
సాక్షి, వైఎస్సార్: చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా తనపై దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. ఓ పత్రిక తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ.. తప్పుడు కథనాలను రాస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తన పరువుకు భంగం కలిగే విధంగా వార్తలను ప్రచురించిన పత్రికపై పరువునష్టం దావావేసి, పత్రికా యజమాన్యాన్ని కోర్టుకి లాగుతానని డీఎల్ హెచ్చరించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, వ్యక్తిగతంగా కించపరిచే విధంగా వార్తలు రాస్తున్నారని అన్నారు. తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు.