సాక్షి,హైదరాబాద్: నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఇవాళ (గురువారం) నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ తరఫు న్యాయవాది వినతించారు.
బాల్క సుమన్, తుల ఉమ, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా కేటీఆర్ చేర్చారు. కొండా సురేఖ మాట్లాడిన ఆడియో, వీడియో టేపులను కేటీఆర్ న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. 23 రకాల ఆధారాలను అందజేశారు. తదుపరి విచారణ ఈ నెల 14కు కోర్టు వాయిదా వేసింది.
కాగా, ఇప్పటికే మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హీరో అక్కినేని నాగార్జున పిటిషన్ దాఖలు చేయగా, ఆమెకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కొద్దిరోజుల క్రితం అక్కినేని నాగార్జున కుటుంబం మీద ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.
ఈ క్రమంలో మంత్రి తమ కుటుంబంపై అమర్యాద పూర్వక వ్యాఖ్యలు చేశారని నాగార్జున కోర్టును ఆశ్రయించి పరువు నష్టం దావా వేశారు. రాజకీయ లబ్ధి కోసమే మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టులో స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే, తాజాగా స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 23న జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment