Sivamani
-
శివమణితో సమానంగా.. జూనియర్ శివమణి!
డ్రమ్స్ పేరు చెప్తే ఇండియాలో శివమణి గుర్తుకు వస్తాడు. ఆయనో పెద్ద డ్రమ్స్ ప్లేయర్. ప్రితీష్ కూడా ఏం తక్కువ కాదు. జూనియర్ శివమణి అని చెప్పచ్చు. ఎ.ఆర్ ప్రీతీష్ వయసు 13 ఏళ్లు. ప్రస్తుతం తల్లిదండ్రులతోపాటు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఐదేళ్ల వయసులో అతను తొలిసారి డ్రమ్స్ చూశాడు. సరదాగా దాని మీద ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత అదే అతనికి పనిగా మారింది. వయసులో తనకన్నా పెద్దవాళ్ళతో పోటీ పడి మరీ వాయించేవాడు.డ్రమ్స్ మీద రకరకాల ప్రయోగాలు చేసేవాడు. 8వ తరగతి వచ్చేనాటికి ప్రదర్శనలు ఇస్తూ అందరి చేతా శభాష్ అనిపించుకునేవాడు. ఆ తర్వాత అతని దృష్టి గిన్నిస్ రికార్డ్ మీద పడింది. ఎలాగైనా దాన్ని సాధించాలని అత్యంత వేగంగా డ్రమ్స్ వాయించడాన్ని నేర్చుకున్నాడు. ఏడు నెలలపాటు అదే పనిగా డ్రమ్స్ వాయించి ఆ పట్టు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గిన్నిస్ ప్రతినిధుల ముందు నిమిషానికి 2,370 సార్లు డ్రమ్స్ వాయించాడు. అంటే ఒక సెకనుకు దాదాపు 40 సార్లు డ్రమ్ వాయించాడు. అతని ప్రతిభ చూసి గిన్నిస్ ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. అత్యంత చిన్న వయసులో ఒక నిమిషంలో అత్యధిక సార్లు డ్రమ్స్ వాయించిన వ్యక్తిగా అధికారిక రికార్డు అందజేశారు. ప్రీతీష్ కల నెరవేరింది.ఇదీ చదవండి: సముద్రం ఒడ్డున రాళ్లు ఏరుతున్నారా..వద్దొద్దు! చిన్నారులకోసం చిన్నారుల గేయంపాడుదాం గేయం తారకలు..తారకలు..తళతళ మెరిసే తారకలుఆకాశంలో అందంగామెరిసే తెల్లని దీపికలుచంద్రుడి పక్కన చుక్కల్లా మెరిసే బంగరు గోపికలుఅంబరానికి తోరణమై నిలిచే అందాల జ్ఞాపికలుఎగరేసే దారం లేదు ఎవరి చేతి ఆధారం లేదుఎత్తున నిలిచే ఊతం అయినా మెరిసే తారకలుఏ రోజూ సెలవు లేదు ఏనాడూ అలుపు రాదువజ్రాలంటి మెరుపు ΄ోదుఅందుకే అవి తారకలుతారకలు..తారకలు..తళతళ మెరిసే తారకలుఆకాశంలో అందంగామెరిసే తెల్లని దీపికలు∙ -
జాకిర్ హుస్సేన్‌కు ఘనంగా అంతిమ వీడ్కోలు
న్యూయార్క్: ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ పార్థివ దేహాన్నిఅమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఖననం చేశారు. ఫెర్న్‌వుడ్ సిమెట్రీలో గురువారం ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. అక్కడికి సమీపంలో జరిగిన సంతాప కార్యక్రమంలో శివమణి తదితర కళాకారులు డ్రమ్స్‌తో జాకిర్ హుస్సేన్‌కు సంగీత నివాళులరి్పంచారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న జాకిర్ హుస్సేన్(73) సోమవారం శాన్ఫ్రాన్సిస్కోలో కన్నుమూయడం తెలిసిందే. ఆయనకు తుది వీడ్కోలు పలికిన వారిలో కుటుంబసభ్యులు, సన్నిహితులతోపాటు సంగీత కళాకారులు, సంగీత ప్రేమికులు మొత్తం 300 మంది వరకు హాజరయ్యారు. శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి కూడా హాజరయ్యారు. పద్మ విభూషణ్ గ్రహీత ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ పార్థివ దేహంపై భారత జాతీయ పతాకాన్ని కప్పి, భారత ప్రభుత్వం, ప్రజల తరఫున నివాళులర్పించారు. జాకిర్ హుస్సేన్ భార్య ఆంటోనియా మిన్నెకొలా, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రధాని మోదీ పంపిన సంతాప సందేశాన్ని చదివి వినిపించారు. భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మార్చిన నిజమైన మేధావి జాకిర్ హుస్సేన్ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
రష్యా వెళ్లలేక.. రైలు కింద పడి
నల్లగొండ క్రైం: రష్యా వెళ్లి చదువుకుంటూ ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా నిలవాలన్న ఆ యువకుడి ఆశ తీరే మార్గం లేక వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ శంకర్, జయమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు శివమణి(19) ఉన్నారు. పెద్దకూతురు వసంతకు మూడేళ్ల క్రితం పెళ్లి చేశారు. రెండో కూతురు ఝాన్సీ ఎమ్మెస్సీ చదివి ఖాళీగానే ఉంటోంది. కుమారుడు శివమణి ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. జీవితంలో త్వరగా స్థిరపడాలని భావించిన శివమణి.. రష్యాలో నర్సింగ్ చదువుతూ అక్కడే ఉద్యోగం పొందాలని భావించారు. రష్యాలో బీఎస్సీ నర్సింగ్ చేసేందుకు ప్రభుత్వ రిక్రూటింగ్ సంస్థ అయిన ‘టాంకాం’ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. 6 నుంచి 8 నెలల పాటు రష్యా భాషపై హైదరాబాద్‌లో శిక్షణ తీసుకోవాల్సి ఉంది. శిక్షణకు, రష్యా వెళ్లేందుకు మొత్తం ఖర్చుకు మూడున్నర లక్షలు కావాలి. దీంతో రెండు నెలలుగా తల్లిదండ్రులు అప్పుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడా అప్పు పుట్టలేదు. శివమణి గతేడాదే రష్యా వెళ్లేందుకు ప్రయతి్నంచగా, డబ్బులు సర్దుబాటు కాలేదు. ఈ ఏడాది కూడా డబ్బు అందకపోవడంతో అవకాశం చేజారిపోతుందని మనస్తాపం చెందాడు. దీంతో శుక్రవారం నల్లగొండ సమీపంలోని బతుకమ్మ చెరువు పక్కన రైల్వేట్రాక్ వద్దకు వెళ్లి.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తన సోదరి ఝాన్సీకి వీడియోకాల్ చేసి లోకేషన్ షేర్ చేశాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో గుంటూరు వైపు వెళుతున్న గూడ్స్‌కు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, రైల్వే పోలీసులు ఘటనా స్థలంలోకి చేరుకొనేలోపే ఈ ఉదంతం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ సాలకమ్మ తెలిపారు. -
ఎయిర్‌పోర్ట్‌లో శివమణి హల్చల్ : గుర్తుపట్టని ప్రయాణీకులు, వైరల్ వీడియో
విమానాశ్రయంలో ప్రయాణీకులంతా లగేజీ కోసం వెయిట్ చేస్తుండగా సడెన్‌గా అద్భుతమైన డ్రమ్ము వాయిద్యం వినిపించింది. దీంతో అందరూ అటువైపు డైవర్ట్ అయిపోయారు. అటు ప్రయాణ అలసట, ఇటు వెయిటింగ్ చిరాకు నుంచి బయటపడి 'హమ్మా-హమ్మ' అంటూ సైలెంట్‌గా గొంతు కలిపారు. కానీ అక్కడున్నది పాపులర్ డ్రమ్మర్ శివమణి చాలా మంది గుర్తించలేకపోయారు.దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్(ట్విటర్)లో తెగ వైరల్ అవుతోంది. కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. లగేజీకోసం వెయిట్ చేయడం మొదలు పెట్టి దాదాపు 40 నిమిషాలై పోయింది. దీంతో ప్యాసింజర్లంతా విసుగ్గా , అసహనంగా అటూ ఇటు కదులున్నారు. దీంతో అక్కడున్న శివమణి ఏమనుకున్నాడో ఏమో గానీ, రంగంలోకి దిగిపోయాడు. కన్వేయర్ బెల్ట్ రైలింగ్‌పై తన డ్రమ్‌స్టిక్‌లను ఉపయోగించి A.R రెహమాన్ స్వరపరిచిన 'హమ్మా-హమ్మ’ పాటను వాయించడం మొదలు పెట్టాడు. తనదైన సిగ్నేచర్ దుస్తులు, స్టయిల్‌తో హమ్మా! అంటూ ముగించాడు. అంతే ఒక్కసారి చప్పట్లు మారుమోగిపోయాయి. ప్రశంసలే ప్రశంసలు. కానీ అక్కడున్నది డ్రమ్మర్ శివమణి అని చాలామంది గుర్తించలేదు. దీనికి సంబంధించిన వీడియోను ఒక ప్యాసింజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఫెలో ప్యాసింజర్ మమ్మల్ని ఇలా ఎంటర్టైన్ చేశారు అంటూ ట్వీట్ చేశారు. దీంతో అది శివమణి అని గుర్తించిన ట్వీపుల్.. అయ్యో. అది గ్రేట్ శివమణి, మీరంతా లక్కీ అంటూ కమెంట్లు పెట్టారు. జనవరి 17న షేర్ అయిన ఈ వీడియో ఏడు లక్షలకుపైగా వ్యూస్‌తో దూసుకుపోతుంది. మరికెందుకు ఆలస్యం మీరు కూడా ఎంజాయ్ చేయండి! -
ఈ నెల 20న ‘ఆట గదరా శివ’ సంగీత కచేరీ
ప్రముఖ నటులు, రచయిత తనికెళ్ల భరణి ‘ఆటగదరా శివ’ అనే పేరుతో ఓ పుస్తకాన్ని పాఠకలోకానికి అందించిన విషయం తెలిసిందే. ఈ పుస్తకం ప్రేక్షకాదరణకు నోచుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులోని అంశాలను ఒక్క కార్యక్రమ రూపంలో కూర్పు చేసి దేశవిదేశాలలో ఎన్నో ప్రదర్శనలిచ్చారు. అమెరికా దుబాయ్ లాంటి పలు దేశాల్లో భారతీయ వాయిద్యాలతో ‘ఆట గదరా శివ’ను కచేరి తరహాలో ప్రదర్శించారు. అయితే ‘ఆట గదరా శివ’ కచేరీ కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయి సంగీత కళాకారుల బృందంతో సింఫనీ తరహాలో ప్రదర్శించేందుకు రంగం సిద్దమైంది. ఇవామ్ (ఐడబ్ల్యూఏఎమ్) సాంస్కృతిక సంస్థ అద్వర్యం లో , తెలంగాణ సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ సమర్పణలో తనికెళ్ళ భరణి సారథ్యంలో తాళ్లూరి నాగరాజు సంగీత దర్శకత్వంలో మణి నాగరాజ్ ‘ఆటగదరా శివా’ కార్యక్రమం చేపట్టారు. ఫ్లూట్ నాగరాజు, డ్రమ్స్ శివమణి తదితర ప్రసిధ్ద కళాకరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. పలు విదేశీ వాయిద్య పరికరాలను ఉపయోగించి ఈ కార్యక్రమాన్ని అజరామరంగా మార్చడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఫిబ్రవరి 20న సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరగనుంది. -
మీటూ: దర్శకుడు శివమణిపై నటి కైరా ఆరోపణలు
సాక్షి, బెంగళూరు: శ్యాండల్వుడ్ను మీటూ ఉద్యమం కుదిపేస్తోంది. సంజన, శ్రుతి హరిహరన్ ఇలా ఒక్కొక్కరుగా లైంగిక వేధింపులపై ఆరోపణలను సంధిస్తున్నారు. తాజాగా మరో నటి కిమ్ కైరా, గాయని శిల్పా మధుసూదన్ తాము సైతం లైంగిక వేధింపులకు గురైనట్లు ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు శివమణి, అతని మేనేజర్ మహేశ్‌లపై నటి కిమ్ కైరా మీ టూ ఆరోపణలు చేశారు. ముంబైకి చెందిన యువ నటి కైరా కన్నడలో అభిరామి అనే సినిమాలో నటించారు. కన్న డ చిత్రరంగంలో నిలదొక్కుకోవాలని తాపత్రయపడుతున్న తన ఆశలను ఆసరాగా చే సుకుని దర్శకుడు శివమణి, మహేశ్‌లు అకృత్యానికి యత్నించారని ఫేస్బుక్లో కైరా చె ప్పారు. శివమణి చిత్రంలో నటించే అవకా శం కల్పిస్తానని ఆశ చూపి, ఒక ప్రైవేటు హో టల్‌కు రావాల్సిందిగా మహేశ్ తనకు సూ చించినట్లు కైరా తెలిపారు. మహేశ్ మాటలు నమ్మి తాను ఆ హోటల్‌కు వెళితే అక్కడ తనపై లైంగిక దాడికి యత్నించాడని ఆరోపించారు. మహేశ్ప్రవర్తనతో భయపడిన తాను ఎలాగోలా అక్కడ నుంచి బయటపడ్డానన్నారు. ఇప్పటికే హీరో అర్జున్‌సర్జాపై శ్రుతి ఆరోపణలతో కలకలం రేగిన శ్యాండల్‌వుడ్ కైరా వ్యాఖ్యలతో ఇంకా ఇరకాటంలో పడింది. కైరా ఎవరో తెలియదు: శివమణి కైరా ఆరోపణలను దర్శకుడు శివమణి కొట్టిపారేశారు. కైరా ఎవరో కూడా తెలియదని చెప్పారు. తాను దర్శకత్వం వదిలేసి ఐదేళ్లు కావస్తుందని, ఇలాంటి సమయంలో తనపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. గళమెత్తిన గాయని శిల్పా యువ గాయని శిల్పా మధుసూదన్ కూడా మీ టూ అన్నారు. కన్నడ సంగీత ప్రపంచంలోనూ లైంగిక వేధింపుల సంఘటనలు ఉన్నాయని ఫేస్బుక్లో పోస్టు చేశారు. అవకాశాల కోసం గాయనిలు కూడా త్యాగాలు చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆమె ఎవరి పేరు చెప్పకుండా ఆరోపణలు చేయడంతో ఎవరై ఉంటారనేది చర్చనీయాంశమైంది. అర్జున్ మంచివాడు: హరిప్రియ సాక్షి బెంగళూరు: నటుడు అర్జున్‌పై నటి శ్రుతి హరిహరన్ మీటూ ఆరోపణలను మరో నటి హరిప్రియా కొట్టిపారేశారు. ఆమె అలాంటి ఆరోపణలు చేయడం చాలా బాధకరమని అన్నారు. ఏడెనెమిదేళ్లుగా అర్జున్ తెలుసని, ఆయనతో కలసి తమిళంలో ఒక సినిమాలో నటించానని చెప్పారు. ఆయనతో నటించే సమయంలో తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. అర్జున్‌కు సినిమా సెట్లో అందరూ గౌరవించేవారని, ఆయన కూడా మహిళలను ఎంతో గౌరవంగా చూసుకునేవారని చెప్పారు. ప్రతి మహిళతో అమ్మ అని సంభోదిస్తూ అర్జున్ మాట్లాడుతారని, అలాంటి నటుడిపై ఇలాంటి విధమైన ఆరోపణలు రావడం చాలా దురదృష్టకరమని తెలిపారు. రాజీ బాట నేడు శ్రుతి–అర్జున్ మధ్య సినీ పెద్దల చర్చ మీ టూ ఆరోపణలతో శాండల్‌వుడ్‌కు కంటిమీద కునుకులేకుండా చేసిన శ్రుతి హరిహరన్– అర్జున్ సర్జా వివాదం కొలిక్కి తెచ్చేందుకు సినీ పెద్దలు ప్రయత్నాలు చేపట్టారు. గురువారం వారిద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేయనున్నట్లు కన్నడ ఫిల్మ్ చాంబర్ కార్యధ్యక్షుడు హరీశ్ తెలిపారు. కళాకారుల సంఘం అధ్యక్షుడు, ప్రముఖ నటుడు అంబరీశ్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు జరిగే సమావేశానికి కన్నడ సినీరంగ సీనియర్ నటులు బి.సరోజాదేవీ, జయంతి, ప్రేమ, దర్శకుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొననున్నారు. మీటూ ఉద్యమాన్ని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని హరీశ్ అన్నారు. -
ఆలయాలు కాదు... టాయిలెట్లు కట్టండి...
తూర్పుగోదావరి ,రాజమహేంద్రవరం కల్చరల్ : అమ్మ కడుపులో ఉన్నప్పుడు విన్న ఆమె గుండె చప్పుడే నా తొలి డ్రమ్ బీట్‌కు ప్రేరణ, భూమ్మీద పడ్డాక ఈ రంగంలో తన తండ్రి తొలిగురువని డ్రమ్స్ శివమణి చెప్పారు. బుధవారం గోదావరి డ్యాన్స్ అండ్ లాంటర్న్ ఫెస్టివల్లో ప్రదర్శన ఇవ్వడానికి రాజమహేంద్రవరం వచ్చిన ఆయన మంగళవారం రాత్రి ఓ హోటల్లో విలేకర్లతో ముచ్చటించారు. ‘సిరిసిరి మువ్వ’ సినిమాతో తన సినీ ప్రస్థానం ప్రారంభమైందని వివరించారు. జిల్లాతో ఆయనకున్న అనుబంధం, సినీ పరిశ్రమలో తనకు ప్రోత్సాహకులు, యువ సంగీత కళాకారులు అవలంబించాల్సిన మెళకువలు తదితర అంశాలపై ఆయన తన అభిప్రాయాలను ఇలా వ్యక్తపరిచారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. తమిళనాడులోని అరక్కోణంలో జన్మించాను. 1975లో నా 12వ ఏటా సినీ రంగంలోకి వచ్చా. ఎస్ఎస్ఎల్సీతో చదువు కొండెక్కింది. నా కుమారుడు కుమరన్ శివమణి తన సొంత బాణిలో వెళుతున్నాడు. నా అన్న కొడుకు నన్ను ఫాలో అవుతున్నాడు. అందరూ గురువులే.. సినీ రంగంలో సంగీత దర్శకులు అందరూ నాకు గురువులే. ఎస్.రాజేశ్వరరావు, కేవీ మహదేవన్, పెండ్యాల, చలపతిరావు, చక్రవర్తి, రాజన్–నాగేంద్ర, బాలు సర్ నన్ను ప్రోత్సహించారు. యుగంధర్ సినిమాకు పని చేస్తున్నప్పుడు మహానటుడు ఎన్టీఆర్ నన్ను అభినందించారు. ఇప్పటి వరకూ ఎన్నో చిత్రాలు, ప్రదర్శనలు ఇచ్చాను. తెలుగులో మాట్లాడితే కొట్టారు.. విశాఖలో తెలుగులో మాట్లాడాను. నాకు తెలియకుండానే నా స్నేహితులు చెప్పిన మేరకు అర్థం తెలియకుండా ఓ తప్పుడు పదం మాట్లాడాను. అక్కడ నన్ను ఓ వ్యక్తి కొట్టారు. తెలుగు అన్ని భాషలకంటే తీయని భాష. ఇప్పుడు ధారాళంగా మాట్లాడుతున్నా. సినిమాలో ‘ఎవరికి వారు ఈ లోకంలో.., జోరుమీదున్నావు తుమ్మెద, ‘ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను...’ నాకు నచ్చిన కొన్ని పాటలు. ఆ రోజుల్లో... ఆ రోజుల్లో పరిశ్రమలో అందరం ఓ కుటుంబ సభ్యులుగా ఉండేవాళ్లం. కోడంబాక్కం స్టూడియోల్లో 18 భాషలకు సంబంధించిన సినిమా పాటల రికార్డింగ్ జరుగుతూ ఉండేది. ఎలక్ట్రానిక్ వాయిద్యాల ప్రవేశంతో సంగీత స్వరూప స్వభావాలు మారిపోతున్నాయి. ఇప్పుడు ఎవరికి వారే. అప్పటి సైకిల్ రిక్షాలు.. గోలీ సోడాలు మాయం... గోదావరితో ప్రత్యేక అనుబంధం ఉంది. రాజమహేంద్రవరం అనేకసార్లు వచ్చాను. గోదావరిపై ప్రత్యేక ఆల్బమ్ చేశాను. కోనసీమ సందర్శించాను. అప్పటి వాతావరణం ఇప్పుడు లేదు. రాజమహేంద్రవరం వచ్చినప్పుడు చూసిన సైకిల్ రిక్షాలు, గోలీ సోడాలు కనుమరుగయ్యాయి. గోలీ సోడా కొట్టేటప్పుడు వచ్చే శబ్దంలో మ్యూజిక్ ఉంది. అది ఇప్పుడు మిస్ అవుతున్నా. ఆలయాలు కాదు... టాయిలెట్లు కట్టండి... దేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. ఇప్పటికీ ప్రతి చోటా కొత్తగా ఆలయాలు కడుతున్నారు. మరుగుదొడ్లు(టాయిలెట్) లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు వెంట ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి కిలోమీటర్‌కు ఒక టాయిలెట్ కట్టాలి. వాటికి ప్రముఖుల పేర్లు పెట్టి నిర్వహించాలి. ఇగోతో ఏమీ నేర్చుకోలేరు.. సినీరంగమేకాదు ఏ రంగంలోనైనా ఇగో వదిలిపెట్టినప్పుడు ఎదగగలం. ఇఫ్ యూ ఆర్ రైట్.. యూ విల్ బీ బ్రైట్. పిల్లలు, యువత ప్రకృతిని మిస్ అవుతున్నారు. రైళ్లలో వెళుతున్నప్పుడు ఐపాడ్, ఫోన్ వాడుతున్నారు. నడుస్తున్నప్పుడు కూడా ఎదుటి వ్యక్తి వస్తున్నారని గమనించలేనంతగా ఫోన్ వాడుతున్నారు. అవసరమైనప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో ప్రకృతిని ఆస్వాదించండి’’. -
డై..లాగి కొడితే....
సినిమా : శివమణి రచన: కోన వెంకట్ దర్శకత్వం: పూరీ జగన్నాథ్ వైజాగ్ ఎంత ఫేమస్సో అక్కడి పూర్ణా మార్కెట్ కూడా అంతే ఫేమస్. ఆ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా శివమణి (నాగార్జున) బాధ్యతలు తీసుకుంటాడు. ఆ వెంటనే సిటీలోని రౌడీలు, గూండాలందర్నీ మార్కెట్‌కి పిలిపిస్తాడు. ‘నా పేరు శివమణి.. నాకు కొంచెం మెంటల్ పూర్ణామార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని’.. ఇప్పటి వరకూ ఎవరు ఏం చేశారని నేను అడగా.. కానీ, అన్నీ ఆపేయండి. సడన్‌గా నేనొచ్చి అన్నీ ఆపేయమంటే కష్టంగా ఉంటుంది. అలవాటు చేసుకోండి, మానడానికి ట్రై చేయండి’ అని చెబుతాడు. నాగ్ పలికిన ఆ డైలాగ్ అప్పటికీ.. ఇప్పటికీ పాపులరే. -
కల్చరల్ సెంటర్లో శివమణి సందడి
విజయవాడ(మొగల్రాజపురం) : ప్రముఖ వాయిద్య కారుడు శివమణి బుధవారం ఉదయం ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడను సందర్శించారు. సెంటర్లో ఉన్న వర్ణ చిత్రాలను ఆయనæఆసక్తిగా పరిశీలించారు. కల్చరల్ సెంటర్ వ్యవస్థాపక చైర్మన్ యార్లగడ్డ హరిశ్చంద్రప్రసాద్, కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఇప్పటివరకు సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల గురించి శివమణికిlవివరించారు. సెలబ్రిటి క్రికెట్ టీమ్ ఎం.డి.విష్ణువర్ధన్ ఇందూరి, మాలక్ష్మి ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ తిరుమల శ్రీనివాస్, సీఈవో సందీప్ మండవ శివమణికిlస్వాగతం పలికిన వారిలో ఉన్నారు. -
గుంటూరులో శివమణి ప్రదర్శన
-
శివమెత్తించిన శివమణి
-
శివమెత్తించిన శివమణి
గుంటూరు : ఉద్దండరాయునిపాలెంలో గురువారం నిర్వహించనున్న అమరావతి శంకుస్థాపనకు సర్వం సిద్దమైంది. మరికాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదగా శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ రోజు ఉదయం ముందుగా గణపతి హోమంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు కళాకారులు తమ నృత్యాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో అతిథులను అలరిస్తున్నారు. డ్రమ్మర్ శివమణి తన బృందంతో సభా వేదికను శివమెత్తించారు. సభా ప్రాంగణంలో ప్రజల సౌకర్యార్థం 22 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. 20 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ ప్రసంగాన్ని అందరూ వీక్షించేలా ఈ ఎల్ఈడీ స్క్రీన్లను అమర్చారు. ప్రజలు స్క్రీన్లపై ప్రధాని సందేశం, శంకుస్థాపన కార్యక్రమం తిలకించేలా ఏర్పాటు చేశారు. అమరావతి శంకుస్థాపనకు దేశవిదేశాలనుంచి అతిథులు తరలి వస్తున్నారు. ప్రముఖులతో గన్నవరం విమానాశ్రయం కిటకిటలాడుతోంది. గన్నవరం విమానాశ్రయంలో అతిథులకు మంత్రులు స్వాగతం పలికి ప్రత్యేక వాహనాల్లో శంకుస్థాపన ప్రదేశానికి తీసుకువస్తున్నారు. సభా ప్రాంగణానికి అతిథులు, ప్రజలు చేరుకుంటున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న శివమణి
-
వెంకన్న సన్నిధిలో స్పీకర్ కోడెల, శివమణి
తిరుమల : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రత్యేక దర్శన సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోడెలకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందచేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్, ప్రముఖ వాద్యకారుడు శివమణి కూడా స్వామివారిని దర్శించుకున్నాడు. -
మళ్ళీ.. పెళ్ళికొడుకాయెనే..!
ప్రముఖ వాద్య కళాకారుడు ‘డ్రమ్స్’ శివమణి ఇప్పుడు మళ్ళీ పెళ్ళికొడుకు అవుతున్నారు. ప్రముఖ గజల్ గాయని రూనా రిజ్వీని ఆయన వివాహం చేసుకోనున్నారు. ముంబయ్‌లో వచ్చేవారం ఈ వివాహ వేడుక జరగనుంది. ‘‘ఇది నా జీవితాన్ని మారుస్తున్న సంఘటన. రునాను చాలాకాలంగా ప్రేమిస్తున్నాను. ఈ నవంబర్ 10న కొంతమంది ఆంతరంగికుల మధ్య, పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమంగా మా పెళ్ళి జరగనుంది’’ అని శివమణి వెల్లడించారు. ‘‘వివాహానికి సంబంధించిన ఇతర వివరాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న శివమణి, ‘‘రునాను తన ‘సంగీతం’గా అభివర్ణిస్తున్నారు. ‘‘నా సొంత సంగీతాన్ని పెళ్ళాడబోతున్నందుకు ఎంతో ఉద్విగ్నంగా ఉన్నాను’’ అని ఆయన వ్యాఖ్యానించారు. రూనా రిజ్వీ పేరున్న హిందీ చలనచిత్ర గాయని. దక్షిణాదిలో కూడా కొన్ని సినిమాలకు పాటలు పాడారు. గతంలో ఏ.ఆర్. రెహమాన్, జాకీర్ హుస్సేన్, కున్నక్కుడి వైద్యనాథన్ తదితరులతో కలసి ప్రయోగాత్మక కర్ణాటక సంగీత ఆల్బమ్‌కు రూపకల్పన చేయడం ద్వారా శివమణి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ పైన ‘డ్రమ్స్’ వాద్యకళాకారుడిగా దేశవిదేశాలు తిరిగి, ప్రపంచ ప్రసిద్ధ సంగీతజ్ఞులతో కలసి కార్యక్రమాలు చేశారు. రూనా, శివమణి కొన్నేళ్ళుగా కలసి పనిచేస్తున్నారు. సంగీత కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆ సాన్నిహిత్యం ప్రేమగా, ఇప్పుడు పెళ్ళిగా పరిణమిస్తోంది. ‘‘వాళ్ళిద్దరికీ సంగీతమంటే ప్రేమ. అదే వారిని ఒక్కటి చేసింది’’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. నిజానికి, శివమణికి గతంలో పెళ్ళయింది. మొదటి భార్య క్రషానీ ద్వారా ఆయనకు ఇద్దరు సంతానం. ఇటీవలే తమిళ చిత్రం ‘అరిమా నంబీ’ ద్వారా ఆయన సంగీత దర్శకుడిగా తొలి అడుగు వేశారు. రానున్న తమిళ చిత్రాలు ‘కనిదన్’, ‘అమాలీ తుమాలీ’ చిత్రాలకు కూడా ఆయన సంగీతం అందిస్తున్నారు. మొన్న సంగీత దర్శకత్వం, ఇప్పుడు కొత్తగా పెళ్ళితో మొత్తం మీద ఈ ఏడాది శివమణి జీవితంలో మరపురానిదనే చెప్పుకోవచ్చు. -
రిజ్విని పెళ్లాడనున్న డ్రమ్స్ శివమణి
డ్రమ్స్ శివమణి తన ప్రియురాలు రిజ్విని పెళ్లాడనున్నారు. వీరి వివాహం ఈ నెల 10న ముంబయిలో జరగనుంది. డ్రమ్స్ శివమణి గురించి పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. డ్రమ్స్ కళాకారుడిగా దేశ, విదేశాల్లో ఖ్యాతి గడించిన వ్యక్తి డ్రమ్స్మణి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహ్మాన్‌కు మంచి మిత్రుడు. ఆయనతో కలసి పలు సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెహ్మాన్ సంగీతాన్ని అందించిన పలు చిత్రాలకు డ్రమ్స్ వాయించారు. పలువురు సంగీత దర్శకుల వద్ద పని చేశారు. ఇటీవల అరిమానంబి చిత్రంతో సంగీత దర్శకుడిగా అవతారమెత్తారు. ప్రస్తుతం కణిదన్ అనే చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. డ్రమ్స్ శివమణి తన చిరకాల ప్రియురాలు ప్రముఖ గాయని రుణా రిజ్విని పెళ్లాడనున్నారు. ఈమె ప్రముఖ గజల్ గాయకుడు రాజ్‌కుమార్, ఇంద్రాణి రిజ్విల కూతురు. గాయనిగా హిందీలో మంచి పాపులర్ అయ్యారు. డ్రమ్స్ శివమణి సంగీతాన్ని అందించిన అరిమానంబి చిత్రంలో తమిళరంగానికి పరిచయమయ్యారు. వీరి వివాహం జరగనున్న విషయాన్ని డ్రమ్స్ శివమణి నిర్ధారించారు. ఈ నెల 10వ తేదీన ముంబయిలో పెళ్లి జరగనుందని తెలిపారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌తో కలసి పని చేస్తున్న సమయంలోనే వీరి మధ్య పరిచయం ప్రేమగా మారిందని అదిప్పుడు పెళ్లికి దారి తీసిందని శివమణి సన్నిహిత వర్గాలంటున్నాయి. డ్రమ్స్ శివమణికిది రెండో వివాహం కావడం గమనార్హం. ఈయన ఇది వరకే క్రిషాణిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. -
‘ఉర్జా’లో శివమణి మోత
సాక్షి, బెంగళూరు: ప్రముఖ డ్రమ్స్ వాయిద్యకారుడు శివమణి తన ప్రదర్శనతో విద్యార్థులను ఉర్రూతలూగించాడు. రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(రిమ్స్) సంస్థ ‘ఉర్జా-2013’ పేరిట రిమ్స్ ప్రాంగణంలో నిర్వహించిన మూడు రోజుల నేషనల్ ఇంటర్ కాలేజ్ ఫెస్ట్ ముగింపు ఉత్సవాలు శనివారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ సందర్భగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శివమణి తన డ్రమ్స్ వాయిద్యంతో విద్యార్థులను ఉర్రూతలూగించారు. అంతకుముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో శివమణి మాట్లాడుతూ దివంగత కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్‌కుమార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రాజ్‌కుమార్ తన ప్రదర్శనను ఎంతగానో మెచ్చుకునేవారని తెలిపారు. ఉద్యాననగరిగా పేరుగాంచిన బెంగళూరు అంటే తనకెంతో ఇష్టమని, ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ‘రాగి ముద్దె’ తప్పక రుచిచూస్తానని పేర్కొన్నారు. రిమ్స్ డెరైక్టర్ ఎం.ఆర్.పట్టాభిరామ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సమాజసేవపై అవగాహన కల్పించడంలో భాగంగా ‘టైమ్ టు గివ్ బ్యాక్’ నినాదంతో ఈ ఫెస్ట్‌ను నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఫెస్ట్‌లో ఓటు హక్కు వినియోగంపై కూడా చైతన్యాన్ని కల్పించేందుకు వివిధ సెమినార్లను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. -
నెల్లూరులో శివమణికి సన్నానం