DL Ravindra Reddy
-
మైదుకూరు టీడీపీలో ముసలం
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం జెండా మోసిన నియోజకవర్గ ఇన్చార్జిలకు అధిష్టానం మొండిచేయి చూపనుందా? సర్వేల పేరుతో పక్కన పెడుతున్నారా? అనూహ్యంగా ఆయా మాజీ నేతలను తెరపైకి తెస్తున్నారా.. అంటే..రాజకీయ విశ్లేషకులు ఔనని సమాధానమిస్తున్నారు. ఆ మేరకే జిల్లాలో మూడు నియోజకవర్గాలల్లో ప్రధానంగా మార్పులు చేర్పులు చేయాలనే దిశగా సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా మైదుకూరు నియోజకవర్గం ఒక్కటి. ఇన్చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డిని తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. 2014, 19 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పుట్టా సుధాకర్‌యాదవ్ మైదుకూరు నుంచి తలపడి వైఎస్సార్సీపీ అభ్యర్థి శెట్టిపల్లె రఘురామిరెడ్డి చేతిలో ఓటమి చెందారు. వరుసగా ఓటమి మూటగట్టుకున్న సుధాకర్‌యాదవ్ మరోమారు 2024లో పోటీలో తలపడి అదృష్టం పరీక్షించుకోవాలని తలచారు. కాగా టీడీపీ అధిష్టానం చేయించుకున్న సర్వేలు పుట్టాకు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. మైదుకూరులో టీడీపీ పట్ల అంతంత మాత్రమే ఆదరణ లభించగా, వ్యక్తిగత సర్వేల్లో పుట్టా సుధాకర్ బాగా వెనుకంజలో ఉన్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో పుట్టా స్థానంలో మాజీ ఎమ్మెల్యే డీఎల్‌ను తీసుకొస్తే పోటీ ఇవ్వగలమనే అంచనాకు టీడీపీ అధినేత వచ్చినట్లు తెలుస్తోంది. ఆమేరకు సమాలోచనలో పడినట్లు సమాచారం. డీఎల్‌తో చర్చించేందుకు సన్నాహాలు.... టీడీపీ నిర్వహించిన సర్వేల ఆధారంగా మాజీ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డితో చర్చించేందుకు ఆ పార్టీ సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆ బాధ్యతలను హైదరాబాద్ పార్టీ కార్యాలయం కేంద్రంగా ఇద్దరు నేతలకు అప్పగించినట్లు తెలుస్తోంది. ముందుగా ఆ ఇద్దరు నేతలు మైదుకూరుపై కూలంకషంగా చర్చించిన తర్వాత అధినేత చంద్రబాబుతో మంతనాలు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ మేరకు తొలిదశ చర్చలు చేపట్టినట్లు తెలుస్తోంది. సంపూర్ణంగా మరోమారు వారంలోపు చర్చించిన పిదప అధినేతతో అన్ని విషయాలు తెలియజేసిన తర్వాత మాజీ ఎమ్మెల్యే డీఎల్‌తో ముఖాముఖీ నిర్వహించినున్నట్లు విశ్వసనీయ సమాచారం. పుట్టా సుధాకర్‌యాదవ్ కినుక... అధిష్టానం నుంచి సర్వే సంకేతాలు అందుకున్న పుట్టా సుధాకర్‌యాదవ్ డైలామాలో పడ్డారు. చంద్రబాబు, నారా లోకేష్ లాంటి ప్రధాన నాయకుల పర్యటనలో మినహా తర్వాత రోజులల్లో మైదుకూరులో కన్పించడం లేదు. పక్షం రోజులకు ఓమారు అలా వచ్చి వెళ్తున్నారు. నారాలోకేష్ యువగళం పర్యటన, చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలన కార్యక్రమాలల్లో మాత్రమే నియోజకవర్గంలో పుట్టా కన్పించడం విశేషం. మైదుకూరు టీడీపీ టికెట్‌పై స్పష్టత లేకపోవడం, అధిష్టానం ప్రత్యామ్నాయ చూపులను పసిగట్టిన పుట్టా సన్నిహితుల వద్ద టీడీపీపై మండిపడుతోన్నట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరు, కమలాపురంలలో సైతం.... టీడీపీ అధిష్టానం ప్రొద్దుటూరు ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ఇప్పటికే స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే, విజయం కోసం కృషి చేయాలని, తర్వాత మీ భవిష్యత్ నాదేనని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాతే మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రొద్దుటూరులో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కమలాపురంలో టీడీపీ ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డిది సైతం అదే పరిస్థితి. టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలనే దిశగా సూచనలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమారు కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరికలు పంపినట్లు సమాచారం. రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఓ మాజీ నేత పట్ల టీడీపీ అధినేత ఆకర్షితులవుతున్నట్లు రాజకీయ పరిశీలకులు వివరిస్తున్నారు. -
అవినీతికి కేరాఫ్ డీఎల్ రవీంద్రారెడ్డి
కడప కార్పొరేషన్: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో ఆయనకు నెలకు రూ.50 లక్షల బాడుగలు వచ్చే ఆస్తులున్నాయని చెప్పారు. రాజకీయాల్లోకి రాక ముందు ఆయన ఆస్తి, ఇప్పుడున్న ఆస్తి ఎంత అని నిలదీశారు. గురువారం ఇక్కడ మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎంవైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా బుధవారం రాష్ట్రమంతా వేడుకలు, సేవా కార్యక్రమాలు జరిగాయని, ఈ సంతోషం నుంచి రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేయాలనే కుట్రతోనే డీఎల్ వైఎస్సార్సీపీ పైన, వైఎస్ జగన్ పైన విమర్శలు చేశారని చెప్పారు. రామోజీరావు, రాధాకృష్ణల ఎత్తుగడలో భాగంగానే డీఎల్ ప్రెస్‌మీట్ పెట్టారన్నారు. డీఎల్‌కు నైతిక విలువల్లేవని, నిజాయితీగా ఏ పార్టీకీ పనిచేయలేదని అన్నారు. ఆయన జీవితమంతా అక్రమాలేనని చెప్పారు. రెండుసార్లు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యారని చెప్పారు. కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ కల్తీ మద్యం అమ్మి 20 మంది చనిపోవడానికి కారణమయ్యారని, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యారని తెలిపారు. డీఎల్ గురించి తెలిసే వైఎస్ మంత్రిపదవి ఇవ్వలేదన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో 108 ఒప్పందంలో అక్రమాలకు పాల్పడ్డారని, దీంతో ఆయన విదేశాల్లో ఉండగానే బర్తరఫ్ చేశారని తెలిపారు. 2014లో కాంగ్రెస్‌లో ఉంటూ టీడీపీ అభ్యర్థికి పనిచేశారని, ఆయన సతీమణి సుభద్రమ్మను టీడీపీ ఏజెంట్‌గా కూర్చొబెట్టారని తెలిపారు. 2019కి ముందు వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని గుర్తించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే తమ పార్టీలోకి వచ్చారన్నారు. అయితే టీడీపీకి ఓటెయ్యాలని చెప్పి తనకు, పార్టీకి తీరని ద్రోహం చేశారన్నారు. ఇప్పుడు వైఎస్సార్సీపీలో ఉన్నానని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా అని నిలదీశారు. ఆయనకు అసలు వైఎస్సార్సీపీ సభ్యత్వమే ఇవ్వలేదని చెప్పారు. డీఎల్ నీచ చరిత్ర అందరికి తెలిసిందే: మేయర్ సురేష్‌బాబు డీఎల్ రవీంద్రారెడ్డి నీచ చరిత్ర వైఎస్సార్ జిల్లాలో చంటిపిల్లాడికి కూడా తెలుసని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్ కె. సురేష్ బాబు అన్నారు. డీఎల్ ఓ పొలిటికల్ బ్రోకర్ అని, ఆయన జీవితమంతా బ్లాక్మెయిల్ రాజకీయాలేనని తెలిపారు. పేద విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాలని బైజూస్‌తో ఒప్పందం చేసుకుంటే దానిపైనా విమర్శలు చేయడం దారుణమన్నారు. డీఎల్‌కు ఏ పార్టీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. పవన్ కళ్యాణ్‌లో ఏం నిజాయితీ కనిపించిందో డీఎల్ చెప్పాలని అన్నారు. -
రచ్చ రచ్చ.. మైదుకూరు టీడీపీలో డీఎల్ ‘చిచ్చు’
సాక్షి ప్రతినిధి, కడప: రాబోయే ఎన్నికల్లో మైదుకూరు టీడీపీ టిక్కెట్ నాకంటే నాకంటూ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్‌లు పోటీపడి ప్రచారం చేస్తున్నారు. దీంతో పచ్చ పార్టీలో రచ్చ రోడ్డెక్కింది. పార్టీలో చేరకుండానే సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో వర్గ రాజకీయాలకు ఆజ్యం పోశారు. ఔట్‌డేటెడ్ డీఎల్‌కు టీడీపీ టిక్కెట్ ఇచ్చే ప్రసక్తే లేదని, రాబోయే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని పుట్టా సుధాకర్ యాదవ్ వర్గం తేల్చి చెబుతోంది. దీంతో మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. చదవండి: టీడీపీ నాయకుడి కొడుకు నిర్వాకం.. ‘రూ.40 లక్షలు తెస్తేనే కాపురం చేస్తా’ వచ్చే ఎన్నికల్లో మైదుకూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నారు. జులై నెల నుంచి నియోజకవర్గం మొత్తం తిరిగి ప్రచారం చేయనున్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. దశాబ్దకాలంగా క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న డీఎల్ ఇటీవలి కాలంలో అధికార పార్టీపై పనిగట్టుకుని విమర్శలకు దిగుతూ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ మధ్యే ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లను డీఎల్ హైదరాబాదులో కలిశారు. తర్వాత నియోజకవర్గానికి వచ్చి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తన అనుయాయులతోపాటు మీడియాకు వెల్లడించారు. త్వరలోనే నియోజకవర్గంలో తిరుగుతానని చెప్పిన డీఎల్ అందుకోసం వేద పండితులను సంప్రదించి ముహూర్తం సైతం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈలోగా మైదుకూరు టీడీపీ అభ్యర్థిగా తనను ప్రకటించాలని టీడీపీ అధిష్టానంపై డీఎల్ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇదే సందర్భంలో మైదుకూరులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి తప్ప మిగిలిన వ్యక్తులు ఇప్పటివరకు గెలువలేదని చంద్రబాబు, లోకేష్‌లకు గణాంకాలతో డీఎల్ వివరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తనకే టిక్కెట్ ఇవ్వాలని, ఒకవేళ సుధాకర్ యాదవ్‌కు ఇచ్చినా గెలిచే ప్రసక్తే లేదని డీఎల్ తేల్చి చెప్పినట్లు సమాచారం. చంద్రబాబు ఎటూ తేల్చకపోవడంతో వెనుదిరిగి వచ్చిన ఆయన తనకే టిక్కెట్టు అంటూ మైదుకూరు నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టారు. డీఎల్‌ది మైండ్ గేమ్....టిక్కెట్ నాదే! రాబోయే ఎన్నికల్లోనూ మైదుకూరు టిక్కెట్ తనకేనని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ధీమాగా ఉన్నారు. డీఎల్‌కు టీడీపీ టిక్కెట్ అన్న ప్రచారం నేపథ్యంలో ఆయన మూడు రోజుల కిందట పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. అనంతరం డీఎల్ మైండ్ గేమ్ మాటలు ఎవరూ నమ్మవద్దని నియోజకవర్గంలోని తన వర్గీయులకు తేల్చి చెప్పారు. సుధాకర్ యాదవ్ ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని ఆర్థికంగా నష్టపోయాడని, రెండుసార్లు ఓడిపోయాడన్న సానుభూతితోపాటు ఆర్థికంగా బలోపేతంగా ఉండడం ఆయనకు రాబోయే ఎన్నికల్లో కలిసి వస్తుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. బీసీ సామాజిక వర్గం మొత్తం సుధాకర్ యాదవ్‌కు అండగా నిలవనుందని వారు చెబుతున్నారు. ఇదే సమయంలో సుధాకర్‌యాదవ్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఓ వర్గం ఈ దఫా ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. మరోవైపు డీఎల్ చెప్పిన రెడ్డి సామాజిక వర్గ సెంటిమెంట్‌ను పదేపదే చంద్రబాబు, లోకేష్ చెవిలో వేస్తున్నట్లు తెలుస్తోంది. రచ్చకెక్కిన వర్గ విబేధాలు మైదుకూరు టీడీపీ టిక్కెట్ తనకేనంటూ డీఎల్ రవీంద్రారెడ్డి తెరపైకి రావడంతో పార్టీలో వర్గ విబేధాలు రచ్చకెక్కాయి. సుధాకర్‌యాదవ్‌ను వ్యతిరేకిస్తున్న కొన్ని వర్గాలు డీఎల్‌కు టిక్కెట్ అంటూ ప్రచారం చేస్తుండగా సుధాకర్‌యాదవ్‌కు టిక్కెట్ ఇ వ్వకపోతే పార్టీనే వీడుతామని ఆయన అనుచరవ ర్గం అంటున్నారు. ఒకవేళ డీఎల్‌కు టిక్కెట్టు ఇచ్చినా ఆయనను ఓడగొట్టడం ఖాయమని చెబుతున్నారు. మొత్తంగా మైదుకూరు టీడీపీ టిక్కెట్ ఎవరికి ఇచ్చినా ప్రత్యర్థి వర్గం సహకరించే పరిస్థితి లేదు. -
డీఎల్‌పై మండిపడ్డ మైదుకూరు దళిత ప్రజాప్రతినిధులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యలపై మైదుకూరు దళిత ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, దళితులను కించపరచడం సరికాదన్నారు. స్వార్థ రాజకీయాల కోసం దళితులను వాడుకోవద్దని హితవు పలికారు. ఏపీలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందన్నారు. పంటనష్టం జరిగితే కౌలు రైతులకు ఈ-క్రాప్ ద్వారా ఎకరాకు రూ.18 వేలు సాయం చేశారన్నారు. చదవండి: సింహపురి సమరం.. టీడీపీలో ఎన్నికల భయం -
డీఎల్.. వందల కోట్లు ఎలా సంపాదించావ్?
కడప కార్పొరేషన్: వందల కోట్ల విలువైన ఆస్తులను మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఏ విధంగా సంపాదించారో చెప్పాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనకు సుంకేసులలో చిన్న కొట్టం, రేకుల ఇల్లు ఉండేదని, ఇప్పుడు హైదరాబాద్‌లో రూ.200 కోట్ల విలువైన ఆస్పత్రి, రూ.20 కోట్ల విలువైన ఇల్లు, వందల ఎకరాల భూములు ఉన్నాయని చెప్పారు. ఈ ఆస్తులను ఆయన ఏ వ్యాపారం చేసి సంపాదించారో చెప్పాలని నిలదీశారు. శనివారం ఆయన వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జీవీ సత్రం వద్ద తల్లిదండ్రుల పేరుతో ఆస్పత్రి కడతానని ప్రభుత్వం నుంచి చౌక ధరకు భూమిని పొంది, తర్వాత దాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నాడని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వల్లే డీఎల్ రవీంద్రారెడ్డికి రాజకీయ భిక్ష లభించిందన్నారు. గతంలో మంత్రి పదవిలో ఉండి వైఎస్ జగన్‌కు పోటీగా ఎంపీగా నిలబడి, డిపాజిట్ కూడా దక్కకుండా చిత్తుగా ఓడిన చరిత్ర డీఎల్‌దే అన్నారు. వైఎస్ కుటుంబం దెబ్బ రుచి చూసినా ఆయనకు బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. 2014లో పుట్టా సుధాకర్ యాదవ్‌తో జతకట్టారని, 2019లో ఎవరూ పిలవకపోయినా వైఎస్సార్సీపీలో చేరినా, ఆయన ఏనాడు పార్టీ బలోపేతానికి గానీ, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి విజయానికి గానీ కృషి చేయలేదని తెలిపారు. వ్యవసాయ సలహాదారు పదవికి తాను తగనని డీఎల్ మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు. తాను వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టానని, 50 ఎకరాల పొలాన్ని ఇప్పటికీ సాగు చేస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను వ్యవసాయ సలహాదారుగా నియమించాక, 100 మండలాలు తిరిగి.. పల్లె నిద్ర చేసి, రైతుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నానని వివరించారు. ఈ పదవికి తాను అనర్హుడనని రైతులు చెబితే వెంటనే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. -
‘జగన్‌పై పోటీచేసినా.. నాపై ఆప్యాయత చూపారు’
సాక్షి, కడప : చంద్రబాబు పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని వైఎస్సార్సీపీ నాయకుడు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి మండిపడ్డారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎల్ మాట్లాడుతూ.. 'పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కు అప్పనంగా పనులు అప్పగించారు. రాష్ట్రంలో పనులకు సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కమిషన్ తీసుకోవడం సిగ్గుచేటు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో జరిగిన అన్ని పనులపై సీబీఐ దర్యాప్తు చేయాలి. ఎన్నికల తర్వాత వైఎస్ జగన్‌ను కలిసి ధన్యవాదాలు చెప్పాను. వైఎస్ జగన్‌పై గతంలో నేను ఎన్నికల్లో పోటీ చేసినా నాపై ఆయన చూపిన ప్రేమ ఆప్యాయతలు మర్చిపోలేను. రాష్ట్ర ఖజానాను దోచుకున్న విధానంపై జగన్ దృష్టికి తీసుకెళ్ళాను. కుప్పంలో హంద్రీనీవా పనుల్లో 75 కోట్ల పనులను 400 కోట్లకు పెంచి అవినీతికి పాల్పడ్డారు. అన్ని ప్రాజెక్టుల పనుల్లో వేలకోట్ల అవినీతి జరిగింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి దాదాపు పూర్తి చేసిన పనులకు చంద్రబాబు తిరిగి ఓపెన్ చేశారు. ఆప్కో వల్ల చేనేతలకు కనీస న్యాయం కూడా జరగలేదు. ఆప్కోలో జరిగిన అవినీతిపై ప్రత్యేక విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నా' అని డీఎల్ రవీంద్రా రెడ్డి పేర్కొన్నారు. -
‘ఆ పత్రికపై పరువునష్టం దావా వేస్తా’
సాక్షి, వైఎస్సార్: చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా తనపై దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. ఓ పత్రిక తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ.. తప్పుడు కథనాలను రాస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తన పరువుకు భంగం కలిగే విధంగా వార్తలను ప్రచురించిన పత్రికపై పరువునష్టం దావావేసి, పత్రికా యజమాన్యాన్ని కోర్టుకి లాగుతానని డీఎల్ హెచ్చరించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, వ్యక్తిగతంగా కించపరిచే విధంగా వార్తలు రాస్తున్నారని అన్నారు. తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. -
వైఎసార్సీపీతోనే రాష్ట్రాభివీధి సాద్యం: డీఎల్ రవీద్రారెడ్డి
-
‘‘రాష్ట్రంలో జనం అంతా కలిస్తే జగన్’
-
జనం...జనం కలిస్తే జగన్: డీఎల్
సాక్షి, మైదుకూరు : ‘‘సాధారణంగా గ్రామాల్లో మాట్లాడుకుంటాం. అంటే ఇద్దరు మనుషులు కలిస్తే... నువ్వు నేను కలిస్తే...మనం అంటాం. అలాగే మనం... మనం కలిస్తే.... జనం అంటారు. ఇలాంటి జనం అంతా రాష్ట్రంలో కలిస్తే జగన్’’ అని వైఎస్సార్ సీపీ నేత, మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం వైఎస్సార్ జిల్లా మైదుకూరు బహిరంగ సభలో మాట్లాడుతూ... నువ్వు నేను కలిస్తే మనం. మనం మనం కలిస్తే జనం. జనం జనం కలిస్తే వైఎస్ జగన్. నా ప్రియ మిత్రుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. జరగబోయే ఎన్నికల్లో మైదుకూరు ఎమ్మల్యే అభ్యర్థి రఘురామిరెడ్డి, ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలి. రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల 11 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ఎన్నో అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుని, రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డారు. చంద్రబాబు జన్మభూమి కమిటీల్లో తమ వారికే న్యాయం చేసుకున్నారు. మీ ఓటు ద్వారా ఆయనకు బుద్ధి చెప్పండి. జగన్‌ను సీఎంను చేసుకోవాల్సిన అవసరం మనకుంది. జగన్ సభలకు విపరీతంగా జనాలు వస్తున్నారు. అలాగే అన్ని నియోజకవర్గాల ప్రజలు తమ ప్రేమ, అభిమానాలను ...బ్యాలెట్ రూపంలో చూపించాలి. ఈ సందర్భంగా మీకు ఓ విషయం చెప్పాలి. ఈ నెల 26న ఇంగ్లీష్ దిన పత్రిక ‘ఎకనమిక్స్ టైమ్స్’ చంద్రబాబు నాయుడు విధానాలు...రాబోయే ఎన్నికల్లో పరాజయం తప్పదంటూ ఓ కథనం ప్రచురించింది. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతిలో చంద్రబాబు ఎలా ఓడిపోయారో... అలాగే 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ చేతిలో చంద్రబాబుకు పరాజయం అని రాసింది’ అని డీఎల్ రవీంద్రారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
వైఎస్సార్ సీపీలోకి డీఎల్ రవీంద్రారెడ్డి
-
వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరతా: డీఎల్
సాక్షి, మైదకూరు : త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి బుధవారం ఉదయం ఖాజీపేటలో డీఎల్ రవీంద్రారెడ్డిని కలిశారు. అనంతరం డీఎల్ మాట్లాడుతూ...‘వైఎస్ జగన్ నాకు ఫోన్ చేశారు. మీ సేవలు అవసరం పార్టీలోకి రావాలని కోరారు. చాలా సంవత్సరాలుగా వైఎస్ ఆర్ కుటుంబసభ్యుడిని. వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటా. పది రోజుల్లో భారీ సమావేశం ఏర్పాటు చేస్తా. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ గెలుపు కోసం కృషి చేస్తా. వైఎస్ వివేకానందరెడ్డి స్థానాన్ని భర్తీ చేయాలని జగన్ కోరారు’ అని తెలిపారు. చదవండి....(టీడీపీని భూస్థాపితం చేయడమే నా లక్ష్యం: డీఎల్) సజ్జల రామకృష్ష్ణారెడ్డి మాట్లాడుతూ.. డీఎల్ రవీంద్రారెడ్డి పార్టీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. ఆయన రాకతో పార్టీలో నూతన ఉత్సహం వస్తుంది. అధికారంలోకి రాగానే డీఎల్‌కు ప్రత్యేక స్థానం ఇస్తామని వైఎస్ జగన్ చెప్పారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి మాట్లాడుతూ... మా చిన్నాన్న లేని లోటు డీఎల్ రవీంద్రారెడ్డి తీరుస్తారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే శివ రామకృష్ణయ్య కూడా పార్టీలోకి రావడం శుభ పరిణామం అని అన్నారు. -
టీడీపీని భూస్థాపితం చేయడమే నా టార్గెట్..
సాక్షి, కడప : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడమే తన ధ్యేయమని మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. ఆయన సోమవారం వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలో కార్యకర్తలతో సమావేశం అయ్యారు. రానున్న ఎన్నికల్లో భవిష్యత్ కార్యచరణపై డీఎల్ ఈ సందర్భంగా కార్యకర్తలతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..టీడీపీ సర్కార్ రాష్ట్రంలో పూర్తిగా అవినీతిమయ పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు. మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు గెలుపొందిన డీఎల్ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం జోరుగా జరిగింది కూడా. 2014 ఎన్నికల్లో డీఎల్...టీడీపీకి మద్దతు ఇచ్చినా ఆ తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం డీఎల్ రవీంద్రారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. మైదుకూరు టికెట్ కేటాయించాలని ఈ సందర్భంగా డీఎల్ కోరినట్లు సమాచారం. అయితే చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆయన వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఎల్...టీడీపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడంతో, ఆయన మరో పార్టీలో చేరతారా, లేక ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
కర్మకొద్దీ బాబును గెలిపించారు: డీఎల్
అర్హులు ప్రభుత్వ పథకాలు పొందాలంటే జన్మభూమి కమిటీ సభ్యుల కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని.. ఈ పరిస్థితి చూస్తుంటే కర్మపట్టి ప్రజలు చంద్రబాబును గెలిపించారనిపిస్తోందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన స్వగ్రామం వైఎస్సాఆర్ జిల్లా ఖాజీపేటలోని జెడ్పీ హైస్కూల్లో మంగళవారం నిర్వహించిన జన్మభూమి - మాఊరు గ్రామసభకు ఆయన హాజరయ్యారు. అధికారులు వేదికపైకి ఆహ్వానించినా.. ఆయన ప్రజల మధ్య కూర్చొని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బడ్జెట్లో నిధులే కేటాయించనప్పుడు కొత్త ఇళ్లు ఎలా ఇస్తారని, పంట నష్టపరిహారం మాటేమిటని నిలదీశారు. జన్మభూమి కమిటీ సభ్యులు చెప్పిన వారికి మాత్రమే ఇళ్లు కేటాయిస్తే, అర్హులైన మిగతా వారి సంగతేంటని ప్రశ్నించారు. కమిటీ సభ్యుల కాళ్లు పట్టుకుని బతిమాలుకోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ వ్యవసాయానికి రెండు విడతలుగా కాకుండా ఒకే విడత 7 గంటలు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. -
ఆ తీరు అసహ్యంగా ఉంది: డీఎల్
-
ఆ తీరు అసహ్యంగా ఉంది: డీఎల్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరిగిన తీరు అసహ్యంగా ఉందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. అందుకోసం రూ. వందలాది కోట్లు అనవసర ఆర్భాటానికి ఖర్చు చేశారని విమర్శించారు. రాయలసీమ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఆ అసంతృప్తి ప్రజల్లో ఉందని, అందుకే ప్రత్యేక రాయలసీమ సమావేశాన్ని తిరుపతిలో పెట్టారని డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. అమరావతిపై రాయలసీమలోనే కాదని ఉత్తరాంధ్రలో అసంతృప్తి ఉందని ఆయన అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని రవీంద్రారెడ్డి స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పాలన సరిగ్గా లేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. -
త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటా: డీఎల్
వైఎస్ఆర్ జిల్లా: తన సొంత గ్రామంలో ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. 'నాలాంటి సీనియర్ నేతలను కూడా సీఎం లెక్కచేయనందుకు నిరసనగా సీఎం కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్నాను' అని డీఎల్ ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ నేత మల్లికార్జునరెడ్డి ఈ విషయంలో తనను కలిసి మాట్లాడినట్టు డీఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. త్వరలోనే తమ పార్టీ కార్యకర్తలతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటానని డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. -
సీఎం కిరణ్.. డీఎల్ మంత్రి!
* తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెబ్సైట్లో విచిత్రం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరున్నర మాసాలు గడిచింది. కొత్త ప్రభుత్వమూ వచ్చింది. అయితే, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మాత్రం ముఖ్యమంత్రిగా ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి, తమ శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అంటూ వారి ఫొటోలు, బ్రోచర్లను వెబ్సైట్లో ఉంచేసింది. ‘కమిషనర్ ఆఫ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ’ వెబ్సైట్లో సమైక్యాంధ్ర సీఎం, మంత్రుల బొమ్మలను చేర్చడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం పేరిట వైద్య ఆరోగ్యశాఖ కొత్త వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసినా, అందులో సీఎం కేసీఆర్, ఆశాఖ మంత్రి ఫొటోలు లేకపోవడం పై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
డీఎల్ డీల్ ఏమిటి?
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి ఎక్కడున్నారు? ఎవరితో ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎన్నికల వేళ ఎంతో బిజీబిజీగా ఉండాల్సిన డీఎల్ ఏమయ్యారు? ఆయన కాంగ్రెస్ ని వదిలేశారు. టీడీపీలో చేరారు. పార్టీ తీర్థం పుచ్చుకోకుండానే టీడీపీ మీటింగ్ లో పాల్గొని ప్రసంగించేశారు. డీ ఎల్ అంతటి వాడు మద్దతు పలికితే ఇంకేముందని టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఎగిరి గంతేశారు. సరిగ్గా ఎన్నికల వేడి రాజుకునే సరికి డీఎల్ 'చలో అమెరికా' అంటున్నారు. ఒక్క దెబ్బతో అటు కాంగ్రెస్ ని, ఇటు టీడీపీని గిల్లి జెల్ల కొట్టేశారు. టీడీపీని వాడుకుని వదిలేయడంతో ఆ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇప్పుడు తల పట్టుకుంటున్నారు. అసలు డీఎల్ రాజకీయ డీల్ ఏమిటన్నది ఇప్పుడు టీడీపీ శ్రేణులను వేధిస్తున్న ప్రశ్న. టీడీపీలో చేరకుండానే చేరి, ఉండకుండానే ఉండి, తన అనుచరులకు వీలైనన్ని జడ్ పీ టీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్ సీట్లు ఇప్పించుకుని, వారికి ఓటేయించుకున్నారు. ఒక వేళ స్థానిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులెవరైనా గెలిస్తే వారంతా డీఎల్ మనుషులే. వారంతా పేరుకే తెలుగుదేశం పార్టీ సభ్యులు. ఆ తరువాత టీడీపీతో తనకు పని లేదన్నట్లుగా చక్కగా హ్యాండిచ్చేశారు. ఇప్పుడు ఎంఎల్ఏ, ఎంపీ ఎలక్షన్ల వేడి మొదలయ్యే సరికి సమ్మర్ హాలీడేస్ కి వెళ్లిపోతున్నారు. మొత్తం మీద పచ్చ పార్టీని తెల్లబోయేలా చేశారు డీఎల్ రవీంద్రా రెడ్డి. -
లాగిన్, లాగౌట్, లాగిన్ లాగౌట్
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ ఈ ఎన్నికల్లో ఒక నమూనాగా మిగిలిపోతారు. మొన్న కాంగ్రెస్. నిన్న టీఆర్ ఎస్. నేడు మళ్లీ కాంగ్రెస్.... ఇప్పుడెక్కడున్నారో తెలియదు.... అంతకు మించిన నమూనా మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి. ఆయన యూ టర్న్ తీసుకోవడంలో సరికొత్త రికార్డులనే సృష్టిస్తున్నారు. ఆయనది ఆది నుంచీ కాంగ్రెస్.... ఆ తరువాత కాంగ్రెస్ పై కోపం వచ్చింది. కాంగ్రెస్ వదిలి టీడీపీలో చేరబోతున్నట్టు డీఎల్ రవీంద్రా సంకేతాలు ఇచ్చారు. ఏప్రిల్ 7 న కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం కూడా జరిగింది. కానీ అది జరగలేదు. ఆ తరువాత మళ్లీ ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నానని చెప్పారు. కాంగ్రెస్ ఆయన సతీమణికి మైదుకూరు నుంచి టికెట్ కూడా ఇచ్చింది. కానీ ఇంతలోనే మళ్లీ ఆయన టీడీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆయన టీడీపీ లో చేరతారా లేక మళ్లీ మనసు మార్చుకుంటారా? ఇప్పుడిదే కడప రాజకీయాల్లో హాట్ టాపిక్. -
టీడీపీకి హ్యాండిచ్చిన డీఎల్!
కడప: కాంగ్రెస్ సీనియర్ నేత, మైదుకూరు తాజా మాజీ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రా రెడ్డి తెలుగుదేశం పార్టీకి హ్యాండిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీలోకి చేరేందుకు డీఎల్ ప్రయత్నిస్తున్నారంటూ ఇటీవల వార్తలు రాగా, తాజాగా ఆయన మనసు మార్చుకున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని డీఎల్ నిర్ణయించుకున్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఎన్నికల్లో ఆయన పోటీకి విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్రలో కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీస్తుండటమే దీనికి కారణం. మైదుకూరు శాసనసభ స్థానం నుంచి డీఎల్ తన బదులు భార్యను రంగంలోకి దించే యోచనలో ఉన్నారట. ఈ మేరకు కాంగ్రెస్ పెద్దలతో డీఎల్ సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. -
పచ్చ కండువా కప్పుకునేందుకు డీఎల్ విముఖత
కడప : మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అయిష్టత ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. రాజకీయాల నుంచి విరమించుకోవాలనుకుంటున్న తరుణంలో డీఎల్‌ను తెలుగుదేశం పార్టీ నేతలు సంప్రదించారు. కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయాలని అందుకు అవసరమైన ఖర్చు తామే భరిస్తామని హామీ ఇచ్చారు. గుడ్డికంటే మెల్ల మేలని ఆ ప్రతిపాదనకు డీఎల్ అంగీకరించినట్లు సమాచారం. అయితే అనూహ్యంగా కడప పార్లమెంటు అభ్యర్థిగా మాజీ మంత్రి ఆర్ రాజగోపాల్‌రెడ్డి తనయుడు శ్రీనివాసులరెడ్డి తెరపైకి వచ్చారు. ఈ వ్యవహారంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చొరవ ఉన్నట్లు సమాచారం. దీంతో ఒక్కమారుగా డీఎల్ నిరుత్సాహపడ్డారు. టీడీపీ నుంచి పోటీ చేయని పక్షంలో పచ్చ కండువా ఎందుకు కప్పుకోవాలనే దిశగా డీఎల్ చర్యలు ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగా ఆదివారం రాత్రి ఖాజీపేట నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. మాజీ మంత్రి డీఎల్ బాటలో పీసీసీ మెంబర్ రాంప్రసాద్‌రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా తన అనుచరులను నిలిపినా పార్టీలో చేరేందుకు మాత్రం సుముఖంగా లేరు. ఆమేరకే ప్రజాగర్జనలో టీడీపీ తీర్థం పుచ్చుకునే కార్యక్రమానికి గైర్హాజరు కానున్నట్లు సమాచారం. అసంతృప్తిలో కందుల .. కడప పార్లమెంటు టికెట్ ఆశిస్తున్న కందుల రాజమోహన్‌రెడ్డి సైతం టీడీపీ అనుసరిస్తున్న వైఖరితో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచా రం. పలు పర్యాయాలు వద్దన్నా తమతో పోటీ చేయించి, ఇప్పడు టికెట్ అడిగినా ఇవ్వరా..అన్న ఆక్రోషంలో కందుల శివానందరెడ్డి ఉన్నట్లు సమాచారం. ఇకపై తాను తెలుగుదేశం పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంటానని, నీవు మాత్రమే రాజకీయాలలో కొనసాగవచ్చని సోదరుడు రాజమోహ న్‌రెడ్డికి స్పష్టం చేసినట్లు సమాచారం. ఎంపీ రమేష్ ఏకపక్ష వైఖరితో కందుల సోదరులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమేరకు కొత్తగా చేరినట్లు కాకుండా ప్రజాగర్జనకు మాత్ర మే హాజరైందుకు రాజమోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు కూడా శివానందరెడ్డి దూరంగా ఉండనున్నట్లు సమాచారం. -
రాజకీయాలనుంచి తప్పుకుంటున్నా : డీఎల్
సాక్షి ప్రతినిధి, కడప: ‘రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయి. ఇప్పటి రాజకీయాల్లో కొనసాగలేను. ఇకపై నా మనుగడ కష్టసాధ్యం. మీ సహకారానికి కృతజ్ఞతలు. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోండి’అంటూ మంగళవారం మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తన అనుచరులతో పేర్కొన్నట్లు సమాచారం. ఖాజీపేటలో ఈనెల 5న కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం మంగళవారం ఖాజీపేటకు చేరుకోవడంతో పలువురు అనుచరులు వెళ్లి కలిశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మరోమారు పోటీ చేయాల్సివస్తే హైదరాబాద్‌లోని కూకట్పల్లి నుంచి పోటీ చేస్తానని, మైదుకూరులో పోటీ చేసే ప్రసక్తేలేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. -
బాబుతో జేసీ, డీఎల్ భేటీ?
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడితో కాంగ్రెస్ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకరరెడ్డి, కడప జిల్లా మైదుకూరు శాసనసభ్యుడు డీఎల్ రవీంద్రారెడ్డి గురువారం రాత్రి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై సుమారు అరగంటపాటు చర్చించారు. అంతకుముందు వీరిద్దరూ తెలుగుదేశం ఉపాధ్యక్షుడు సీఎం రమేశ్‌తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్న జేసీ చంద్రబాబుతో భేటీ అరుునట్టు సమాచారం. దివాకరరెడ్డి లేదా ఆయన సోదరుడు ప్రభాకరరెడ్డి అనంతపురం ఎంపీ స్థానానికి, జేసీ కుమారుడు తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయాలని భావిస్తున్నట్టు టీడీపీ వర్గాలు చెప్పాయి. అరుుతే తాను బాబుతో సమావేశం కాలేదని, ఆయన ఇంటిముందు నుంచి వెళితే టీవీల్లో భేటీ అయినట్లు బ్రేకింగ్ న్యూస్ వచ్చిందని జేసీ ‘సాక్షి’కి చెప్పారు. ఇలావుండగా డీఎల్ వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నుంచి పోటీ చేయకుండా టీడీపీ అభ్యర్థి, ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వియ్యంకుడు అరుున సుధాకర్ యాదవ్‌కు మద్దతు ఇవ్వనున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన బాబుతో భేటీ అరుునట్టు తెలుస్తోంది. పలువురి చేరిక: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావుతోపాటు మెదక్ పురపాలక సంఘం మాజీ చైర్మన్ బట్టి జగపతి, గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి చెందిన వై.మురళీధర్‌రెడ్డిలు గురువారం టీడీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని తానేనని, చంద్రబాబు ఈ మేరకు తనకు హామీ ఇచ్చారని మురళీధర్‌రెడ్డి ప్రచారం చేసుకున్నారు. నేతలు రమేష్ రాథోడ్, అరిగెల నాగేశ్వరరావు యాదవ్, గుళ్లపల్లి బుచ్చిలింగం, మైనంపల్లి హనుమంతరావు, ఏకే గంగాధర్, యరపతినేని శ్రీనివాసరావు, చిరుమామిళ్ల మధు తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
'కాంగ్రెస్‌ను కుక్కలు చింపిన విస్తరి చేశారు'
-
కాంగ్రెస్‌ను కుక్కలు చింపిన విస్తరి చేశారు: డీఎల్
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కుక్కలు చింపిన విస్తరి చేశారని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మండిపడ్డారు. ఉరుములు, మెరుపులు వచ్చినంత వేగంగా రాష్ట్ర విభజన చేపట్టారని, దీంతో అందరి మనసులు కలత చెందాయని డీఎల్ అన్నారు. కడపలో నాయకులు, కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీడబ్ల్యుసీ నిర్ణయం వచ్చిన రోజే కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ తమ పదవులకు రాజీనామా చేసి ఉంటే విభజన జరిగి ఉండేది కాదని ఆయన అన్నారు. ఇంతకుముందు తెలుగు మాట్లాడే వాళ్లకు రెండు రాష్ట్రాలుంటే తప్పేంటి అన్న బొత్స, ఇప్పుడు మాత్రం సమైక్యాంద్ర అంటూ కబుర్లు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. -
కుక్కలు చింపిన విస్తరిలా రాష్ట్రం: డీఎల్
మైదుకూరు: అనేక సంఘటనలతో రాష్ట్రం కుక్కలు చించిన విస్తరిలా తయారయిందని మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో రూ. 31 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన స్త్రీశక్తి భవనాన్ని సోమవారం డీఎల్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ మరణంతో రాజకీయాలలో అనిశ్చితి ఏర్పడిందన్నారు. బలహీన సీఎం రావటం, రాష్ట్రంలోని ఇరు ప్రాంతాలలో ఉద్యమాలు చెలరేగడం ఇందుకు కారణాలన్నారు. గాంధీ పుట్టిన దేశంలో ఏమైపోతున్నామో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ బిల్లు విషయమై పార్లమెంట్లో జరిగిన గొడవలో ఇద్దరు ఎంపీలు సస్పెండ్‌కు గురి కాగా వారిని భగత్‌సింగ్, అల్లూరి సీతారామారాజులతో పోల్చడం సిగ్గుచేటన్నారు. -
'సీఎం పార్టీ పెడితే.. రూ. 10 లక్షలు ఫండ్'
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రా రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసమర్థుడు, అవినీతి పరున్ని ముఖ్యమంత్రిని చేయడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని డీఎల్ విమర్శించారు. కిరణ్ పిరికివాడు, అసమర్థుడని దుయ్యబట్టారు. ఆయన కొత్త పార్టీ పెడతారని తాను భావించడం లేదని డీఎల్ అన్నారు. సీఎం పార్టీ పెడితే పది లక్షల రూపాయిలు విరాళం ఇస్తానని డీఎల్ సవాల్ విసిరారు. -
డిఎల్ రాజకీయ వైరాగ్యం!
ఆరుసార్లు శాసనసభ్యుడుగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు నిర్వహించిన సీనియర్ నేత. రెవెన్యూ, నీటిపారుదల, వైద్యఆరోగ్య వంటి కీలక శాఖలకు మంత్రిగా వ్యవహారించారు డిఎల్ రవీంద్రా రెడ్డి. ఆయన నోరు విప్పితే ఎవరిని విమర్శిస్తారోనని సొంత పార్టీ నేతలే భయపడేవారు. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేసుకుంటారో తెలియదు. కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి కంటి మీద కునుకు లేకుండా చేశారు. చివరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా హడలెత్తించారు. రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన డిఎల్ ఇప్పుడు చాలా మెత్తబడిపోయారు. ప్రస్తుతం ఆయన రాజకీయ వైరాగ్యంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డితో తలపడ్డారు. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ముఖ్యమంత్రి కిరణ్‌తో ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరించారు. ఆయనను బహిరంగంగా విమర్శించారు. కొంత కాలం ఆయనకు పక్కలో బల్లెంలా తయారయ్యారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవని అంచనాకు వచ్చారు. ఇప్పుడు ఏ పార్టీలోకి పోలేక, కాంగ్రెస్‌లో ఉండలేక ఇంటికే పరిమితమయ్యారు. అంతా వైరాగ్యం. రాజకీయ సన్యాసం చేసి సాధారణ జీవితం గడుపుతానన్నట్లుగా మాట్లడాతారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన డిఎల్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ఎంతో రాజకీయ అనుభవం గల డిఎల్‌కు రాజకీయాలపై విరక్తి కలగడానికి కారణాలు ఏమిటి? సీమాంధ్రలో కాంగ్రెస్‌కు కాలం చెల్లింది. తెలుగు దేశం పార్టీ దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే సాహసం చేయలేరు. అందువలనే ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన మాత్రం రాజకీయాల్లో విలువలు నశించడం వలనే దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. అయితే కొంతమంది కాంగ్రెస్ నేతలు మాత్రం డిఎల్ సీఎం కిరణ్ వ్యతిరేక వర్గంలో ఉన్నందున ఆయనకు కాంగ్రెస్ పార్టీ టిక్కటే రాదని, అందువల్లే ఆయన అస్ర్ర సన్యాసం స్వీకరించనున్నట్లు చెబుతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడేందుకు డీఎల్ సిద్ధంగా ఉన్నప్పటికీ, టిడిపిలో చేరే అవకాశం లేదు. వైఎస్ఆర్ జిల్లాలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మైదుకూరు శాసనసభ నియోజవర్గం నుంచి సుధాకర్ యాదవ్‌ను పోటీ చేయించే ఆలోచనలో టిడిపి ఉంది. ఈ పరిస్థితులలో ఆ పార్టీ తలుపులు మూసుకుపోయినట్లే భావిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించే అవకాశం లేదు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టినా డీఎల్‌ను పట్టించుకునే అవకాశం లేదు. ఏ విధంగా చూసినా రాజకీయంగా ఆయనకు పరిస్థితులు అనూలంగా లేవు. ఈ నేపధ్యంలో రాజకీయ సన్యాసమే బెటరని డీఎల్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.