లాగిన్, లాగౌట్, లాగిన్ లాగౌట్
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ ఈ ఎన్నికల్లో ఒక నమూనాగా మిగిలిపోతారు. మొన్న కాంగ్రెస్. నిన్న టీఆర్ ఎస్. నేడు మళ్లీ కాంగ్రెస్.... ఇప్పుడెక్కడున్నారో తెలియదు.... అంతకు మించిన నమూనా మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి. ఆయన యూ టర్న్ తీసుకోవడంలో సరికొత్త రికార్డులనే సృష్టిస్తున్నారు.
ఆయనది ఆది నుంచీ కాంగ్రెస్.... ఆ తరువాత కాంగ్రెస్ పై కోపం వచ్చింది. కాంగ్రెస్ వదిలి టీడీపీలో చేరబోతున్నట్టు డీఎల్ రవీంద్రా సంకేతాలు ఇచ్చారు. ఏప్రిల్ 7 న కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం కూడా జరిగింది. కానీ అది జరగలేదు. ఆ తరువాత మళ్లీ ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నానని చెప్పారు. కాంగ్రెస్ ఆయన సతీమణికి మైదుకూరు నుంచి టికెట్ కూడా ఇచ్చింది. కానీ ఇంతలోనే మళ్లీ ఆయన టీడీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆయన టీడీపీ లో చేరతారా లేక మళ్లీ మనసు మార్చుకుంటారా? ఇప్పుడిదే కడప రాజకీయాల్లో హాట్ టాపిక్.