కల్చరల్ సెంటర్‌లో శివమణి సందడి
విజయవాడ(మొగల్రాజపురం) :
ప్రముఖ వాయిద్య కారుడు శివమణి బుధవారం ఉదయం ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడను సందర్శించారు. సెంటర్‌లో ఉన్న వర్ణ చిత్రాలను ఆయనæఆసక్తిగా పరిశీలించారు. కల్చరల్ సెంటర్ వ్యవస్థాపక చైర్మన్ యార్లగడ్డ హరిశ్చంద్రప్రసాద్, కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఇప్పటివరకు సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల గురించి శివమణికిlవివరించారు. సెలబ్రిటి క్రికెట్ టీమ్ ఎం.డి.విష్ణువర్ధన్ ఇందూరి, మాలక్ష్మి ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ తిరుమల శ్రీనివాస్, సీఈవో సందీప్ మండవ శివమణికిlస్వాగతం పలికిన వారిలో ఉన్నారు.