
సాక్షి, కడప : చంద్రబాబు పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని వైఎస్సార్‌సీపీ నాయకుడు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి మండిపడ్డారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎల్ మాట్లాడుతూ.. 'పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కు అప్పనంగా పనులు అప్పగించారు. రాష్ట్రంలో పనులకు సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కమిషన్ తీసుకోవడం సిగ్గుచేటు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో జరిగిన అన్ని పనులపై సీబీఐ దర్యాప్తు చేయాలి. ఎన్నికల తర్వాత వైఎస్ జగన్‌ను కలిసి ధన్యవాదాలు చెప్పాను.
వైఎస్ జగన్‌పై గతంలో నేను ఎన్నికల్లో పోటీ చేసినా నాపై ఆయన చూపిన ప్రేమ ఆప్యాయతలు మర్చిపోలేను. రాష్ట్ర ఖజానాను దోచుకున్న విధానంపై జగన్ దృష్టికి తీసుకెళ్ళాను. కుప్పంలో హంద్రీనీవా పనుల్లో 75 కోట్ల పనులను 400 కోట్లకు పెంచి అవినీతికి పాల్పడ్డారు. అన్ని ప్రాజెక్టుల పనుల్లో వేలకోట్ల అవినీతి జరిగింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి దాదాపు పూర్తి చేసిన పనులకు చంద్రబాబు తిరిగి ఓపెన్ చేశారు. ఆప్కో వల్ల చేనేతలకు కనీస న్యాయం కూడా జరగలేదు. ఆప్కోలో జరిగిన అవినీతిపై ప్రత్యేక విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నా' అని డీఎల్ రవీంద్రా రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment