ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ఏడాదిలోపు వయసున్న శిశువుల మరణాల రేటు రాష్ట్రంలో గణనీయంగా తగ్గింది. ఐదేళ్ల కిందట ప్రతి వెయ్యి జననాలకు శిశువులు 39 మంది మరణిస్తుండగా.. తాజాగా 2018 గణాంకాల్లో 27కి తగ్గింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్‌ఆర్‌ఎస్)’సర్వేలో వెల్లడయ్యాయి. రాష్ట్రంలో 2.15 లక్షల జనాభా నుంచి నమూనాల నమోదు చేపట్టారు. శిశు మరణాల రేటులో జాతీయ సగటు (32) కంటే తెలంగాణ (27)లో తక్కువగా నమోదవ్వడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. కేసీఆర్ కిట్, మిషన్ ఇంద్రధనుష్ పథకం, ప్రభుత్వం 29 ఎస్‌ఎన్‌సీయూలను నిర్వహిస్తూ నవజాత శిశు ఆరోగ్యాన్ని సంరక్షిస్తోంది. ఫలితంగా శిశు మరణాల రేటు తగ్గినట్లుగా వైద్య వర్గాలు తెలిపాయి. కాగా తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో శిశు మరణాల రేటు 30 ఉండగా పట్టణాల్లో 21 మాత్రమే ఉంది.
(చదవండి: రోజు విడిచి రోజు స్కూలుకు..)
Comments
Please login to add a commentAdd a comment