్ గ్రహీత ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ పార్థివ దేహంపై భారత జాతీయ పతాకాన్ని కప్పి, భారత ప్రభుత్వం, ప్రజల తరఫున నివాళులర్పించారు.
జాకిర్ హుస్సేన్ భార్య ఆంటోనియా మిన్నెకొలా, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రధాని మోదీ పంపిన సంతాప సందేశాన్ని చదివి వినిపించారు. భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మార్చిన నిజమైన మేధావి జాకిర్ హుస్సేన్ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment