
సాక్షి, మైదకూరు : త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి బుధవారం ఉదయం ఖాజీపేటలో డీఎల్ రవీంద్రారెడ్డిని కలిశారు. అనంతరం డీఎల్ మాట్లాడుతూ...‘వైఎస్ జగన్ నాకు ఫోన్ చేశారు. మీ సేవలు అవసరం పార్టీలోకి రావాలని కోరారు. చాలా సంవత్సరాలుగా వైఎస్ ఆర్ కుటుంబసభ్యుడిని. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటా. పది రోజుల్లో భారీ సమావేశం ఏర్పాటు చేస్తా. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ గెలుపు కోసం కృషి చేస్తా. వైఎస్ వివేకానందరెడ్డి స్థానాన్ని భర్తీ చేయాలని జగన్ కోరారు’ అని తెలిపారు. చదవండి....(టీడీపీని భూస్థాపితం చేయడమే నా లక్ష్యం: డీఎల్)
సజ్జల రామకృష్ష్ణారెడ్డి మాట్లాడుతూ.. డీఎల్ రవీంద్రారెడ్డి పార్టీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. ఆయన రాకతో పార్టీలో నూతన ఉత్సహం వస్తుంది. అధికారంలోకి రాగానే డీఎల్‌కు ప్రత్యేక స్థానం ఇస్తామని వైఎస్ జగన్ చెప్పారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన‍్నారు. కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి మాట్లాడుతూ... మా చిన్నాన్న లేని లోటు డీఎల్ రవీంద్రారెడ్డి తీరుస్తారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే శివ రామకృష్ణయ్య కూడా పార్టీలోకి రావడం శుభ పరిణామం అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment