రిజ్విని పెళ్లాడనున్న డ్రమ్స్ శివమణి | Sivamani to tie the knot with singer Runa Rizvi | Sakshi
Sakshi News home page

రిజ్విని పెళ్లాడనున్న డ్రమ్స్ శివమణి

Published Sun, Nov 2 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM

Sivamani to tie the knot with singer Runa Rizvi

డ్రమ్స్ శివమణి తన ప్రియురాలు రిజ్విని పెళ్లాడనున్నారు. వీరి వివాహం ఈ నెల 10న ముంబయిలో జరగనుంది. డ్రమ్స్ శివమణి గురించి పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. డ్రమ్స్ కళాకారుడిగా దేశ, విదేశాల్లో ఖ్యాతి గడించిన వ్యక్తి డ్రమ్స్‌మణి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహ్మాన్‌కు మంచి మిత్రుడు. ఆయనతో కలసి పలు సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెహ్మాన్ సంగీతాన్ని అందించిన పలు చిత్రాలకు డ్రమ్స్ వాయించారు. పలువురు సంగీత దర్శకుల వద్ద పని చేశారు. ఇటీవల అరిమానంబి చిత్రంతో సంగీత దర్శకుడిగా అవతారమెత్తారు. ప్రస్తుతం కణిదన్ అనే చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
 
 డ్రమ్స్ శివమణి తన చిరకాల ప్రియురాలు ప్రముఖ గాయని రుణా రిజ్విని పెళ్లాడనున్నారు. ఈమె ప్రముఖ గజల్ గాయకుడు రాజ్‌కుమార్, ఇంద్రాణి రిజ్విల కూతురు. గాయనిగా హిందీలో మంచి పాపులర్ అయ్యారు. డ్రమ్స్ శివమణి సంగీతాన్ని అందించిన అరిమానంబి చిత్రంలో తమిళరంగానికి పరిచయమయ్యారు. వీరి వివాహం జరగనున్న విషయాన్ని డ్రమ్స్ శివమణి నిర్ధారించారు. ఈ నెల 10వ తేదీన ముంబయిలో పెళ్లి జరగనుందని తెలిపారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌తో కలసి పని చేస్తున్న సమయంలోనే వీరి మధ్య పరిచయం ప్రేమగా మారిందని అదిప్పుడు పెళ్లికి దారి తీసిందని శివమణి సన్నిహిత వర్గాలంటున్నాయి. డ్రమ్స్ శివమణికిది రెండో వివాహం కావడం గమనార్హం. ఈయన ఇది వరకే క్రిషాణిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement