భవానీ ఐలాండ్‌లో సందడి
విజయవాడ(భవానీపురం) :
భవానీ ఐలాండ్ సాంస్కృతిక ప్రదర్శనలతో సందడిగా మారింది. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని భవానీ ఐలాండ్‌లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నారు. పుష్కర స్నానాలకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు ఐలాండ్‌ను కూడా సందర్శిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి సందడి చేస్తున్నారు. ఆదివారం కూచిపూడి నృత్యాలు, డీటీఎస్ ఆనంద్ మ్యూజిక్, గాయని సత్య వివిధ చిత్రాల్లోని పాటలు ఆలపించారు. మున్నీ తన యాంకరింగ్‌తో సందర్శకులను ఆకట్టుకుంటుంది. భవానీ ఐలాండ్ మేనేజర్ శ్రీధర్ మాట్లాడుతూ పుష్కరాలు ప్రారంభం నుంచి ప్రతి రోజూ ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక ప్రదర్శనలకు సందర్శకుల నుంచి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. ప్రదర్శనలు తిలకించి ఉత్తేజితులవుతున్న సందర్శకులు పెద్ద సంఖ్యలో వేదికపైకి వచ్చి జతకలుపుతున్నారని తెలిపారు.