మీరు ఒంటరి కాదని గుర్తుంచుకోండి.. వినేశ్‌ ఫొగాట్‌కు సినీ తారల ఓదార్పు | Samantha And Taapsee Pannu Comments On Vinesh Phogat | Sakshi
Sakshi News home page

మీరు ఒంటరి కాదని గుర్తుంచుకోండి.. వినేశ్‌ ఫొగాట్‌కు మద్ధతుగా సినీ తారలు

Published Wed, Aug 7 2024 3:38 PM | Last Updated on Wed, Aug 7 2024 4:54 PM

Samantha And Taapsee Pannu Comments On Vinesh Phogat

భారత రెజ్లర్‌  వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు పడటంతో ఆమెకు అండగా సినీ ప్రముఖులు కూడా పోస్టులు పెడుతున్నారు. ఒలింపిక్స్‌ చరిత్రలో ఫైనల్‌ చేరిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా ఆమె నిలిచిన విషయం తెలిసిందే. నేడు కూడా గెలిచి బంగారు పతకాన్ని అందకుంటుందని ఆశిస్తే.. అనూహ్యంగా ఆమెపై పారిస్‌ ఒలింపిక్‌ కమిటీ  అనర్హత వేటు వేసింది. 50 కేజీల విభాగంలో ఇవాళ రాత్రి ఫైనల్‌లో వినేశ్‌ తలపడాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె బరువును చూసిన నిర్వాహకులు 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించి అనర్హత వేటు వేస్తన్నట్లు రెజ్లింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. 

దీంతో భారతీయులు తీవ్ర ఆవేదనకు చెందారు. ప్రపంచంలోనే ముగ్గురు టాప్‌ రెజ్లర్లను ఒకేరోజు మట్టికరిపించిన వినేశ్‌ను చూసి యావత్ భారతావని తీవ్ర ఉద్వేగానికి  లోనైంది. ఫైనల్‌ వరకు వినేశ్‌ ఫొగాట్‌ చేరిన తీరును గుర్తు చేసుకుంటూ మద్ధతుగా నిలుస్తున్నారు. ఆమెకు భారత ప్రధాని మోదీ నుంచి నెటిజన్ల వరకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌,టాలీవుడ్‌ ప్రముఖులు కూడా వినేశ్‌ ఫొగాట్‌కు మద్ధతుగా పోస్టులు పెడుతున్నారు.

బాలీవుడ్‌ ప్రముఖులు ఫర్హాన్ అక్తర్, స్వర భాస్కర్, తాప్సీ పన్ను, సోనాక్షి సిన్హాతో పాటు సమంత కూడా వినేశ్‌ ఫొగాట్‌ విషయంలో తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. నటుడు ఫర్హాన్ అక్తర్ వినేశ్‌ ఫొగాట్‌ను ఛాంపియన్ అని పిలుస్తూ.. 'ప్రియమైన వినేశ్‌ మీరు ఓడిపోలేదు. ముందుగా దానిని గుర్తించండి. అయితే, మీలో ఎంత బాధ ఉందో దానిని ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇన్నేళ్ల మీ పోరాటం ఇలా ముగియడంతో భారతీయులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. దేశం కోసం మీరు పోరాడిన తీరుతో మమ్మల్ని గర్వించేలా చేశారు. అని ఫర్షాన్‌  పంచుకున్నారు.

వినేశ్‌ ఫొగాట్‌ వార్త విన్న తర్వాత తనకు ఎంతో హృదయ విదారకంగా ఉందని తాప్సీ పన్ను తెలిపింది. కానీ, వాస్తవంగా ఆమె బంగారు పథకాన్ని దాటి ఎప్పుడో తనదైన ముద్ర వేసిందని చెప్పుకొచ్చింది. సోనాక్షి సిన్హా కూడా ఇలా కామెంట్‌ చేశారు. ' ఇలాంటి సమయంలో ఎలా ఓదార్చాలో కూడా నాకు తెలయదు. మీరు ప్రస్తుతం ఎంతటి బాధలో కూరుకుపోయారో అని ఊహించుకుంటేనే కష్టంగా ఉంది. మీరు ఎప్పటికీ ఛాంపియన్‌గా ఉంటారు అని మాత్రం నేను చెప్పగలను.'

మీరు ఒంటరిగా లేరు: సమంత
నటుడు విక్కీ కౌశల్ కూడా ఇలా కామెంట్‌ చేశారు. 'పతకాలను మించిన విజేత మీరు' అని వ్రాస్తూ ఫోగాట్‌  సాధించిన విజయాన్ని ఆయన అభినందించారు. సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా వ్రాశారు: "కొన్నిసార్లు, పోరాడే వ్యక్తులు చాలా కష్టతరమైన అడ్డంకులను ఎదుర్కొంటారు. మీరు ఒంటరిగా లేరని గుర్తుంచుకోండి, మరింత శక్తితో తిరిగొస్తారు. మీ అద్భుతమైన సామర్థ్యంతో ఎన్నో కష్టాలను దాటుకుంటూ ఇలా నిలదొక్కుకోవడం నిజంగా మెచ్చుకోదగినది.' అని సమంత తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement