Telangana Health Director Srinivasa Rao Gives Clarity on Worship Khammam - Sakshi
Sakshi News home page

ఖమ్మంలో హెల్త్‌ డైరెక్టర్‌ వింత పూజలు.. క్లారిటీ ఇచ్చిన శ్రీనివాసరావు

Published Wed, Apr 6 2022 7:48 PM | Last Updated on Wed, Apr 6 2022 8:36 PM

Telangana Health Director Srinivasa Clarity On Worship At Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం: తాను ఎలాంటి క్షుద్రపూజల్లో పాల్గొనలేదని తెలంగాణ హెల్త్​ డైరెక్టర్​ జీ శ్రీనివాస రావు క్లారిటీ ఇచ్చారు. సేవా కార్యక్రమాలను ఓర్వలేకనే కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి బురద జల్లే వ్యక్తుల మాటలను ప్రజలు విశ్వసించాల్సిన అవసరం లేదన్నారు. బుధవారం కొన్ని ఛానెళ్లలో ప్రసారమైన వార్తలను డీహెచ్​ ఖండించారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు, మీడియా ప్రతినిధులు కూడా ఆలోచించాలని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రత్యంగిరాదేవి అమ్మవారి పూజల్లో పాల్గొంటే తప్పేందముందని ప్రశ్నించారు.

స్థానికుల ఆహ్వానంతోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్​ మండలంలో జరిగిన పూజ కార్యక్రమానికి వెళ్లినట్లు చెప్పారు. స్వయం ప్రకటిత దేవతతో సంబంధం లేదన్నారు. మూఢ నమ్మకాలను అసలే విశ్వసించనన్నారు. తప్పుడు అర్థాలు తీసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దన్నారు. తన తండ్రి స్పూర్తితో జీఎస్సాఆర్​ట్రస్ట్ ను ఏర్పాటు చేసి పేద ప్రజలకు విస్తృతంగా సామజిక సేవలు అందిస్తుంటే ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

కరోనా నియంత్రణలో రెండున్నర ఏళ్ల పాటు నిర్విరామంగా కృషి చేసిన తాను మానసిక ప్రశాంతత కోసం హాలిడేస్​లో సొంత గ్రామానికి వెళ్లి వస్తున్నట్లు చెప్పారు. కానీ ఎక్కువ సార్లు వచ్చారంటూ చర్చించుకోవడంలో అర్థం లేదన్నారు. కరోనాకు ముందు కూడా ఎన్నోసార్లు కొత్త గూడెం ప్రాంతానికి వస్తూ ఉండేవాడినని పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రస్ట్​ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కాస్త బయట ఎక్కువగా తిరుగుతున్నానని వివరించారు. కానీ స్వర్ధపూరిత వ్యక్తులు జీర్ణించుకోలేక తనపై బురద జల్లుతున్నారని విమర్శించారు. వాళ్లకు కనువిప్పు కలిగే రోజు వస్తుందని నొక్కి చెప్పారు.

రాష్ట్రానికి హెల్త్​ డైరెక్టనఖగా ఉన్న తనకు రాజకీయాలకు రావాల్సిన అవసరం ఏం ఉన్నదన్నారు. మెగ హెల్త్​ క్యాంపు ఏర్పాట్లు భాగంలోనే గత కొంత కాలంలో కొత్తగూడెం ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తున్నట్లు వివరించారు. విద్య, వైద్యం, ఉపాధిపై ఫోకస్​ పెట్టానన్నారు.  ట్రస్ట్​ద్వారా ఇప్పటికే ఎంతో మంది పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు, ఆపరేషన్లు చేపించానన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. పేదలకు మేలు జరగడం కోసం తాను చేసే  సేవా కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement