మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరైంది. ఇటీవల ఈ కేసులో ఆమెకు ఇటీవల స్వల్ప ఊరట లభించగా విదేశాలకు వెళ్లేందుకు ఈడీ ఆమెకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల దుబాయ్ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లినా ఆమెను విమానాశ్రయం అధికారులు అడ్డుకున్నారు. తన దగ్గరు ఈడీ లుక్ అవుట్ నోటీసులు చూసి ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు.
చదవండి: మరోసారి పెళ్లికి సిద్దమవుతున్న 7/G బృందావన కాలని హీరోయిన్..!
ఈ నేపథ్యంలో ఈ రోజు(డిసెంబర్ 8) ఆమె మరోసారి ఈడీ విచారణకు హాజరైంది. వ్యాపారవేత్త సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించి రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నేడు (డిసెంబరు 8) హాజరుకావాలని ఆమెకు ఈ సోమవారమే సమన్లు జారీ చేసింది ఈడీ. దీంతో జాక్వెలిన్ బుధవారం ఉదయం ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చేరుకుంది. ఆమెను విచారించిన అధికారులు జాక్వేలిన్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. కాగా జాక్వేలిన్‌ను ఇదివరకు రెండుసార్లు ఈడీ విచారించిన సంగతి తెలిసిందే.
చదవండి: ప్రముఖ యూట్యూబ్ స్టార్ మృతి, దీప్తి సునైనా దిగ్భ్రాంతి
Actor Jacqueline Fernandez appears before Enforcement Directorate (ED) at its office in Delhi in connection with Rs 200 crore extortion case involving conman Sukesh Chandrasekhar pic.twitter.com/LNd6v5qs2y
— ANI (@ANI) December 8, 2021
Comments
Please login to add a commentAdd a comment