
త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటా: డీఎల్
వైఎస్ఆర్ జిల్లా: తన సొంత గ్రామంలో ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. 'నాలాంటి సీనియర్ నేతలను కూడా సీఎం లెక్కచేయనందుకు నిరసనగా సీఎం కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్నాను' అని డీఎల్ ఈ సందర్భంగా తెలిపారు.
ఇప్పటికే వైఎస్సార్సీపీ నేత మల్లికార్జునరెడ్డి ఈ విషయంలో తనను కలిసి మాట్లాడినట్టు డీఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. త్వరలోనే తమ పార్టీ కార్యకర్తలతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటానని డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు.