డాలస్, టెక్సస్: తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ మృతి పట్ల ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఎఎఫ్‌సి) ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యవర్గ సమావేశంలో తీవ్ర సంతాపం ప్రకటించింది. ఐఎఎఫ్‌సి అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ "సంగీతరంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత పురస్కారంగా భావించే గ్రామీ పురస్కారన్ని నాల్గు పర్యాయాలు అందుకున్నవారు, ప్రపంచ ప్రఖ్యాత తబలా వాయిద్య విద్వాంసుడు, పద్మవిభూషణ్ జాకీర్ మృతి ప్రపంచంలోని సంగీత ప్రియులందరికీ తీరని లోటని అన్నారు.
పసి ప్రాయంలో ఏడు సంవత్సరాల వయస్సునుండే ఎంతో దీక్షతో తన తండ్రి, సంగీత విద్వాంసుడు అయిన అల్లా రఖా వద్ద తబలా వాయించడంలో మెళుకువలు నేర్చుకుని, విశ్వ వ్యాప్తంగా మేటి సంగీత విద్వాంసులైన రవిశంకర్, ఆలీ అఖ్బర్ ఖాన్, శివశంకర శర్మ, జాన్ మేక్లెగ్లిన్, ఎల్. శంకర్ లాంటి వారెందరితోనో 6 దశాబ్దలాగా పలు మార్లు, ఎన్నో విశ్వ వేదికలమీద సంగీతకచేరీలు చేసి అందరి అభిమానాన్ని చూరగొన్న జాకీర్ మృతిపట్ల వారి కుటుంబ సభ్యులుకు తీవ్ర సంతాపం తెలియజేస్తూ, జాకీర్ తో తనకున్న ప్రత్యక్ష పరిచయాన్ని, తాను జరిపిన ముఖా-ముఖీ కార్యక్రమ లంకెను పంచుకున్నారు.
ఈ సమావేశంలో ఐఎఎఫ్‌సి ఉపాధ్యక్షులు తాయబ్ కుండా వాలా, రావు కల్వ ల, కార్యదర్శి మురళి వెన్నం, కోశాధికారి రన్నా జానీ, బోర్డ్ సభ్యులు రాంకీ చేబ్రోలు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment