Mohan Rao Files A Rs 5 Crore Defamation Case Against Yashoda Movie Team - Sakshi
Sakshi News home page

‘యశోద’ సినిమాపై పరువు నష్టం దావా

Published Fri, Nov 25 2022 2:12 AM | Last Updated on Fri, Nov 25 2022 9:53 AM

Rs 5 Crore Defamation Suit Against Tollywood Movie Yashoda - Sakshi

బంజారాహిల్స్‌: యశోద సినిమాతో తమ సంస్థ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతిందని.. చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్, దర్శకులు హరీష్‌ నారాయణ్, హరిశంకర్, నటి సమంతపై రూ.5 కోట్ల పరువు నష్టందావా వేసినట్లు ఇవ–ఐవీఎఫ్‌ ఎండీ మోహన్‌రావు వెల్లడించారు. గురువారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ఇవ ఐవీఎఫ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఐశ్వర్యతో కలిసి మీడియాతో మాట్లాడారు.

సినిమాలో సరోగసీ స్కాంను వెలికి తీసే దృశ్యాల్లో తమ సంస్థ పేరును వాడుకుని తప్పుచేశారన్నారు. ఎటువంటి అనుమతి లేకుండా సినిమాలో ఇవ ఐవీఎఫ్‌ పేరు ను పలుచోట్ల ప్రస్తావించడంతోపాటు దృశ్యాల్లోనూ తమ ఆస్పత్రిని చూపించారని ఆరోపించారు. 

ఇదీ చదవండి: సమంత ‘యశోద’కు భారీ షాక్‌.. ఓటీటీ విడుదల ఆపాలంటూ కోర్టు ఆదేశం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement