hubbub
-
ఇంద్రకీలాద్రిపై దసరా సందడి
-
రైల్వే స్టేషన్లో దసరా సందడి
విజయవాడ (రైల్వేస్టేషన్) : దసరా శరన్నవరాత్రులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల తాకిడితో రైల్వేస్టేషన్లో శనివారం సందడి ఏర్పడింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు వేచి ఉండేందుకు సాధారణ వెయిటింగ్ హాళ్లతో పాటు 1, 10 ప్లాట్‌ఫాంలలో అత్యాధునిక సౌకర్యాలతో సెంట్రల్ వెయిటింగ్ హాళ్లు అందుబాటులో ఉంచారు. 1, 6 ప్లాట్‌ఫాంలపై అతి తక్కువ రుసుంతో చక్కటి ఏసీ, నాన్ ఏసీతో కూడిన విశ్రాంతి గదులు, డార్మెటరీలు అందుబాటులో ఉన్నాయి. అదనపు బుకింగ్ కౌంటర్లు, ఏటీవీఎంలు భక్తుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే అదనపు బుకింగ్ కౌంటర్లను ఏర్పాటుచేశారు. తూర్పు ముఖద్వారం 1, 2 ప్లాట్‌ఫాంలతో పాటు పార్శిల్ కార్యాలయం, తారాపేట టెర్మినల్‌లో ఈ అదనపు బుకింగ్ కౌంటర్లు ఉన్నాయి. సాధారణ టికెట్ల జారీకి ఏటీవీఎంలు, హ్యాండ్ వెండింగ్ మెషీన్లు సాధారణ టికెట్ల కోసం గంటలకొద్దీ బుకింగ్ కౌంటర్ల ముందు వేచి ఉండకుండా క్షణాల్లో టికెట్ల జారీకి ఇప్పటికే ఏటీవీఎంలు 16, హ్యాండ్ వెండింగ్ మెషీన్లు 3 అందుబాటులో ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు. రైళ్లన్నీ ఫుల్ దసరా రైళ్లన్నీ రద్దీగా నడిచాయి. ఇప్పటికే పలు సాధారణ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉంది. చెన్నై–హౌరా, హౌరా–సికింద్రాబాద్ మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉంది. ప్రత్యేక రైళ్లలో సైతం వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉంది. ప్రథమ చికిత్స కేంద్రం ప్రయాణికులకు అస్వస్థత కలిగితే ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై ఉన్న ప్రథమ చికిత్స కేంద్రానికి వెళ్లవచ్చు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం రైల్వే ఆస్పత్రికి తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏవైనా వస్తువులు పోయినా, చోరీకి గురైనా ఆరో నంబరు ప్లాట్‌ఫాంపై ఉన్న జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. రైల్వేస్టేషన్‌లోనూ దుర్గమ్మ ప్రసాదం ఇంద్రకీలాద్రి వరకూ వెళ్లలేని భక్తులు రైల్వేస్టేషన్లోనే దుర్గమ్మ ప్రసాదం పొందవచ్చు. తూర్పు ముఖద్వారం–1 (ఒకటో నంబరు ప్లాట్‌ఫాం) వద్ద కూడా దుర్గమ్మ లడ్డూ ప్రసాదాన్ని విక్రయిస్తున్నారు. -
కల్చరల్ సెంటర్లో శివమణి సందడి
విజయవాడ(మొగల్రాజపురం) : ప్రముఖ వాయిద్య కారుడు శివమణి బుధవారం ఉదయం ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడను సందర్శించారు. సెంటర్లో ఉన్న వర్ణ చిత్రాలను ఆయనæఆసక్తిగా పరిశీలించారు. కల్చరల్ సెంటర్ వ్యవస్థాపక చైర్మన్ యార్లగడ్డ హరిశ్చంద్రప్రసాద్, కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఇప్పటివరకు సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల గురించి శివమణికిlవివరించారు. సెలబ్రిటి క్రికెట్ టీమ్ ఎం.డి.విష్ణువర్ధన్ ఇందూరి, మాలక్ష్మి ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ తిరుమల శ్రీనివాస్, సీఈవో సందీప్ మండవ శివమణికిlస్వాగతం పలికిన వారిలో ఉన్నారు. -
చివరి రోజూ అదే సందడి
-
భవానీ ఐలాండ్‌లో సందడి
విజయవాడ(భవానీపురం) : భవానీ ఐలాండ్ సాంస్కృతిక ప్రదర్శనలతో సందడిగా మారింది. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని భవానీ ఐలాండ్‌లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నారు. పుష్కర స్నానాలకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు ఐలాండ్‌ను కూడా సందర్శిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి సందడి చేస్తున్నారు. ఆదివారం కూచిపూడి నృత్యాలు, డీటీఎస్ ఆనంద్ మ్యూజిక్, గాయని సత్య వివిధ చిత్రాల్లోని పాటలు ఆలపించారు. మున్నీ తన యాంకరింగ్‌తో సందర్శకులను ఆకట్టుకుంటుంది. భవానీ ఐలాండ్ మేనేజర్ శ్రీధర్ మాట్లాడుతూ పుష్కరాలు ప్రారంభం నుంచి ప్రతి రోజూ ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక ప్రదర్శనలకు సందర్శకుల నుంచి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. ప్రదర్శనలు తిలకించి ఉత్తేజితులవుతున్న సందర్శకులు పెద్ద సంఖ్యలో వేదికపైకి వచ్చి జతకలుపుతున్నారని తెలిపారు. -
పుష్కర శోభ
-
కృష్ణమ్మ చెంత కేరింతలు
-
కృష్ణమ్మ చెంత కేరింతలు
-
ఆరో రోజు పుష్కర శోభ
-
చిన్నారుల చిద్విలాసం
-
దేశవ్యాప్తంగా క్రిస్మస్ సందడి