Cultural center
-
కల్చరల్ సెంటర్ కృషి అభినందనీయం
విజయవాడ (మొగల్రాజపురం) : గ్రామాల్లో నిర్లక్ష్యంగా పడి ఉన్న చారిత్రక సంపద అయిన శాసనాలు, శిల్పాలను పరిరక్షించడానికి విజయవాడ కల్చరల్ సెంటర్ చేస్తున్న కృషి అమోఘమని సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్ పి.విజయబాబు అన్నారు. ఆయన గురువారం ఉదయం కల్చరల్ సెంటర్‌ను సందర్శించారు. జాతీయ చిత్రకళా ప్రదర్శనలో ఏర్పాటు చేసిన చిత్రాలను తిలకించారు. ఏడాదికాలంగా తాము నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల గురించి కల్చరల్ సెంటర్ సీఈవో శివనాగిరెడ్డి వివరించారు. తెలుగు వారి సంస్కృతి, చారిత్రక సంపద పరిరక్షణకు కల్చరల్ సెంటర్ చేస్తున్న కృషిని విజయబాబు అభినందించారు. విజయబాబును సందీప్ మండవ సత్కరించారు. ప్రముఖ నర్తకి కీర్తి, మారిషస్ తెలుగు మహాసభ అధ్యక్షుడు సింహాద్రి లచ్చయ్య పాల్గొన్నారు. -
గణిత మేధావి రామకృష్ణకు సన్మానం
విజయవాడ (మొగల్రాజపురం): క్యూబ్రూట్లో ప్రపంచ రికార్డు సాధించిన గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు వెండ్ర రామకృష్ణ శనివారం ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడను సందర్శించారు. సెంటర్ సీఈవో శివనాగిరెడ్డి, మా లక్ష్మి ప్రాపర్టీస్ సీఈవో సందీప్ మండవ తదితరులు రామకృష్ణను సన్మానించారు. శివనాగిరెడ్డి మాట్లాడుతూ ప్రముఖæ శాస్త్రవేత్తలకు సాధ్యపడని ఘనమూలంలో భాగహార పద్ధతిని కనుగొని దానిపై భారత ప్రభుత్వం నుంచి కాపీరైటు హక్కును రామకృష్ణ పొందారని తెలిపారు. వివిధ ప్రపంచ రికార్డు పుస్తకాల్లో రామకృష్ణ స్థానం సంపాదించుకోవడం సంతోషకరమన్నారు. లయోలా కళాశాల అధ్యాపకుడు శ్రీనివాసరెడ్డి, చింపిరయ్య, చందుకార్తిక్ పాల్గొన్నారు. -
చరిత్ర తెలిస్తే తప్పులు చేయరు
విజయవాడ (మొగల్రాజపురం): చరిత్ర గురించి ప్రతి ఒక్కరూ తెల్సుకోవాలని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం సాయంత్రం ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ లో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి రచించిన ‘ఆంధ్రుల సమగ్ర చరిత్ర–సంస్కృతి’ పుస్తకంలోని అంశాలను తెలియజేస్తూSముద్రించిన కరపత్రాన్ని బుద్ధప్రసాద్ తదితరులు ఆవిష్కరించారు. చరిత్ర గురించి ప్రతి ఒక్కరూ తెల్సుకోవాల్సిన అవసరం ఉందని, దీనివల్ల తప్పులు జరగవని చెప్పారు. రాష్ట్ర చరిత్ర గురించి తెలియజేసే చాలా పుస్తకాలు వచ్చాయని కాని ఈ పుస్తకంలో రాష్ట్రంలో 1956 సంవత్సరం తర్వాత జరిగిన అన్ని అంశాలను పొందుపరిచారన్నారు. పురావస్తుశాఖ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ జి.వి. రామకృష్ణారావు మాట్లాడుతూ ఏపీపీఎస్సీ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం రూపొందించిన ఈ పుస్తకం చరిత్ర తెల్సుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ చదవవచ్చునన్నారు. శివనాగిరెడ్డి మాట్లాడుతూ వారం రోజుల్లో పుస్తకం మార్కెట్లోకి వస్తోందన్నారు. కార్యక్రమంలో ఆంధ్రాఆర్ట్స్ అకాడమి కార్యదర్శి గోళ్ళ నారాయణరావు, జిల్లా రచయితల సంఘం కార్యదర్శి పూర్ణచంద్, గుమ్మా సాంబశివరావు, శ్రీనివాసరెడ్డి, కొసరాజు వెంకటేశ్వరరావు, వి.అనురాధ పాల్గొన్నారు. -
చిత్రకళ అభివృద్ధి చెందాలి
విజయవాడ(మొగల్రాజపురం) : నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో చిత్రకళా వికాసం జరగాల్సిన అవసరం ఉందని ప్రముఖ చిత్రకారుడు ‘పద్మశ్రీ’ ఎస్వీ రామారావు అన్నారు. ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతిలో మంగళవారం క్రియేటివ్lఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో ‘నవ్యాంధ్రలో చిత్రకళా వికాసం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఎస్వీ రామారావు మాట్లాడారు. 12 మంది చిత్రకారులు గీసిన చిత్ర ప్రదర్శనను ఆయన సదస్సు అనంతరం ప్రారంభించి తిలకించారు. కార్యక్రమంలో చిత్రకారుడు సోమంచి విజయకుమార్, ప్రపంచ తెలుగు చిత్రకారుల సమాఖ్య సంఘ కార్యదర్శి బాలయోగి, క్రియేటివ్ అకాడమి అధ్యక్షులు టి.వెంకట్రావ్, ఎం.సి.దాసు, సుంకర చలపతిరావు, ఎన్.సాయిబాబు, కళాధర్ తదితరులు పాల్గొన్నారు. -
కల్చరల్ సెంటర్లో శివమణి సందడి
విజయవాడ(మొగల్రాజపురం) : ప్రముఖ వాయిద్య కారుడు శివమణి బుధవారం ఉదయం ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడను సందర్శించారు. సెంటర్లో ఉన్న వర్ణ చిత్రాలను ఆయనæఆసక్తిగా పరిశీలించారు. కల్చరల్ సెంటర్ వ్యవస్థాపక చైర్మన్ యార్లగడ్డ హరిశ్చంద్రప్రసాద్, కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఇప్పటివరకు సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల గురించి శివమణికిlవివరించారు. సెలబ్రిటి క్రికెట్ టీమ్ ఎం.డి.విష్ణువర్ధన్ ఇందూరి, మాలక్ష్మి ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ తిరుమల శ్రీనివాస్, సీఈవో సందీప్ మండవ శివమణికిlస్వాగతం పలికిన వారిలో ఉన్నారు. -
అద్భుత సాంస్కృతిక కేంద్రానికి అంకురార్పణ
రూ.134 కోట్లతో ఖానామెట్‌లో ఏర్పాటు! మన సంస్కృతి, కళల ప్రదర్శనకు అవకాశం పీపీపీ విధానంలో నిర్మాణానికి ప్రణాళికలు హెచ్ఎండీఏ వినూత్న యోచన సాక్షి, సిటీబ్యూరో : మహానగరంలో అద్భుతమైన ‘సాంస్కృతిక కేంద్రం’ ఏర్పాటు కానుంది. హైదరాబాద్ రీజియన్‌లోని చారిత్రక వారసత్వ, సాంస్కృతిక కళా సంపదను భావితరాలకు అందించడంతో పాటు ప్రపంచ దేశాల్లోనూ మరింత ప్రాచుర్యం కల్పించేందుకు మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నడుం బిగించింది. ఇందులో భాగంగా ఖానామెట్ లేదా ఇజత్నగర్లో భారీ ఎత్తున ఓ ప్రాంగణాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ ప్రాంతంలోని సంస్కృతి, కళా వైభ వం, ఆచారవ్యవహారాలు, ఆహార్యం, వేష భాషల్లోని వైవిధ్యాన్ని కళ్లకు కట్టేలా ఈ సాంస్కృతిక కేంద్రాన్ని తీర్చిదిద్దుతారు. అలాగే స్థానిక కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శనకు వీలు కల్పిస్తారు. ఇందుకోసం ఇక్కడ ప్రత్యేకంగా 4-8 వరకు థియేటర్లను నిర్మిస్తారు. ఇక్కడికి వచ్చే సందర్శకులకు అద్భుత అనుభూతి కల్పించేలా నిర్మాణాలు తీర్చిదిద్దాలన్నది హెచ్ఎండీఏ ప్రణాళిక. సుమారు రూ.134 కోట్ల వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేపట్టేందుకు హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ ప్రయత్నాలు ప్రారంభించారు. కొత్త ప్రాజెక్టులపై ఇటీవల చీఫ్ సెక్రటరీ పి.కె.మహంతితో జరిగిన సమీక్షా సమావేశంలో సాంస్కృతిక కేంద్రం (హ్యాబిటేట్ సెంటర్) ఏర్పాటుపై లోతుగా చర్చించారు. హెచ్ఎండీఏకు 30 ఎకరాల భూమిని 33 ఏళ్లపాటు లీజ్‌కు ఇవ్వడంతో పాటు తనవంతుగా రూ.30 కోట్లు భాగస్వామ్యం అందిస్తే మిగతా రూ.104 కోట్ల నిధులను ఇనిస్టిట్యూషనల్ మెంబర్స్ నుంచి సేకరించ వచ్చని ఓ ప్రైవేటు సంస్థ ఇచ్చిన సూచనలపై అధికారులు సమాలోచనలు చేశారు. అనుకున్నట్లుగా ఈ ప్రాజెక్టు సాకారమైతే మన సాంస్కృతిక కళా వైభవం ప్రపంచ దేశాల ను ఆకట్టుకోవడంతో పాటు నగరంలో ప్రత్యక్షంగా, పరోక్ష్యంగా పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అసలు ఉద్దేశమిది నానాటికీ మరుగున పడిపోతున్న కళలను బ్రతికించడంతో పాటు వీటికి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఒకే చోట లభించేలా చర్యలు చేపడతారు. లిటరేచర్‌కు సంబంధించి లైబ్రరీలు, విజువల్ ఆర్ట్ గ్యాలరీలను శాశ్వతంగా ఏర్పాటు చేస్తారు. చారిత్రక వారసత్వ సంపద, కళలు, సంస్కృతిపై ప్రభుత్వం కొత్తగా చట్టాలు చేయాల్సి వస్తే కొత్తగా నిర్మించే సాంస్కృతిక కళాకేంద్రం ఎంతో ఉపకరిస్తుంది. సంస్కృతి, సంప్రదాయాలు, కళల పట్ల భావితరాల్లో ఆసక్తి కల్పించడం, ఆసక్తి ఉన్నవారిలో నైపుణ్యం పెంచేందుకు ఇక్కడ ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రానికి తగిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 30 ఎకరాల విస్తీర్ణంలో భారీ భవనాలను నిర్మిస్తారు. ఇక్కడ వివిధ కళలకు సంబంధించి శిక్షణ కేంద్రాలను, ఓ రిసోర్స్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. స్వదేశీ, విదేశీ సంస్థల సమావేశాలు, సెమినార్లు, ఎగ్జిబిషన్లు నిర్వహించుకొనేందుకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కాన్ఫరెన్స్ హాళ్లు నిర్మిస్తారు. హైదరాబాద్ సాంస్కృతిక కళా వైభవాన్ని అంతర్జాతీయంగా చాటిచెప్పేందుకు, విదేశీ సంస్థలతో సమన్వయం చేసుకొనేందుకు ఇక్కడ తగిన ఎక్స్‌పర్ట్స్‌ను నియమిస్తారు. విదేశీ ప్రతినిధుల కోసం స్టార్ హోటళ్లు, స్విమ్మింగ్ పూల్స్, క్లబ్‌లు, మసాజ్ సెంటర్లు వంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. సాంస్కృతిక కళా కేంద్రం నిర్వహణకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసి కళల పునరుద్ధరణ, మరింత అభివృద్ధికి కృషి చేస్తారు.