‘సెప్టెంబర్ ‌కల్లా కరోనా తగ్గే అవకాశం’ | Private Hospitals Closed Is Not Our Intention Public TS Health Director Says | Sakshi
Sakshi News home page

‘సెప్టెంబర్ ‌కల్లా తెలంగాణలో కరోనా తగ్గే అవకాశం’

Published Sat, Aug 8 2020 4:26 PM | Last Updated on Sat, Aug 8 2020 7:46 PM

Private Hospitals Closed Is Not Our Intention Public TS Health Director Says - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలలంగాణలో రోజుకు 23వేల మందికి కరోనా టెస్టులు చేస్తున్నామని పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు అన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కేసు ల సంఖ్య రోజు రోజుకి తగ్గుతుందని చెప్పారు. నెలాఖరుకు నగరంలో కేసులు చాలా తగ్గుతాయని అంచనా వేస్తున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. సెప్టెంబర్‌ చివరికి తెలంగాణలో కరోనా పూర్తిగా తగ్గే అవకాశం ఉందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను కేటాయించిదని గుర్తు  చేశారు.

కొన్ని ఆస్పత్రులు ప్రభుత్వ ఆదేశాలను  బేఖాతరు చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు.  ఇప్పటి వరకు దాదాపు 1039 ఫిర్యాదులు వచ్చాయన్నారు.  వాటిలో 130కి పైగా బిల్లులకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ఇన్యూరెన్స్‌కు సంబంధించి 16 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఆస్పత్రలన్నింటికి కౌన్సిలింగ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్‌ ఆస్పత్రులను మూసివేడం తమ ఉద్ధేశ్యం కాదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.(చదవండి : కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి)

కాగా, . రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 150 ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు కరోనా చికిత్సకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  అందులో ప్రస్తుతం 91 ఆసుపత్రుల్లో చికిత్సలు జరుగుతున్నాయి.  మరిన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులలో కరోనా పరీక్షలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement