defamation petition
-
కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా
సాక్షి,హైదరాబాద్: నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఇవాళ (గురువారం) నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ తరఫు న్యాయవాది వినతించారు.బాల్క సుమన్, తుల ఉమ, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా కేటీఆర్ చేర్చారు. కొండా సురేఖ మాట్లాడిన ఆడియో, వీడియో టేపులను కేటీఆర్ న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. 23 రకాల ఆధారాలను అందజేశారు. తదుపరి విచారణ ఈ నెల 14కు కోర్టు వాయిదా వేసింది. కాగా, ఇప్పటికే మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హీరో అక్కినేని నాగార్జున పిటిషన్ దాఖలు చేయగా, ఆమెకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కొద్దిరోజుల క్రితం అక్కినేని నాగార్జున కుటుంబం మీద ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.ఈ క్రమంలో మంత్రి తమ కుటుంబంపై అమర్యాద పూర్వక వ్యాఖ్యలు చేశారని నాగార్జున కోర్టును ఆశ్రయించి పరువు నష్టం దావా వేశారు. రాజకీయ లబ్ధి కోసమే మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే, తాజాగా స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 23న జరగనుంది. -
‘యశోద’ సినిమాపై పరువు నష్టం దావా
బంజారాహిల్స్: యశోద సినిమాతో తమ సంస్థ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని.. చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్, దర్శకులు హరీష్ నారాయణ్, హరిశంకర్, నటి సమంతపై రూ.5 కోట్ల పరువు నష్టందావా వేసినట్లు ఇవ–ఐవీఎఫ్ ఎండీ మోహన్‌రావు వెల్లడించారు. గురువారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో ఇవ ఐవీఎఫ్ డైరెక్టర్ డాక్టర్ ఐశ్వర్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. సినిమాలో సరోగసీ స్కాంను వెలికి తీసే దృశ్యాల్లో తమ సంస్థ పేరును వాడుకుని తప్పుచేశారన్నారు. ఎటువంటి అనుమతి లేకుండా సినిమాలో ఇవ ఐవీఎఫ్ పేరు ను పలుచోట్ల ప్రస్తావించడంతోపాటు దృశ్యాల్లోనూ తమ ఆస్పత్రిని చూపించారని ఆరోపించారు. ఇదీ చదవండి: సమంత ‘యశోద’కు భారీ షాక్.. ఓటీటీ విడుదల ఆపాలంటూ కోర్టు ఆదేశం! -
ఆంధ్రజ్యోతిపై పరువునష్టం కేసు: ఆర్కే వాంగ్మూలం
హైదరాబాద్ : ఆంధ్రజ్యోతి దినపత్రికపై పరువునష్టం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని నాంపల్లి కోర్టు మంగళవారం నమోదు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తప్పుడు కథనం ప్రచురించి, పరువుకు భంగం కలిగించేలా వార్తలు రాశారంటూ ఎమ్మెల్యే ఆర్కే... ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ, పబ్లిషర్ వెంకట శేషగిరిరావు, ఎడిటర్ శ్రీనివాస్, మరికొందరు ఉద్యోగులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కోర్టు తదుపరి చర్యల్లో భాగంగా తొలుత ఎమ్మెల్యే ఆర్కే వాంగ్మూలాన్ని నమోదుకు ఆదేశించింది. దీంతో కోర్టు ఇవాళ ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసింది. -
ఆంధ్రజ్యోతిపై ఎమ్మెల్యే ఆర్కే పరువునష్టం దావా
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి దినపత్రికపై మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం పరువునష్టం దావా వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై అసత్య కథనాలు రాశారంటూ ఆయన నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు, ఆగస్టు ఒకటో తేదీన ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేయనుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.