సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2 కోట్లకు చేరువైంది. సోమవారం సాయంత్రానికి 1,98,65,968 నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర జనాభాతో పోలిస్తే పరీక్షల సంఖ్య 53.37 శాతంగా ఉన్నట్లు తెలిపింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 1,05,797 నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఇందులో 696 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పేర్కొంది. తాజా కేసులు కలిపితే రాష్ట్రంలో ఇప్పటివరకు 6,32,379 మంది కరోనా బారిన పడగా.. వీరిలో 6,18,496 మంది కోలుకున్నారని తెలిపింది. కాగా, కరోనాతో సోమవారం ఒక్కరోజు ఆరుగురు మరణించగా, ఇప్పటివరకు 3,735 మంది మృత్యువాత పడ్డట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం చేసిన నిర్ధారణ పరీక్షల్లో ప్రభుత్వ కేంద్రాల్లో 1,02,580, ప్రైవేటు కేంద్రాల్లో 3,217 పరీక్షలు చేశారు. రాష్ట్రంలో కోవిడ్-19 రిస్క్ రేటు 0.59 శాతం, రికవరీ రేటు 97.8 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment