telangana health department
-
ఆ పోస్టులకు ఏజ్ భారమైంది!
వైద్య విద్య విభాగంలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. డీఎంఈ, అడిషనల్ డీఎంఈ, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ పోస్టులకు సంబంధించిన వయో పరిమితిని 61 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచే బిల్లును గవర్నర్ తిరస్కరించడమే ఇందుకు కారణం. దీనివల్ల డీఎంఈ సహా ఆయా పోస్టుల వయో పరిమితి 61 ఏళ్లకే పరిమితం కానుండగా.. మరోవైపు మెడికల్ కాలేజీల ప్రొఫెసర్ల వయో పరిమితి 65 ఏళ్లుగా కొనసాగనుంది. ఇలా ఒకే విభాగంలో రెండు రకాల వయో పరిమితి కొనసాగనుండటంతో గందరగోళం ఏర్పడుతోంది. వాస్తవానికి మెడికల్ కాలేజీల్లోని ప్రొఫెసర్ల సీనియారిటీ ఆధారంగానే.. వారిలో కొందరిని డీఎంఈ, అడిషనల్ డీఎంఈ, ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్లుగా పోస్టింగ్ ఇస్తారు. అయితే ఈ పోస్టింగులు పొందిన తర్వాత వయో పరిమితి తగ్గిపోనుండటం సంక్షోభానికి దారితీస్తోంది. డీఎంఈల వయో పరిమితి పెంచకపోవడంతో.. ప్రస్తుతం వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ)గా డాక్టర్ రమేష్‌రెడ్డి ఉన్నారు. డీఎంఈ కార్యాలయంలో ముగ్గురు అదనపు డీఎంఈలుగా పని చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్లు, అనుబంధ ఆసుపత్రుల్లో సూపరింటెండెంట్లు పనిచేస్తున్నారు. అయితే నరసింహన్ గవర్నర్‌గా ఉన్న సమయంలో ప్రభుత్వం ప్రొఫెసర్ల వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచింది. కానీ అప్పట్లో డీఎంఈ తదితర పోస్టుల వయో పరిమితి పెంపు మాత్రం జరగలేదు. ఆ పోస్టులకు ముందుకొచ్చేదెవరు? గవర్నర్ తాజా నిర్ణయంతో ఆయా పోస్టుల్లో పనిచేసే 61 ఏళ్లు పైబడినవారు అనర్హులవుతారు. ప్రస్తుతం డీఎంఈ డాక్టర్ రమేష్‌రెడ్డి సహా ఎనిమిది మంది ఇప్పటికిప్పుడు రిటైర్ కావలసి వస్తుంది. అంతేకాదు వచ్చే ఏడాదిలోగా మరో ఏడెనిమిది మంది కూడా పదవీ విరమణ పొందాల్సి ఉంటుంది. గవర్నర్ నిర్ణయం ఇకముందు కూడా అమలైతే ప్రస్తుతం పనిచేసే ప్రొఫెసర్లలో ఎంతమంది.. అడిషనల్ డీఎంఈలు, కాలేజీల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లుగా పని చేసేందుకు ముందుకు వస్తారు?, ప్రొఫెసర్‌గా 65 ఏళ్ల వరకు కొనసాగే అవకాశాన్ని వదులుకుని 61 ఏళ్ల వయో పరిమితి ఉన్న పోస్టులకు ఎందుకు వెళతారు? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఒకవేళ అక్కడ 61 ఏళ్ల వరకు ఉండి, తిరిగి ప్రొఫెసర్‌గా కాలేజీల్లో 65 ఏళ్ల వరకు కొనసా గే అవకాశం ఉన్నా బాగుండేదని, కానీ ఆ చాన్స్ లేదని అంటున్నారు. పైగా జిల్లాల్లోని మెడికల్ కాలేజీలకు ప్రిన్సిపాల్‌గా వెళ్లడం కంటే హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా 65 ఏళ్ల వరకు పనిచేసుకోవడమే మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తక్షణ కర్తవ్యం ఏమిటి? వయో పరిమితి పెంపు బిల్లును గవర్నర్ తిరస్కరించడంతో, భవిష్యత్ కార్యాచరణపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. గవర్నర్ నిర్ణయాన్ని అమలు చేయడమా? లేక బిల్లును మరోసారి అసెంబ్లీలో పాస్ చేసి తిరిగి పంపడమా? అనేది తేలాల్సి ఉంది. దీనిపై ఏదో ఒకటి తేలేవరకు...ఆయా పోస్టుల్లో 61 ఏళ్లు దాటిన వారు దిగిపోవాలా? లేదా కొనసాగాలా? అన్నది కూడా తేల్చాల్సి ఉంది. ఒకవేళ వారిని తొలగిస్తే ఆయా పోస్టుల్లో ఉన్నవారు కోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. ఎందుకంటే ప్రొఫెసర్ పోస్టుకు 65 ఏళ్లుండగా, ప్రొఫెసర్ పోస్టులు వదులుకుని వచ్చే అడిషనల్ డీఎంఈలు, ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్ల వయో పరిమితిని 61 ఏళ్లకే పరిమితం చేయడం ఏమేరకు కరెక్ట్ అనే వాదనతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది కొత్త మెడికల్ కాలేజీలతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయి. వాటిల్లో ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లు కలిపి మొత్తం 52 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం 18 మంది ప్రిన్సిపాళ్లుగా, సూపరింటెండెంట్లుగా ఉన్నారు. కొందరికి పోస్టింగ్‌లు ఇచ్చినా చేరలేదు. దీంతో అక్కడ సీనియర్లను ఇన్చార్జిలుగా కొనసాగిస్తున్నారు. చదవండి: నిరుపేదల ఉపాధిపై రాబందులు వాలిపోయే..'దళితబంధు విందాయే'! -
కోవిడ్ భయాలు: తెలంగాణలో బూస్టర్డ్రైవ్.. ఆదేశాలు జారీ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో ప్రజలు తక్షణమే బూస్టర్ డోస్ టీకా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ చేపట్టింది. మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో అన్ని జిల్లా కేంద్రాల్లో బూస్టర్ డోస్ పంపిణీ చేపడతారు. అందుకు సంబంధించి జిల్లాలకు ఆదేశాలు జారీచేశారు. మొత్తం 1,571 కేంద్రాలలో ప్రత్యేకంగా బూస్టర్‌డోసు ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. రద్దీ ప్రాంతాల్లో మొబైల్వ్యాక్సినేషన్జరగనుంది. మార్కెట్లు, షాపింగ్‌మాల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, ఇతర కేంద్రాల వద్ద ప్రత్యేక వాహనాల్లో టీకాల పంపిణీ చేస్తారు. 50 మందికి మించి, ముందస్తు విజ్ఞప్తి చేస్తే, వారికి ఆ మేరకు బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 1.60 కోట్ల మంది బూస్టర్ డోస్ వేసుకోవాల్సి ఉంది. అలాగే 9 లక్షల మంది రెండో డోస్ టీకా వేసుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో తొమ్మిదిన్నర లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా రెండో డోసు, బూస్టర్ డోసు వ్యాక్సిన్ వేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పెద్దఎత్తున ప్రజలు తరలివస్తే ప్రస్తుతం ఉన్న టీకాలు సరిపోయే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో తక్షణమే కరోనా టీకాలు సరఫరా చేయాలని ఇటీవల కేంద్రానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విన్నవించిన సంగతి తెలిసిందే. కొత్తగా 12 కరోనా కేసులు రాష్ట్రంలో సోమవారం నిర్వహించిన 4,367 కరోనా నిర్ధారణ పరీక్షల్లో 12 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరుకుంది. ఒక్కరోజులో కరోనా నుంచి ఆరుగురు కోలుకోగా, ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 8.37 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 65 యాక్టివ్ కేసులున్నాయి. -
వైద్య శాఖలో నోటిఫికేషన్లు వాయిదా!.. ఆలస్యానికి కారణం ఇదే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ పరిధిలో పోస్టుల నోటిఫికేషన్లు వాయిదా పడనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం నుంచి రోస్టర్ వివరాలు వచ్చాకే నోటిఫికేషన్లు జారీ చేస్తామని పేర్కొన్నాయి. దీనికి ఎన్ని రోజులు పడుతుందనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఎంహెచ్ఎస్ఆర్బీ) ద్వారా 10,028 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. చదవండి: టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ 'మరో ప్రస్థానం' అందులో ఇప్పటికే 969 ఎంబీబీఎస్ అర్హతగల సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రజారోగ్య సంచాలకుడి పరిధిలో 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 211 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే వారం అర్హత సాధించిన వారి జాబితాను ప్రదర్శించనున్నారు. అభ్యంతరాలు స్వీకరించాక తుది జాబితా విడుదల చేస్తారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు నిర్ణయానికి ముందే ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చినందున యథాతధంగా భర్తీ ప్రక్రియ జరగనుంది. 9 వేల పోస్టుల్లో గిరిజన రిజర్వేషన్ల పెంపు ఎంబీబీఎస్ అర్హత కాకుండా స్పెషలిస్టు వైద్యులు, నర్సింగ్, ఏఎన్ఎం పోస్టులకు నోటిఫికేషన్లు జారీ కావాల్సి ఉంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ పూర్తయ్యాక వీటికి నోటిఫికేషన్లు జారీ చేయాలని బోర్డు భావించగా.. గిరిజన రిజర్వేషన్ల పెంపుతో వాయిదా పడ్డాయి. కొత్త రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రభుత్వం నుంచి రోస్టర్ వివరాలు అందాక విడతల వారీగా 9వేలకుపైగా పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేస్తామని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. కొత్త రిజర్వేషన్ల ప్రకారం.. ఈ పోస్టుల్లో 900కుపైగా ఉద్యోగాలు గిరిజనులకే దక్కనున్నాయి. -
కొత్తగా మరో 8 మెడికల్ కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆశయసాధన దిశగా వైద్యారోగ్య శాఖ మరో ముందడుగు వేసింది. తాజాగా మూడో విడత కింద మరో 8 జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు, అనుబంధ దవాఖానాల అప్‌గ్రేడేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీచేసింది. ఈ మేరకు మెడికల్ కాలేజీల వారీగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ శనివారం వేర్వేరు ఉత్తర్వులు జారీచేశారు. తాజాగా రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, జనగాం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రం ఏర్పడగానే మొదటి విడతగా ప్రభుత్వం నాలుగు కొత్త వైద్య కళాశాలలను మహబూబ్‌నగర్, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేటలో ప్రారంభించింది. దీంతో ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావడంతోపాటు వీటిల్లో వైద్య విద్యా బోధన విజయవంతంగా సాగుతోంది. రెండోవిడతగా మరో 8 వైద్యకళాశాలలను మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిల్లో ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ప్రతి కాలేజీలో వంద ఎంబీబీఎస్ సీట్లకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేయనున్నారు. కాలేజీల భవన నిర్మాణాలను ఆర్ అండ్ బీ శాఖకు అప్పగించింది. హాస్పిటల్ భవనాల అప్‌గ్రేడింగ్, పరికరాలు, ఫర్నిచర్ కొనుగోలు బాధ్యతలను టీఎస్ఎంఎస్ఐడీసీకి అప్పగించింది. ఆయా మెడికల్ కాలేజీలకు అటాచ్ చేస్తున్న హాస్పిటల్‌ను వైద్యవిధాన పరిషత్తు పరిధి నుంచి డీఎంఈ పరిధికి బదిలీ చేసింది. ఈ 8 మెడికల్ కాలేజీలను మొత్తం రూ.1479 కోట్లతో ఏర్పాటు చేస్తోంది. చదవండి: బెస్టాఫ్ ‘లక్క’! -
10,028 పోస్టులకు నోటిఫికేషన్లు
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలో 12,755 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే 10,028 పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగనుంది. వారం వారం విడతల వారీగా నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముందుగా ఒకట్రెండు రోజుల్లో ఎంబీబీఎస్ అర్హతతో 1,326 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన మెడికల్ బోర్డు, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్య విద్య, ప్రజారోగ్య విభాగం, టీవీవీపీ, ఐపీఎం విభాగాల్లో 1,326 పోస్టులు భర్తీ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అనుసరించి ఎలాంటి న్యాయ వివాదాలు తలెత్తకుండా నోటిఫికేషన్ రూపొందించాలని హరీశ్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, రెండుమూడు వారాల్లో విడతల వారీగా నోటిఫికేషన్ల జారీ ఉంటుందని వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తెలిపారు. ఈ సమీక్షలో ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్, డీఎంఈ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస్‌రావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం డైరెక్టర్ శ్వేత మహంతి, ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి, మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సెక్రెటరీ గోపీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. నర్సులకు మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో పరీక్ష.. ‘ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 20% వెయిటేజి మార్కులు ఇవ్వాలి. ఆయుష్ విభాగంలోని పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు.. టెక్నికల్ పోస్టులు, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులను టీఎస్ పీఎస్సీ.. నిమ్స్‌లోని ఖాళీలను నిమ్స్ బోర్డు.. మిగతా అన్ని పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, ట్యూటర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్టాఫ్ నర్సులు, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు వంటి పోస్టులన్నీ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలి. స్టాఫ్ నర్సులకు మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో రాత పరీక్ష నిర్వహించి.. మార్కుల ఆధారంగా ఎంపిక చేయాలి. 80 మార్కులు రాత పరీక్షకు, 20 మార్కులు కోవిడ్ కాలంలో పని చేసిన వారికి వెయిటేజి ఇవ్వాలి. ఆయుష్ డాక్టర్లను టీచింగ్ స్టాఫ్‌గా మార్చే ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, ఆ ఖాళీలను భర్తీ చేయాలి. ఆయుష్ సర్వీసు రూల్స్‌లో సవరణలు చేయాలి’అని సూచించారు. వారిపై నివేదిక రూపొందించండి... ‘ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌ను రద్దు చేస్తూ సవరణలు చేయాలి. జాతీయ ఆరోగ్య మిషన్‌లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ద్వారా పని చేస్తున్న వారు ఎంత మంది ఉన్నారు.. ఏ పని చేస్తున్నారన్న అంశాలపై పూర్తి నివేదిక రూపొందించాలి. సీనియర్ రెసిడెంట్లు, హౌస్ సర్జన్లకు రూ.330 కోట్లు స్టైపెండ్‌గా ఇస్తున్నారు. వారి సేవలు వినియోగించుకునేలా విధివిధానాల రూపకల్పన చేయాలి. తొలి నోటిఫికేషన్లో ట్యూటర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులున్నాయి. ఈ పోస్టుల్లో ఔట్ సోర్సింగ్ ద్వారా సేవలందిస్తున్న వారికి 20 శాతం వెయిటేజీ మార్కులు, మిగతా 80 శాతం మార్కులు ఎంబీబీఎస్ మార్కుల ఆధారంగా ఎంపిక చేయాలి. తొలి విడత తర్వాత. వెంటనే స్టాఫ్ నర్సులకు, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలి’అని హరీశ్ వివరించారు. జిల్లా ఆసుపత్రుల్లో కాటరాక్ట్ ఆపరేషన్లు అన్ని జిల్లా ఆసుపత్రుల్లో కాటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని మంత్రి హరీశ్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న కంటి వైద్యులతో ఆయన జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అవసరమైన వైద్య పరికరాలు వెంటనే సమకూర్చాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకులను ఆదేశించారు. తగిన పరికరాలు, సదుపాయాలున్న ఆసుపత్రుల్లో చికిత్సల సంఖ్య పెంచాలన్నారు. దీని కోసం ప్రజాప్రతినిధుల సహకారంతో ఆయా ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించాలని చెప్పారు. -
ఖమ్మంలో హెల్త్ డైరెక్టర్ వింత పూజలు.. క్లారిటీ ఇచ్చిన శ్రీనివాసరావు
సాక్షి, ఖమ్మం: తాను ఎలాంటి క్షుద్రపూజల్లో పాల్గొనలేదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ జీ శ్రీనివాస రావు క్లారిటీ ఇచ్చారు. సేవా కార్యక్రమాలను ఓర్వలేకనే కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి బురద జల్లే వ్యక్తుల మాటలను ప్రజలు విశ్వసించాల్సిన అవసరం లేదన్నారు. బుధవారం కొన్ని ఛానెళ్లలో ప్రసారమైన వార్తలను డీహెచ్ ఖండించారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు, మీడియా ప్రతినిధులు కూడా ఆలోచించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యంగిరాదేవి అమ్మవారి పూజల్లో పాల్గొంటే తప్పేందముందని ప్రశ్నించారు. స్థానికుల ఆహ్వానంతోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో జరిగిన పూజ కార్యక్రమానికి వెళ్లినట్లు చెప్పారు. స్వయం ప్రకటిత దేవతతో సంబంధం లేదన్నారు. మూఢ నమ్మకాలను అసలే విశ్వసించనన్నారు. తప్పుడు అర్థాలు తీసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దన్నారు. తన తండ్రి స్పూర్తితో జీఎస్సాఆర్ట్రస్ట్ ను ఏర్పాటు చేసి పేద ప్రజలకు విస్తృతంగా సామజిక సేవలు అందిస్తుంటే ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కరోనా నియంత్రణలో రెండున్నర ఏళ్ల పాటు నిర్విరామంగా కృషి చేసిన తాను మానసిక ప్రశాంతత కోసం హాలిడేస్‌లో సొంత గ్రామానికి వెళ్లి వస్తున్నట్లు చెప్పారు. కానీ ఎక్కువ సార్లు వచ్చారంటూ చర్చించుకోవడంలో అర్థం లేదన్నారు. కరోనాకు ముందు కూడా ఎన్నోసార్లు కొత్త గూడెం ప్రాంతానికి వస్తూ ఉండేవాడినని పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కాస్త బయట ఎక్కువగా తిరుగుతున్నానని వివరించారు. కానీ స్వర్ధపూరిత వ్యక్తులు జీర్ణించుకోలేక తనపై బురద జల్లుతున్నారని విమర్శించారు. వాళ్లకు కనువిప్పు కలిగే రోజు వస్తుందని నొక్కి చెప్పారు. రాష్ట్రానికి హెల్త్ డైరెక్టనఖగా ఉన్న తనకు రాజకీయాలకు రావాల్సిన అవసరం ఏం ఉన్నదన్నారు. మెగ హెల్త్ క్యాంపు ఏర్పాట్లు భాగంలోనే గత కొంత కాలంలో కొత్తగూడెం ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తున్నట్లు వివరించారు. విద్య, వైద్యం, ఉపాధిపై ఫోకస్ పెట్టానన్నారు. ట్రస్ట్ద్వారా ఇప్పటికే ఎంతో మంది పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు, ఆపరేషన్లు చేపించానన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. పేదలకు మేలు జరగడం కోసం తాను చేసే సేవా కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. -
వివాదంలో తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్
-
వివాదంలో తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు.. ఖమ్మంలో విచిత్ర పూజలు..
సాక్షి, ఖమ్మం: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వివాదంలో చిక్కుకున్నారు. దేవుడు కరుణించాలంటూ ఖమ్మంలో వింత పూజలు నిర్వహించారు. మంటల్లో నిమ్మకాయలు వేస్తూ పూజలు చేశారు. తనను తాను దేవతగా ప్రకటించుకున్న మహిళ ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయితే సైన్స్ బోధించాల్సిన డీహెచ్ ఇలాంటి పూజలు చేయడం ఏంటని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీనివాస్ క్షుద్రపూజల తరహాలో చేశారని రాజకీయ ఎంట్రీ కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. కాగా కొంతకాలంగా డీహెచ్ ఖమ్మంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఎంపీపీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. తనపై దేవతలు పూనుతారంటూ చెప్పుకుంటున్న పూనకం వచ్చిన మహిళ ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఇక తనపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో డీహెచ్ స్పందించారు. తమ స్వస్థలం కొత్తగూడెం ప్రాంతంలో హెల్త్ క్యాంప్ నిర్వహించేందుకు అక్కడకు వెళ్లినట్లు తెలిపారు. అయితే బంజారా కమ్యూనిటీ వాళ్లు తమ కుల దేవతకు పూజలు చేస్తున్నారని చెబితే ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. తాను హోమానికి దండం పెట్టానని, వ్యక్తికి కాదని చెప్పుకొచ్చారు. రాజకీయాలతో తనకు సంబంధం లేదని తెలిపారు. అయితే అనేక విషయాల్లో వివాదంలో ఉన్న ఎంపీపీ.. దేవత అవతారం ఎత్తి భక్తులకు దీవెనలు ఇస్తున్న మహిళ వద్దకు డీహెచ్ వెళ్లారని ఆరోపణలు వస్తుండగా.. ఆ మహిళ ప్రజా ప్రతినిధి అన్న విషయం తెలుసు కానీ ఆమె దేవతగా ప్రకటించుకున్నట్లు తెలీదన్నారు. అంతేగాక తాను చేస్తున్న సేవా కార్యాక్రమాలు గిట్టని వారు స్థానిక రాజకీయ నేతలతో కలిసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. -
‘వ్యాక్సిన్.. పింఛన్ కట్’ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
సాక్షి, హైదరాబాద్: వ్యాక్సిన్ తీసుకోనివారికి వచ్చేనెల నుంచి రేషన్, పింఛన్ నిలిపివేస్తారని వైద్య, ఆరోగ్యశాఖ చెప్పినట్లు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు స్పష్టంచేశారు. అలాంటి దుష్ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం అలాంటి నిర్ణయమేమీ తీసుకోలేదని, ప్రజలు ఈ అసత్య ప్రచారంతో ఆందోళనకు గురికావొద్దని సూచించారు. తప్పుడు వార్తను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలాఉండగా, వ్యాక్సిన్ తీసుకోనివారికి రేషన్, పింఛన్ నిలిపివేస్తామని శ్రీనివాసరావు ప్రకటించినట్లుగా మంగళవా రం భారీగా ప్రచారమైన సంగతి తెలిసిందే. చదవండి: మహమ్మారి ఎఫెక్ట్: రెండేళ్లు తగ్గిన భారతీయుల ఆయుర్దాయం -
హైదరాబాద్ లో ఐటీ కంపనీలు ప్రారంభించుకోవచ్చు
-
తెలంగాణలో కరోనా తగ్గుముఖం: అతి స్వల్ప కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2 కోట్లకు చేరువైంది. సోమవారం సాయంత్రానికి 1,98,65,968 నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర జనాభాతో పోలిస్తే పరీక్షల సంఖ్య 53.37 శాతంగా ఉన్నట్లు తెలిపింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 1,05,797 నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఇందులో 696 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పేర్కొంది. తాజా కేసులు కలిపితే రాష్ట్రంలో ఇప్పటివరకు 6,32,379 మంది కరోనా బారిన పడగా.. వీరిలో 6,18,496 మంది కోలుకున్నారని తెలిపింది. కాగా, కరోనాతో సోమవారం ఒక్కరోజు ఆరుగురు మరణించగా, ఇప్పటివరకు 3,735 మంది మృత్యువాత పడ్డట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం చేసిన నిర్ధారణ పరీక్షల్లో ప్రభుత్వ కేంద్రాల్లో 1,02,580, ప్రైవేటు కేంద్రాల్లో 3,217 పరీక్షలు చేశారు. రాష్ట్రంలో కోవిడ్-19 రిస్క్ రేటు 0.59 శాతం, రికవరీ రేటు 97.8 శాతంగా ఉంది. -
థర్డ్ వేవ్ కోసం భారీగా పడకలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్ థర్డ్‌వేవ్ సన్నాహాల్లో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను పెంచడంతో పాటు అవసరాలకు తగ్గట్లుగా మానవ వనరులను సమకూర్చుకోవడానికి అనుమతులు మంజూరు చేయనున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నిలోఫర్‌లో 1000 పడకలుండగా వీటిని 2000 పడకలకు పెంచనున్నారు. 100 పడకలతో సేవలందిస్తోన్న మలక్ పేట, వనస్థలిపురం, గోల్కొండ, కొండాపూర్, మల్కాజిగిరి ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రులను 200-250 పడకలకు పెంచనున్నారు. నాలుగు వారాల్లోగా అదనపు ఏర్పాట్లు పూర్తవుతాయని వైద్య వర్గాలు తెలిపాయి. -
తెలంగాణలో కొత్తగా 1,088 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,088 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,17,776కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 9 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 1,511 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 5,98,139 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 16,030 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చదవండి: కోవిడ్‌తో మరణించిన జర్నలిస్టులకు రూ.2 లక్షలు అవును .. వాళ్లు చనిపోయింది నిజమే -
Covid Test: 14 జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ కేంద్రాలు
యాంటీజెన్ పరీక్షలో నెగెటివ్ వచ్చి కరోనా లక్షణాలుంటే ఆ ఫలితాన్ని నమ్మలేం. కచ్చితంగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. కానీ చాలా మంది చేయించుకోవట్లేదు. అందుకే మరిన్ని ఆర్టీపీసీఆర్ కేంద్రాలు. వనపర్తి, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, రామగుండం, భువనగిరి, జనగాం, వికారాబాద్ జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు. సాక్షి, హైదరాబాద్: కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణకు కొత్తగా 14 జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్ష కేంద్రాలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో వాటిని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తు న్నారు. ప్రస్తుతం 17 చోట్ల ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా థర్డ్‌వేవ్ వస్తుందన్న హెచ్చరికలతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. దీనికోసం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. కరోనా నిర్ధారణకు 2 రకాల పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి ర్యాపిడ్ యాంటిజెన్, రెండోది ఆర్టీపీసీఆర్. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష ద్వారా పావు గంటలోనే ఫలితం వస్తుంది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే, అది పూర్తిగా కరెక్టే. కానీ నెగటివ్ వచ్చి లక్షణాలుంటే మాత్రం దాని ఫలితాన్ని పూర్తిగా నమ్మలేం. మళ్లీ ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలనేది నిబంధన. చాలామంది యాంటిజెన్ పరీక్ష చేయించుకొని అందులో నెగటివ్ వచ్చి.. లక్షణాలున్నా కూడా సాధారణంగా తిరిగేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవడం లేదు. ఆర్టీపీసీఆర్ పరీక్షలు అంతగా అందుబాటులో లేకపోవడం కూడా దీనికి కారణం. ఇలా అనేక కేసులు మిస్ కావడం, సీరియస్ అవుతుండటంతో పరిస్థితి తీవ్రంగా మారుతోంది. అంతేకాదు రాష్ట్రంలో 90 శాతంపైగా ర్యాపిడ్ పరీక్షలే జరుగుతున్నాయని కేంద్రం ఇటీవల వెల్లడించింది. 10 శాతంలోపే ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుగుతున్నాయంది. దీంతో ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచాలని వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా నిర్ణయించింది. యాంటిజెన్ పరీక్ష ద్వారా పాజిటివ్ ఉన్న వ్యక్తులను వెంటనే గుర్తించడానికి వీలుంది. ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించాలంటే ఇప్పుడు రెండుమూడు రోజులకు కూడా ఫలితం రావడంలేదు. ఒక్కోసారి వారం సమయం కూడా పడుతోంది. అందుకే వైద్యాధికారులు, ప్రజలు యాంటిజెన్ పరీక్షలకే మొగ్గుచూపుతున్నారు. కొత్తగా ఆర్టీపీసీఆర్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో తక్కువ సమయంలో పరీక్షా ఫలితాలు ఇవ్వడానికి వీలుపడుతుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. -
కరోనాపై హెచ్చరిక.. అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: డెంగీ, మలేరియా, ఇతర వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఏవైనా సీజనల్‌గా వస్తుంటాయి. కానీ కరోనా మాత్రం.. సీజన్‌కు సంబంధం లేకుండా ఏడాది పొడవునా ఎప్పుడైనా సోకే అవకాశం ఉంటుందని వైద్యారోగ్య శాఖ హెచ్చరించింది. అందువల్ల ప్రతి నిత్యం తగిన జాగ్రత్తలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. మిగతా వ్యాధులకు సంబంధించి కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు సోమవారం సీజనల్ వ్యాధుల కేలండర్‌ను విడుదల చేసింది. ఏ సీజన్లో ఏయే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది, ప్రభుత్వం, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి అన్న సమాచారాన్ని అందజేసింది. జూలై నుంచి అక్టోబర్ మధ్య డెంగీ, మలేరియా, సీజనల్ జ్వరాలు వ్యాపిస్తాయని.. నవంబర్–మార్చి మధ్య స్వైన్‌ఫ్లూ, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వస్తాయని.. ఏప్రిల్– జూన్ మధ్య వడ దెబ్బ, మలేరియా వంటివి ఇబ్బంది పెడతాయని తెలిది. కరోనా ఏడాది పొడవునా పట్టి పీడించే అవకాశం ఉందని పేర్కొంది. సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి అన్ని ప్రభుత్వ శాఖలు కలిసి పనిచేయాలని, తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేసింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కీలక పాత్ర పోషించాలని.. పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని కోరింది. ఇక సీజనల్ అంటు వ్యాధులను ఎదుర్కొనేందుకు 24 గంటలపాటు నడిచే ప్రత్యేక సెల్‌ను వైద్యారోగ్య శాఖ ఏర్పాటు చేసింది. దీనికి 040–24651119 ఫోన్ నంబర్ కేటాయించింది. అంటు వ్యాధులకు సంబంధించిన సమస్యలను ఈ సెల్ ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చని సూచించింది. వానాకాలంలో మరింత జాగ్రత్త వైద్యారోగ్య శాఖ క్యాలెండర్ ప్రకారం.. ప్రస్తుత సీజన్లో కరోనాతోపాటు డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్, డయేరియా, ఇన్‌ఫ్లూయెంజా, న్యూమోనియా, సీజనల్ జ్వరాలు వచ్చే అవకాశముంది. పాము కాట్లు సంభవిస్తాయి. ఈ అంశాలపై స్థానిక సంస్థలు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా ప్రచార కార్యక్రమం నిర్వహించాలి. శుక్రవారం డ్రైడే నిర్వహించాలని.. కాచి చల్లార్చిన నీటినే తాగాలని, బాగా వండిన ఆహారాన్నే తినాలని తెలియజేయాలి. అంటువ్యాధులన్నింటినీ నియంత్రించేందుకు మాస్క్, భౌతిక దూరం, పరిశుభ్రత పాటించేలా చూడాలి. దోమల నివారణకు ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించాలి. మురికి కాల్వలు, ఆరు బయట నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, పొదలను శుభ్రం చేయాలి. స్టోరేజీ ట్యాంకుల్లో క్లోరినేషన్ చేపట్టాలి. ప్రజల్లోకి వెళ్లి ఫీవర్ సర్వే చేయాలి. అవసరమైన మందుల కిట్లు అందజేయాలి. హైరిస్క్ ప్రాంతాల్లో దోమ తెరలు పంపిణీ చేయాలి. ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ఫీవర్ ఓపీలను నిర్వహించాలి. ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలి. అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలి. యాంటీ బయాటిక్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, యాంటీ స్నేక్ వీనమ్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచాలి. చలికాలంలో వైరస్ల ప్రమాదం చలికాలంలో కరోనాతోపాటు స్వైన్‌ఫ్లూ, ఇన్‌ఫ్లూయెంజా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఈ సీజన్లో వైరస్ల ప్రమాదం అధికం. గాలి నుంచి సోకే వైరల్ వ్యాధులను నియంత్రించేందుకు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతుల శుభ్రత తప్పనిసరి. లక్షణాలు లేని కోవిడ్ రోగుల కోసం ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వానాకాలం తరహాలో చలికాలంలోనూ ఫీవర్ సర్వే చేసి, అవసరమైన మందులు అందజేయాలి. స్వైన్‌ఫ్లూ, కోవిడ్ టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలి. ఆస్పత్రుల్లో ఫీవర్ ఓపీ చేయాలి. ఒసెల్టామివిర్/డాక్సిసైక్లిన్, యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉంచుకోవాలి. అవసరమైన ఆక్సిజన్ నిల్వ, సరఫరా ఉండాలి. చలికాలంలో శ్వాసకోశ వ్యాధులు ఇబ్బందిపెడతాయి. వాటికి సంబంధించి చికిత్స అందించడంతోపాటు ప్రజలు ముందు జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పించాలి. ఎండాకాలంలో కోవిడ్‌తో పాటు మలేరియా, డయేరియా వంటివి వచ్చే అవకాశం ఉంది. ఎండల కారణంగా వడదెబ్బ, కుక్కకాట్లు వంటివి సంభవిస్తాయి. యథావిధిగా కరోనా జాగ్రత్తలు తప్పనిసరి. ప్రజలు ఇళ్లు, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మున్సిపాలిటీలు, పంచాయతీలు పబ్లిక్ స్థలాల్లో నీడ వసతి, మంచినీరు అందుబాటులో ఉంచాలి. వైద్య సిబ్బంది ఫీవర్ సర్వేను కొనసాగించాలి. కోవిడ్, మలేరియా పరీక్షల కిట్లను అందుబాటులో ఉంచుకోవాలి. ఆస్పత్రుల్లో ఫీవర్ ఓపీ, ఐసోలేషన్ వార్డులు ఉంచుకోవాలి. ఆక్సిజన్ స్టోరేజీ, సరఫరా ఏర్పాట్లు తప్పనిసరి. క్లోరోక్విన్/డాక్సిసైక్లిన్ సిద్ధంగా పెట్టుకోవాలి, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుకోవాలి. అన్ని కాలాల్లో కరోనా సీజనల్ వ్యాధులు ఆయా కాలాలను బట్టి వస్తూ పోతుంటాయి. కానీ కోవిడ్ మాత్రం అన్ని సీజన్లలోనూ వ్యాపిస్తోంది. కరోనా వైరస్ అన్ని కాలాల్లో మనగలుగుతుంది. కాబట్టి సీజనల్ కేలండర్లో దాన్ని మూడు సీజన్లలోనూ ప్రస్తావించాం. ప్రజలు ప్రతినిత్యం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. - డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు -
తెలంగాణలో మే 31 వరకు మొదటి డోస్‌కు ఛాన్స్ లేదు: హెల్త్డైరెక్టర్
-
తెలంగాణలో జోరుగా కరోనా టీకా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టీకా కార్యక్రమం ఊపందుకుంది. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 51,997 మందికి టీకాలు వేసినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు వ్యాక్సినేషన్ బులెటిన్‌ను ఆయన విడుదల చేశారు. ఈ నెల 16వ తేదీ తొలిరోజు 140 కేంద్రాల్లో, రెండోరోజు 18వ తేదీన 335 కేంద్రాల్లో టీకాలు వేశారు. మూడోరోజు మంగళవారం 894 కేంద్రాలకు విస్తరించారు. ఈ మూడు రోజుల్లో 69,625 మందికి వ్యాక్సిన్లు వేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. తాజాగా 51 మందికి రియాక్షన్లు వచ్చాయని, అందులో ముగ్గురిని ఆసుపత్రిలో చేర్పించగా.. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. బుధవారం వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సెలవని, తిరిగి ఈ నెల 21వ తేదీన వ్యాక్సినేషన్ జరుగుతుందని తెలిపారు. టీకా కార్యక్రమం సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో మాత్రమే నిర్వహిస్తారు. బుధ, శని, ఆదివారాలు, ఇతరత్ర సెలవు దినాల్లో టీకా వేయడం లేదు. బుధ, శనివారాల్లో చిన్న పిల్లలు, గర్భిణులకు రెగ్యులర్ సార్వత్రిక టీకాలు వేస్తారు. జిల్లాలకు కోవిషీల్డ్ .. మంగళవారం ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన మరో 3,48,500 కోవిషీల్డ్ టీకాలు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. పుణే నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చిన టీకాలను కోఠిలోని స్టేట్ వ్యాక్సిన్ సెంటర్‌కు తరలించారు. రెండో దశ పంపిణీ కోసం వాటిని జిల్లాలకు పంపించనున్నారు. మొదటి విడతలో 80 లక్షల మందికి ఉచితం మొదటి విడతలో రాష్ట్రంలోని 80 లక్షల మందికి ఉచితంగా టీకాలు వేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొదటి విడత లబ్ధిదారులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 50 ఏళ్లు దాటిన వారు, 18–50 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి టీకా ఇవ్వాలని నిర్ణయించారు. వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ముగిసిన తర్వాత మిగతా రెండు కేటగిరీలకు టీకాలు ఇస్తారు. మార్చి నుంచి 50 ఏళ్లు దాటిన వారికి, 18–50 ఏళ్ల మధ్య వయసులోని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి టీకాలు వేస్తామని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. -
‘సగం పడకల’పై ప్రతిష్టంభన
సాక్షి, హైదరాబాద్: కరోనా చికిత్స కోసం సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్ ఆసుపత్రుల్లోని సగం (50 శాతం) పడకలను స్వాధీనం చేసుకొనే ప్రక్రియలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నెల 13న వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌తో జరిపిన చర్చల్లో సగం పడకల ను సర్కారుకు ఇవ్వడానికి ఆయా ఆసుపత్రు ల యాజమాన్యాలు అంగీకరించగా ఆ సగం పడకలను ఎలా కేటాయించాలి? వాటికెంత ఫీజు వసూలు చేయాలన్న దానిపై 14న ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపారు. ఆ చర్చల అనంతరమే విధివిధానాలు ఖరారు చేసి ప్రకటిస్తామని అంతకుముందు రోజే మంత్రి ఈటల ప్రకటించారు. కానీ ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండానే యాజమాన్యాలతో చర్చలు అర్ధాంతరంగా వాయిదా పడ్డాయి. దీనిపై శని, ఆదివారాల్లో సమావేశం జరుగుతుందని అందరూ భావించినా అలా జరగకపోగా ఇక వారితో చర్చలు ఉండబోవని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. తాము సూచించినట్లుగా యాజమాన్యాలు ప్రతిపాదనలు పంపితే వాటిని సీఎంకు నివేదించి తర్వాత విధివిధానాలు ఖరారు చేస్తామని అంటున్నాయి. ‘సీలింగ్’పై కార్పొరేట్ల తర్జనభర్జన... సగం పడకలను సర్కారుకు బదలాయిస్తే వాటికి ఎంత ఫీజులుండాలన్న దానిపైనే సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు తర్జనభర్జన పడుతున్నాయి. పాత జీవో ప్రకారం రోజుకు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లోని సాధారణ వార్డుల్లో కరోనా చికిత్సకు రూ. 4 వేలు, ఐసీయూలో రూ. 7,500, వెంటిలేటర్ అమరిస్తే రూ. 9 వేలు వసూలు చేయాలన్నది నిబంధన. పీపీఈ కిట్లు, మందులకు అదనంగా వసూలు చేసుకోవచ్చని జీవోలో సర్కారు చెప్పింది. దీన్నే అలుసుగా తీసుకొని యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేశాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అందుకే డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో ఈ ఫీజుతో సంబంధం లేకుండా అన్నీ కలిపి ఫీజు సీలింగ్ ప్రతిపాదనను సర్కారు తెరపైకి తెచ్చింది. దాని ప్రకారం 14 రోజులకు కలిపి కరోనా చికిత్సకు సాధారణ వార్డులో రూ. లక్ష, ఆక్సిజన్ వార్డులో రూ. 2 లక్షలు, ఐసీయూ వార్డులో రూ. 3–4 లక్షలను సీలింగ్ ఫీజుగా పేర్కొంటూ సర్కారు ప్రతిపాదించింది. ఐసీయూలో ఉన్నప్పుడు బాధితుడిని ఒక్కోసారి రెండు, మూడు రోజులు అదనం గా ఉంచాల్సి రావొచ్చు. అత్యవసర, ఖరీదైన మందులు వాడాల్సి రావొచ్చు. అలాగే ఎవరికైనా కిడ్నీలు ఫెయిలైనా, సీటీస్కాన్లు తీ యాల్సి వస్తే ఐసీయూకు గరిష్టంగా రూ. 4 లక్షల వరకు సీలింగ్‌ను ప్రభుత్వం ప్రతిపాదించింది. వాటి ప్రకారమే ప్రతిపాదన లు తీసుకొని రావాలని మేనేజ్మెంట్లను ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిన సగం ఫీజుల్లో జోక్యం ఉండదు! సర్కారుకు అప్పగించే సగం పడకలపైనే తమ ఆధిపత్యం ఉంటుందని, సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్ యాజమాన్యాల ఆధ్వర్యంలోని మిగిలిన సగం పడకలకు వసూలు చేసే ఫీజులతో తమకు ఎలాంటి సంబంధం లేదని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ధనవంతులు ఆ ఫీజులను భరిస్తే తమకు అభ్యంతరం లేదని అంటున్నాయి. ప్రభుత్వానికి అప్పగించే పడకలను తామే నింపుతామని, వాటిని పేదలు, మధ్యతరగతికి చెందిన కరోనా బాధితులెవరికైనా కేటాయిస్తామని అధికారులు అంటున్నారు. దీనికోసం ప్రత్యేక యాప్ తయారు చేస్తామని, అందరికీ అందుబాటులో ఉండేలా స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చని చెబుతున్నారు. యాప్‌లో ఎప్పటికప్పుడు సర్కారు అధీనంలోని కార్పొరేట్ కరోనా పడకల వివరాలు, ఖాళీలు అప్డేట్ చేస్తామని, ఆ మేరకు కసరత్తు జరుగుతుందని ఒక ఉన్నతాధికారి తెలిపారు. మేనేజ్మెంట్లలో మూడు ఆలోచనలు సర్కారు సూచించిన సీలింగ్ ప్రతిపాదనపై సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్ యాజమాన్యాల్లో గందరగోళం నెలకొంది. ఒక్కో ఆసుపత్రి ఒక్కో రకంగా ఆలోచిస్తోంది. అందులో మొదటిది ఏమిటంటే సర్కారు సీలింగ్ ప్రకారం యథావిధిగా ఆయా ఫీజులకు ఒప్పుకోవడం. దానికి షరతుగా తమ అధీనంలో ఉండే మిగిలిన సగం పడకల ఫీజుల్లో జోక్యం చేసుకోకూడదని సర్కారుకు చెప్పడం. వాటికి ఎంత వసూలు చేసుకున్నా సర్కారు వేలు పెట్టవద్దని స్పష్టం చేయడం. ఇక రెండోది ఒకవేళ మొదటి ప్రతిపాదన సరేననుకున్నా ఆచరణలోనూ, న్యాయపరంగా చిక్కులు వచ్చే అవకాశం ఉన్నందున ఫీజు సీలింగ్‌ను పెంచాలని ప్రతిపాదించడం. మూడో ఆలోచన ఏమిటంటే ప్రైవేటు ఆరోగ్య బీమా, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్ఎస్) వంటి వాటిని అమలు చేయాల్సి వస్తే బీమా పోను మిగిలిన సొమ్ము ఎవరు కడతారన్న దానిపైనా స్పష్టతకు రావడం. ఇవిగాక ఇంకా ఒకట్రెండు ఆలోచనలను కూడా యాజమాన్యా లు తెరపైకి తెస్తున్నాయి. తాము సోమ వారం సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నా క సర్కారుకు ప్రతిపాదనలు ఇవ్వడంతో పాటు నేరుగా మీడియా సమావేశం ఏర్పా టు చేసి ప్రకటిస్తామని ఒక సూపర్ స్పెషాలిటీ కార్పొరేట్ యజమాని తెలిపారు. -
తెలంగాణలో వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: మొన్న అహ్మదాబాద్‌లో ఒక ఆస్పత్రిలో అగ్ని ప్రమాద సంఘటన.. నిన్న విజయవాడలో కరోనా బాధితులు ఐసోలేషన్ చికిత్స పొందుతున్న హోటల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్ అయింది. ఆయా హోటళ్లతో పాటు అన్ని కరోనా ఆస్పత్రుల్లోనూ అగ్నిప్రమాద నివారణ నిబంధనలపై తక్షణమే తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. తాజా అగ్ని ప్రమాదాల సంఘటన నేపథ్యంలో అన్ని ఆస్పత్రులు/కోవిడ్ కేర్ సెంటర్లు (హోటళ్లు) అగ్ని ప్రమాద నివారణకు భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. భద్రతా నిబంధనల ఉల్లంఘన జరిగితే తీవ్రంగా పరిగణిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఆయన అన్ని ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల (హోటళ్ల)కు ఆదేశాలు ఇస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా హోటళ్లు ఏ మేరకు అగ్ని ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారన్న దానిపైనా వైద్య, ఆరోగ్య శాఖ తనిఖీలు చేయాలని యోచిస్తుంది. (తెలంగాణలో 80వేలు దాటిన కరోనా కేసులు) త్రీస్టార్, ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఏర్పాట్లు... రాష్ట్రంలో కోవిడ్ కేంద్రాలుగా 36 హోటళ్లు అనుమతి పొందినా, మరో 50–60 హోటళ్లలో ఇష్టానుసారంగా కరోనా రోగులను ఐసోలేషన్‌లో ఉంచుతున్నట్లు వైద్య వర్గాలు గుర్తించినట్లు తెలిసింది. ఇందులో కొన్ని కనీసం ప్రమాణాలు కూడా పాటించడం లేదని బాధితులు వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న పలువురు రోగులు ఇంట్లో అందరితో కలసి ఉండకుండా హోటల్ గదిలో సెల్ఫ్ ఐసోలేషన్ అయ్యేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో పలు త్రీస్టార్, ఫైవ్‌స్టార్ హోటళ్లు క్వారంటైన్ కేంద్రాలుగా మారుతున్నాయి. ఆయా హోటళ్లలో సుమారు మూడువేల మంది వరకు కోవిడ్ రోగులు ఉన్నట్లు సమాచారం. అగ్ని ప్రమాదాల నివారణకు వైద్య ఆరోగ్యశాఖ సూచనలు ►ఆస్పత్రులు, హోటళ్లలో అగ్నిప్రమాద నివారణ కోసం జనరేటర్ అందుబాటులో ఉంచాలి. అగ్నిప్రమాదం జరిగితే విద్యుత్ సౌకర్యాన్ని నిలిపివేసి జనరేటర్‌ను ఆన్ చేస్తారు. ►హోటల్ లేదా ఆస్పత్రి బిల్డింగ్‌పై పెద్ద నీటి తొట్టిని ఏర్పాటు చేయాలి. ►ప్రతీ ఫ్లోర్‌కు నీటిని అందించేందుకు వీలుగా పెద్ద పైపును ఏర్పాటు చేయాలి. ►అగ్నిప్రమాదంలో చేపట్టాల్సిన చర్యలపై అప్పుడప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించాలి. ►ఆయా భవనాలకు రెండు వైపులా మెట్లుండాలి. అగ్ని ప్రమాదం జరిగితే రోగులు, ఇతరులు బయటకు రావడానికి వీలుగా ఉండాలి. -
‘సెప్టెంబర్ కల్లా కరోనా తగ్గే అవకాశం’
సాక్షి, హైదరాబాద్ : తెలలంగాణలో రోజుకు 23వేల మందికి కరోనా టెస్టులు చేస్తున్నామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కేసు ల సంఖ్య రోజు రోజుకి తగ్గుతుందని చెప్పారు. నెలాఖరుకు నగరంలో కేసులు చాలా తగ్గుతాయని అంచనా వేస్తున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. సెప్టెంబర్ చివరికి తెలంగాణలో కరోనా పూర్తిగా తగ్గే అవకాశం ఉందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను కేటాయించిదని గుర్తు చేశారు. కొన్ని ఆస్పత్రులు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 1039 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిలో 130కి పైగా బిల్లులకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ఇన్యూరెన్స్‌కు సంబంధించి 16 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఆస్పత్రలన్నింటికి కౌన్సిలింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్ ఆస్పత్రులను మూసివేడం తమ ఉద్ధేశ్యం కాదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.(చదవండి : కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి) కాగా, . రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 150 ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు కరోనా చికిత్సకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో ప్రస్తుతం 91 ఆసుపత్రుల్లో చికిత్సలు జరుగుతున్నాయి. మరిన్ని ప్రైవేట్ ఆస్పత్రులలో కరోనా పరీక్షలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
తెలంగాణలో 99 శాతం రికవరీ
-
తెలంగాణలో 99 శాతం రికవరీ : హెల్త్ డైరెక్టర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో గత పది రోజులుగా కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచామని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో కరోనా నియంత్రణకు సంబంధించి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటివరకు 36,221 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపారు. లాక్డౌన్ సడలింపుల తర్వాత వైరస్ వ్యాప్తి పెరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో సోమవారం ఒక్క రోజే 11,525 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని పేర్కొన్నారు. దేశంలో కరోనా మరణాల రేటు 2.7 శాతం ఉంటే.. తెలంగాణలో ఒక్క శాతమే ఉందన్నారు. తెలంగాణలో 365 మంది కరోనాతో మరణించారని వెల్లడించారు.(మానవత్వంలో దైవత్వాన్ని చూపించారు) తెలంగాణలో రికవరీ రేటు 99 శాతం ఉందని శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణలో 80 శాతం మందికి కరోనా లక్షణాలు లేవని చెప్పారు. 9,786 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 30 ఆస్పత్రుల్లో కరోనా టెస్టులు జరుగుతున్నాయని వెల్లడించారు. కరోనా చికిత్స విషయంలో డీ సెంట్రలైజ్ చేశారని.. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కూడా కరోనా చికిత్స ఉచితంగా జరగనుందన్నారు. 54 ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స కొనసాగుతుందని పేర్కొన్నారు. -
కరోనాపై ఆందోళన వద్దు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ బారినపడితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య సంచాలకులు జి. శ్రీనివాసరావు సూచించారు. జాగ్రత్తలు పాటిస్తే వేగంగా కోలుకుంటారని వివరించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతున్నప్పటికీ రిస్క్ రేట్ తగ్గుతోందని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఈ ఫలితాలు వస్తున్నాయని ఆయన తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో వైద్య విద్య సంచాలకులు రమేశ్‌రెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లా డారు. దేశంలో ఢిల్లీ తర్వాత తెలంగాణలోనే హోం ఐసోలేషన్ సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. లాక్డౌన్ సమయంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉందని, అన్‌లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత ప్రజలు పనుల నిమిత్తం రోడ్లపైకి రావడంతో వైరస్ వ్యాప్తి పెరిగిందన్నారు. జూన్‌లో అత్యధికంగా 13 వేల కేసులు నమోదైనట్లు శ్రీనివాసరావు వివరించారు. అయితే కేసుల సంఖ్య పెరిగినప్పటికీ వైద్య, ఆరోగ్య శాఖ అందరికీ సేవలందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. గాంధీ ఆస్పత్రి ని అత్యవసర కేటగిరీ కింద నిర్దేశించామని, క్రిటికల్ కేసులను (బాధితులను) మాత్రమే అడ్మిట్ చేసుకొని చికిత్స చేస్తున్నామన్నారు. లక్షణాలు తక్కువ ఉన్న వారికి ఇతర ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వైరస్ సోకిన వారిలో ఎక్కువ శాతం మందికి లక్షణాలే లేవని, కొందరికి తెలియకుండానే వైరస్ వచ్చి పోతోందన్నా రు. వ్యాక్సిన్ వచ్చే వరకు వైరస్‌తో ప్రజలంతా కలసి జీవించక తప్పదన్నారు. వైరస్‌ను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ కరోనా యోధులుగా పనిచేయాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దన్న ఆయన... కరోనాపై ప్రజలను చైతన్యపరిచే బాధ్యత మీడియాపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ కరోనా లెక్కల్ని దాచలేదని, పూర్తిస్థాయిలో పారదర్శకంగా వివరాలను ప్రజలకు చెబుతున్నామన్నారు. ల్యాబ్‌లవారీగా పరీక్షలు, ఫలితాలు... ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల విధానం సరైన విధంగా లేదని, అనుమానితుల్లో ఎక్కువ మందికి పాజిటివ్‌గా ఫలితాలు చూపుతున్నాయని డాక్టర్ జి. శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకుగల కార ణాలను తెలుసుకొనేందుకు నిపుణుల కమిటీతో మరోసారి తనిఖీలు చేస్తామన్నారు. ఇప్పటికే 12 ల్యాబ్‌లకు నోటీసులు ఇచ్చామని, వారంతా వివరణ కూడా ఇస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 18 ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు చేస్తున్నారని, కొత్తగా మరో 5 ల్యాబ్‌లకు ఐసీఎంఆర్ అనుమతిచ్చిందన్నారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలపై మరింత స్పష్టంగా బులెటిన్ ఇస్తామని, ల్యాబ్‌లవారీగా పరీక్షలు, పాజిటివ్ కేసుల వివరాలను అందులో చేరుస్తామన్నారు. రాష్ట్రంలో కాంటాక్ట్ ట్రేసింగ్ పక్కాగా జరుగుతోందని, సీఎం కేసీఆర్ నిర్దేశించిన 50 వేల పరీక్షలు పూర్తయ్యాయని చెప్పారు. ప్రభు త్వ ల్యాబ్‌లలో పరీక్షల సామర్థ్యం 6,500కు పెరిగిందని, త్వరలో మరింత పెంచుతామన్నారు. ప్రజలు ఏదైనా సమస్య ఉంటే 104 కు కాల్ చేయాలని, అత్యవసర సేవల కోసం 108కి ఫోన్ చేయాలని సూచించారు. -
ప్రైవేట్‌లోనూ కరోనా
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చికిత్స చేసే అవకాశం కల్పిస్తూ తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐసీయూ లేదా వెంటిలేటర్ సౌకర్యంతోపాటు కరోనా చికిత్స అందించగలిగే స్థాయి కలిగిన ప్రైవేటు ఆస్పత్రులకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది. మిగిలిన క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు, నర్సింగ్ హోంలకు మాత్రం అటువంటి వెసులుబాటు కల్పించలేదు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు విడుదల చేశారు. కరోనా రోగులకు ఇప్పటివరకు కేవలం గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స చేసేందుకు అనుమతి ఉంది. అయితే కొన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులు ఇప్పటికే కరోనా చికిత్సలు చేస్తున్నాయి. కానీ అధికారికంగా సర్కారు ఉత్తర్వులు జారీ చేయడంతో ఎవరైనా వెళ్లి వాటిల్లో చికిత్స చేయించుకోవచ్చు. తాజా మార్గదర్శకాల ప్రకారం ఆస్పత్రులను మూడు రకాలుగా వర్గీకరించారు. ఒకటి ప్రైవేటు క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు. రెండోది ఇన్–పేషెంట్ సౌకర్యంలేని నర్సింగ్ హోంలు. మూడోది ఐసీయూ లేదా వెంటిలేటర్ల సౌకర్యం ఉండి కరోనా చికిత్స అందించే సామర్థ్యం కలిగిన ఆస్పత్రులు. ఈ విభజన ప్రకారం ఆయా ఆస్పత్రులు ఏ విధమైన మార్గదర్శకాలు పాటించాలో ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా అనేక ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లు వైద్య సేవలు నిలిపేశాయి. కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందిస్తున్నాయి. దీంతో సాధారణ వైద్యసేవలు అందక రోగులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రులు తిరిగి తమ సేవలందించాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. కరోనా చికిత్స చేసే ప్రైవేటు ఆస్పత్రులకు మార్గదర్శకాలు... ► కరోనా అనుమానిత రోగులు వస్తే వారి పరీక్షా ఫలితాలు వచ్చే వరకు ఐసోలేషన్ రూంలో ఉంచాలి. ► ల్యాబ్ టెక్నీషియన్లు శ్వాబ్ నమూనాలు తీసేటప్పుడు కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలి. ► కరోనా రోగుల రాకపోకలకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేసి, ఆస్పత్రిలో కరోనా జోన్లను ఏర్పాటు చేయాలి. ► కరోనా జోన్లో వైరస్ లక్షణాలున్న వారి కోసం ఐసీయూ, వెంటిలేటర్ల సౌకర్యాలను సిద్ధం చేయాలి. ► కరోనా జోన్లో తప్పకుండా ఆపరేషన్, పోస్ట్ ఆపరేషన్ వార్డు, లేబర్ రూం ఉండాలి. ఈ జోన్లో పనిచేసే వైద్య సిబ్బంది తప్పకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలి. ► ప్రతి కరోనా పాజిటివ్ కేసును అవసరాన్నిబట్టి కార్డియాలజిస్టు, పల్మనాలజిస్టు, అనెస్తీషియనిస్టు, ఇతర సంబంధిత వైద్యులు పరీక్షించాలి. ► పాజిటివ్ రోగుల చికిత్సా విధానాలకు సంబంధించి ఐసీఎంఆర్, కేంద్ర మార్గదర్శకాలను విధిగా పాటించాలి. ► ఒకవేళ కరోనా రోగి మరణిస్తే మృతదేహాన్ని ఐసీఎంఆర్ ప్రొటోకాల్ ప్రకారం తరలించి దహన కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలి. ► ప్రతి ఆస్పత్రి విధిగా మరణాల వివరాల రిజిస్టర్‌ను నమోదు చేయాలి. అందులో కరోనా లేదా కరోనాయేతర రోగులు ఎలా చనిపోయారో వివరాలు ఉండాలి. ఆ వివరాలను జిల్లా వైద్యాధికారులకు పంపించాలి. ► టీకాల షెడ్యూల్ యథావిధిగా కొనసాగించాలి. ► ఆస్పత్రి ప్రాంగణంలో లెక్కకు మించిన రోగులు, వారి సహాయకులు ఉండకుండా చూసుకోవాలి. రొటీన్ విజిటింగ్‌కు అనుమతించొద్దు. ► రొటీన్ ఫాలో అప్ కేసుల విషయంలో టెలి మెడిసిన్ విధానాన్ని అవలంబించాలి. ► వైద్య సిబ్బందికి హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు ఇవ్వాలి. ► అన్ని ఆస్పత్రులు విధిగా ఫ్లూ, జ్వరం, తీవ్ర శ్వాసకోశ సంబంధిత జబ్బులతో బాధపడే రోగులు, గర్భిణుల వివరాలను రిజిస్టర్లో నిత్యం నమోదు చేయాలి. వాటిని ఈ–బర్త్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ► అన్ని ఆస్పత్రులు విధిగా కరోనా పాజిటివ్ రోగుల వివరాలను నమోదు చేస్తూ వాటిని సంబంధిత జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. ► ఇన్–పేషెంట్ రోగులు, శస్త్రచికిత్సల వివరాలు కూడా నమోదు చేయాలి. వాటిని జిల్లా వైద్య, అధికార యంత్రాగానికి పంపాలి. ► కరోనా జోన్లో మాస్క్‌లు, గ్లౌజ్స్, ఫేస్ షీల్డ్, హ్యాండ్ వాషింగ్, శానిటైజర్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. భౌతికదూరం పాటించాలి. ూ వైరస్ సోకిన రోగులు, ఇతర రోగులు కలవకుండా చర్యలు చేపట్టాలి. ఈ మార్గదర్శకాలను పాటించని ఆస్పత్రులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు, నర్సింగ్‌హోంలకు... ► రోగుల రద్దీని నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. ► అందుకోసం డాక్టర్లు గంటకు నలుగురైదుగురు రోగులను మాత్రమే చూడాలి. ూ ప్రతి రోగి పక్కన ఒక్కరినే అనుమతించాలి. భౌతిక దూరం కచ్చితంగా పాటించాలి. ► ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్‌లు ధరించాలి. క్లినిక్‌లోకి ప్రవేశించే ముందు సబ్బునీటితో లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో చేతులు కడుక్కోవాలి. ూ జ్వరం, జలుబు, దగ్గు వంటి అనుమానిత కేసులను కరోనా ఆస్పత్రికి తరలించాలి. అటువంటి వారి కోసం ప్రత్యేక కౌంటర్, రోగులకు ప్రత్యేక ద్వారం ఏర్పాటు చేయాలి. ూ ఆరోగ్య సిబ్బంది పీపీఈ కిట్లు, ఎన్–95 మాస్క్‌లు ధరించాలి. ూ వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు మూడు పొరల మాస్క్‌లు, ఫేస్ షీల్డ్, గ్లౌజ్స్ మొదలైనవి ధరించాలి. ూ ప్రతి రోగిని పరీక్షించాక వైద్యులు తప్పనిసరిగా సబ్బునీరు లేదా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్తో చేతులు కడుక్కోవాలి. ూ బయో మెడికల్ వ్యర్థాల తొలగింపు మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి. ► చేతులు కడుక్కొనే అవకాశం, శానిటైజర్ సౌకర్యం ఆస్పత్రి ప్రతి మూలలో అందుబాటులో ఉంచాలి. ► క్లినిక్‌ను ప్రతిరోజూ బ్లీచ్ లేదా ఒక శాతం సోడియం హైపోక్లోరైడ్‌తో క్రిమిసంహారకం చేయాలి.ూ సాధ్యమైతే టెలి మెడిసిన్ సౌకర్యాన్ని వైద్యులు ఉపయోగించుకోవాలి. ► కరోనా అనుమానిత కేసులను పరీక్షల కోసం, ఇతరత్రా నిర్వహణ కోసం కరోనా ఆస్పత్రికి తరలించాలి. ► కరోనాకు చికిత్స అందించే ప్రైవేటు ఆస్పత్రులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. -
రాష్ట్రంలో తగ్గిన శిశు మరణాలు
సాక్షి, హైదరాబాద్: ఏడాదిలోపు వయసున్న శిశువుల మరణాల రేటు రాష్ట్రంలో గణనీయంగా తగ్గింది. ఐదేళ్ల కిందట ప్రతి వెయ్యి జననాలకు శిశువులు 39 మంది మరణిస్తుండగా.. తాజాగా 2018 గణాంకాల్లో 27కి తగ్గింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్ఆర్ఎస్)’సర్వేలో వెల్లడయ్యాయి. రాష్ట్రంలో 2.15 లక్షల జనాభా నుంచి నమూనాల నమోదు చేపట్టారు. శిశు మరణాల రేటులో జాతీయ సగటు (32) కంటే తెలంగాణ (27)లో తక్కువగా నమోదవ్వడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. కేసీఆర్ కిట్, మిషన్ ఇంద్రధనుష్ పథకం, ప్రభుత్వం 29 ఎస్ఎన్సీయూలను నిర్వహిస్తూ నవజాత శిశు ఆరోగ్యాన్ని సంరక్షిస్తోంది. ఫలితంగా శిశు మరణాల రేటు తగ్గినట్లుగా వైద్య వర్గాలు తెలిపాయి. కాగా తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో శిశు మరణాల రేటు 30 ఉండగా పట్టణాల్లో 21 మాత్రమే ఉంది. (చదవండి: రోజు విడిచి రోజు స్కూలుకు..)