సాక్షి, ముంబై: ప్రముఖ సినీ రచయిత జావేద్ అఖ్తర్ యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ప్రపంచ ఏడోవింతగా పరిగణించే తాజ్‌మహాల్.. భారత సంస్కృతికి మచ్చగా సోమ్ అభివర్ణించడాన్ని తప్పుబట్టారు. 'సంగీత్ సోమ్‌కు చరిత్ర తెలియకపోవడం చాలా గొప్ప విషయంగా భావించాలి. ఆయనకు ఎవరైనా ఆరో తరగతి చరిత్ర పుస్తకాన్ని ఇవ్వండి. మొఘల్ చక్రవర్తి జహంగీర్ జమానాలో భారత్‌కు వచ్చిన డాక్టర్ థామస్ రోయి.. సగటు ఆంగ్లేయుల కంటే భారతీయుల జీవన ప్రమాణాలు ఉన్నతంగా ఉన్నాయని రాశాడు' అని జావేద్ అఖ్తర్ ట్వీట్ చేశారు.
'అక్బర్‌ను ద్వేషించేవాళ్లకు క్లీవ్ (బ్రిటిష్ ఇండియా కమాండర్ ఇన్ చీఫ్)తో ఎలాంటి సమస్యా లేదు. జహంగీర్‌ను ద్వేషించేవాళ్లు వారన్ హస్టింగ్స్ (బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్) గురించి మాట్లాడరు. నిజానికి వాళ్లే నిజమైన దోపిడీదారులు' అని అఖ్తర్ పేర్కొన్నారు.
'తాజ్‌మహాల్ భారత సంస్కృతిపై మచ్చ. హిందువులను నాశనం చేయాలనుకున్న చక్రవర్తి దీనిని నిర్మించారు' అంటూ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచనలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదానికి దూరం జరిగిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. త్వరలోనే ఆగ్రాలోని తాజ్‌మహాల్‌తోపాటు ఇతర చారిత్రక కట్టడాలను సందర్శించేందుకు సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment