సాక్షి, హైదరాబాద్: వ్యాక్సిన్ తీసుకోనివారికి వచ్చేనెల నుంచి రేషన్, పింఛన్ నిలిపివేస్తారని వైద్య, ఆరోగ్యశాఖ చెప్పినట్లు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు స్పష్టంచేశారు. అలాంటి దుష్ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం అలాంటి నిర్ణయమేమీ తీసుకోలేదని, ప్రజలు ఈ అసత్య ప్రచారంతో ఆందోళనకు గురికావొద్దని సూచించారు.
తప్పుడు వార్తను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలాఉండగా, వ్యాక్సిన్ తీసుకోనివారికి రేషన్, పింఛన్ నిలిపివేస్తామని శ్రీనివాసరావు ప్రకటించినట్లుగా మంగళవా రం భారీగా ప్రచారమైన సంగతి తెలిసిందే.
చదవండి: మహమ్మారి ఎఫెక్ట్: రెండేళ్లు తగ్గిన భారతీయుల ఆయుర్దాయం
Comments
Please login to add a commentAdd a comment