
సీఎం కిరణ్.. డీఎల్ మంత్రి!
* తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌లో విచిత్రం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరున్నర మాసాలు గడిచింది. కొత్త ప్రభుత్వమూ వచ్చింది. అయితే, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మాత్రం ముఖ్యమంత్రిగా ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి, తమ శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అంటూ వారి ఫొటోలు, బ్రోచర్లను వెబ్‌సైట్‌లో ఉంచేసింది.
‘కమిషనర్ ఆఫ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ’ వెబ్‌సైట్‌లో సమైక్యాంధ్ర సీఎం, మంత్రుల బొమ్మలను చేర్చడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం పేరిట వైద్య ఆరోగ్యశాఖ కొత్త వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసినా, అందులో సీఎం కేసీఆర్, ఆశాఖ మంత్రి ఫొటోలు లేకపోవడం పై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.