సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్ థర్డ్‌వేవ్ సన్నాహాల్లో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను పెంచడంతో పాటు అవసరాలకు తగ్గట్లుగా మానవ వనరులను సమకూర్చుకోవడానికి అనుమతులు మంజూరు చేయనున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నిలోఫర్‌లో 1000 పడకలుండగా వీటిని 2000 పడకలకు పెంచనున్నారు. 100 పడకలతో సేవలందిస్తోన్న మలక్ పేట, వనస్థలిపురం, గోల్కొండ, కొండాపూర్, మల్కాజిగిరి ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రులను 200-250 పడకలకు పెంచనున్నారు. నాలుగు వారాల్లోగా అదనపు ఏర్పాట్లు పూర్తవుతాయని వైద్య వర్గాలు తెలిపాయి.
థర్డ్ వేవ్ కోసం భారీగా పడకలు
Published Mon, Jul 5 2021 3:38 AM | Last Updated on Mon, Jul 5 2021 3:38 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment