సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో గత పది రోజులుగా కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచామని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో కరోనా నియంత్రణకు సంబంధించి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటివరకు 36,221 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపారు. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత వైరస్ వ్యాప్తి పెరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో సోమవారం ఒక్క రోజే 11,525 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని పేర్కొన్నారు. దేశంలో కరోనా మరణాల రేటు 2.7 శాతం ఉంటే.. తెలంగాణలో ఒక్క శాతమే ఉందన్నారు. తెలంగాణలో 365 మంది కరోనాతో మరణించారని వెల్లడించారు.(మానవత్వంలో దైవత్వాన్ని చూపించారు)
తెలంగాణలో రికవరీ రేటు 99 శాతం ఉందని శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణలో 80 శాతం మందికి కరోనా లక్షణాలు లేవని చెప్పారు. 9,786 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 ఆస్పత్రుల్లో కరోనా టెస్టులు జరుగుతున్నాయని వెల్లడించారు. కరోనా చికిత్స విషయంలో డీ సెంట్రలైజ్ చేశారని.. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కూడా కరోనా చికిత్స ఉచితంగా జరగనుందన్నారు. 54 ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స కొనసాగుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment