బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై మరో నటి నోరా ఫతేహి పరువునష్టం దావా వేసింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం నా కెరీర్ నాశనం చేసేందుకు యత్నించారని నోరా ఆరోపించింది. ఆమె వ్యాఖ్యలతో షోలు, ప్రముఖ బ్రాండ్ ఒప్పందాలు కోల్పోయానని వెల్లడించింది. ఆ వార్తలు మీడియాలో రావడంతో తన పరువు పోయిందని ఆమె అన్నారు. జాక్వెలిన్ తన పట్ల ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిందని నోరా ఆరోపించింది. ఈ మేరకు దిల్లీ కోర్టులో జాక్వెలిన్‌పై పరువునష్టం దావా వేసింది బాలీవుడ్ భామ.
(ఇది చదవండి: హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు బెయిల్)
గతంలో జాక్వెలిన్ కోర్టు ముందు రాతపూర్వక వివరణ ఇచ్చింది. ఈ కేసులో ఈడీ నన్ను తప్పుగా చూపిస్తోందని.. నోరా ఫతేహి లాంటి ప్రముఖులు సుకేష్ చంద్రశేఖర్ నుంచి బహుమతులు కూడా పొందారని తెలిపింది. అయితే సుఖేష్ నుంచి తనకు ఎలాంటి బహుమతులు అందలేదని.. నేరుగా అతనితో ఎలాంటి సంబంధం లేదని నోరా పేర్కొంది. ఈ పిటిషన్‌లో అనేక మీడియా సంస్థల పేర్లను కూడా ఆమె పేర్కొంది.
మీడియా సంస్థలు తనపై దుష్ప్రచారం చేయడం సామూహిక దాడి చేయడంతో సమానమని నోరా ఫతేహీ ఆరోపించింది. తనపేరును అన్యాయంగా లాగారని.. ఇదంతా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆదేశాల ప్రకారమే జరిగిందని తెలిపింది. మరోవైపు జాక్వెలిన్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. నోరాపై చాలా గౌరవం ఉందని .. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇద్దరు నటీమణులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment