invite
-
మీరు రాకుంటే కామెంట్లు ఎవరు చేస్తారు.. ?
మా ఇంట పెళ్లి.. మీరంతా రావడం మా కల.. పెళ్లి పందిరి నవ్వాలి కిలకిల. మీరాక మాకెంతో శుభదినం.. ఇలా కదా పెళ్లి పత్రిక రాస్తారు.. కానీ ఈ కుటుంబం వేసిన పెళ్లి ఆహ్వాన పత్రిక చూసి నెటిజన్లు అబ్బా.. ఏం రాసిర్రు భయ్యా అంటూ నవ్వుతూనే.. కామెంట్లు సైతం పెడుతున్నారు. ట్విట్టర్లో పోస్ట్ చేసిన కొద్దీ సమయానికే లక్షదాటిన వ్యూస్.. దీంతో ఇదిప్పుడు వైరల్ ఐంది. సాధారణ సంప్రదాయానికి భిన్నంగా ఉన్న ఈ పెళ్లి పత్రిక చూసి పలువురు నవ్వుకుంటూనే.. మొత్తానికి అన్నీ నిజాలే రాసారు అని కామెంట్లు చేస్తున్నారు. మీరు పెళ్ళికి రాకుంటే ఎలా ? భోజనాల గురించి కామెంట్లు ఎవరు పెడతారు.. అది అలా ఉంది.. ఇది ఇలా ఉందని ఎవరు చెబుతారు ? కాబట్టి మీరు తప్పనిసరిగా రావాల్సిందే అని అందులో పేర్కొన్నారు. వధువు, “శర్మాజీకి లడ్కీ” (శర్మాజీ గారి కుమార్తె ) “మంచి తెలివైన అమ్మాయి" అని రాశారు. వరుడు, “గోపాలజీ కా లడ్కా” (గోపాలజీ గారికి కుమారుడు ) అంటూనే ఈయన బీటెక్ పూర్తి చేసినప్పటికీ, ఇప్పుడు ఒక చిన్న వ్యాపారం చేస్తున్నాడని వివరించారు. జనవరి ఐదోతేదీ నాటికి తమ పిల్లలతోబాటు, బంధువుల పిల్లల పరీక్షలు కూడా ముగుస్తున్నందున ఆరోజు పెళ్లి చేస్తే బావుంటుందని ముగ్గురు పురోహితులు కలిసి ముహుర్తాన్ని ఖరారు చేసారని పేర్కొన్నారు. వియ్యాలవారి మధ్య చిన్నచిన్న కయ్యలు ఉంటాయి...వాటిని పట్టించుకోవద్దు అని చెబుతూనే పెళ్లి వేదికమీదకు వధూవరులు ఆలస్యంగా వస్తారని, అంత వరకు ఓపిక పట్టాలని రాసారు. అసలే వివాహవేదిక చాలా ఖరీదుపెట్టి డెకరేట్ చేయించాం. అందుకే అక్కడ మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి.. అదేం మీ పిల్లలు ఆదుకునే అట స్థలం కాదు కదా.. అని గుర్తు చేశారు ఫుడ్ చాలా కాస్ట్లీ.. ఒకసారే తినండి పెళ్లికోసం బుక్ చేసిన భోజనం చాలా ఖరీదైంది.. ఒక్కో ప్లేట్ భోజనం రూ. 2000 కాబట్టి.. కాస్త తక్కువ తినండి. లేదా ఒకసారి మాత్రమే తినండి. వివాహ వేదిక మీకు తెలుసుగా మన దూబే గారి రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది కదా.. అక్కడే ఈ పెళ్లి కూడా అని రాశారు. కానుకలు వద్దు.. క్యాష్ కొట్టండి పెళ్లిలో ఇచ్చే కనుకలగురించి కూడా వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఇప్పటికే ఇంట్లో ఆల్రెడీ 20 ఫోటో ఫ్రేమ్స్.. బోలెడు డిన్నర్ సెట్లు ఉన్నాయి కాబట్టి.. క్యాష్ కొట్టండి. లేదా గూగుల్ పే చేయండి అని గుర్తు చేసారు. బంధుమిత్రులగురించి చెబుతూ వాళ్లంతా ఎప్పట్లానే బోరింగ్ బ్యాచ్ అని రాశారు.. ఇంకా భారీగా కానుకలు ఇస్తారు కాబట్టి.. తాతయ్య పేరును పత్రిక పైన రాశామని సరదాగా చెప్పారు. మామ.. అత్తయ్యలను గురించి వివరిస్తూ ఇంట్లో గొడవలను తీర్చే స్పెషలిస్టులుగా వివరించారు. ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ పత్రికను దాదాపు 1.94 లక్షల మంది చూశారు. అయ్యో నేను ఈ కార్డు ముందే చూసి ఉంటె మా అబ్బాయి పెళ్ళికార్డును కూడా ఇలాగె ప్రింట్ చేయించేవాడిని అని ఒకాయన కామెంట్ చేయగా.. వామ్మో మరీ ఇంత నిజాయితీగా రాసేశారు.. బంధువులు ఏమనుకుంటారో అని ఇంకో అయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఈ పోస్ట్ కింద వందలాది ఎమోజీలు కూడా వచ్చాయి. సిమ్మాదిరప్పన్న -
ఇండియా కాదు భారత్, దేశం పేరు మార్చే దిశగా కేంద్రం
సాక్షి, ఢిల్లీ: కేంద్రంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలబెట్టిన జీ20 సదస్సు ఊహించని పరిణామానికి దారి తీసింది. రాష్ట్రపతి భవన్ నుంచి వెలువడ్డ G20 డిన్నర్ ఆహ్వాన పత్రికతో సంచలన విషయం తెరమీదికి వచ్చింది. ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు.. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించింది రాష్ట్రపతి భవన్. దీంతో దేశం పేరును ఆంగ్లంలో ఇండియా నుంచి భారత్‌కు మార్చే ప్రయత్నాల్లో కేంద్రం ఉందనే చర్చ ఊపందుకుంది. జీ20 సదస్సులో భాగంగా.. సెప్టెంబర్ 9వ తేదీన వివిధ దేశాల అధినేతలకు, ప్రతినిధులకు విందు ఏర్పాటు చేయనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇందుకోసం విదేశీ అధినేతలకు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతోనే ఆహ్వానాలు పంపింది రాష్ట్రపతి . ఇదే ఇప్పుడు రాజకీయ అభ్యంతరాలకు దారి తీసింది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా.. రిపబ్లిక్ ఆఫ్ భారత్‌గా మారబోతోందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాదు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంకేతాలిస్తూ ఓ ట్వీట్ కూడా చేశారు. రిపబ్లిక్ అఫ్ భారత్.. మన నాగరికత అమృత్ కాల్ వైపు ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్లో పేర్కొన్నారాయన. REPUBLIC OF BHARAT - happy and proud that our civilisation is marching ahead boldly towards AMRIT KAAL — Himanta Biswa Sarma (@himantabiswa) September 5, 2023 ఇంకోవైపు కాంగ్రెస్ ఈ పరిణామంపై మండిపడుతోంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో పేర్కొన్న యూనియన్ స్టేట్స్పై ముమ్మాటికీ దాడేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. చరిత్రను వక్రీకరిస్తూ.. దేశాన్ని విభజిస్తూ.. మోదీ ముందుకు సాగుతున్నారంటూ మండిపడ్డారు. దీనికి బీజేపీ కౌంటర్ ఇచ్చింది. Mr. Modi can continue to distort history and divide India, that is Bharat, that is a Union of States. But we will not be deterred. After all, what is the objective of INDIA parties? It is BHARAT—Bring Harmony, Amity, Reconciliation And Trust. Judega BHARAT Jeetega INDIA! https://t.co/L0gsXUEEEK — Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2023 ‘‘దేశ గౌరవానికి, గర్వానికి సంబంధించిన ప్రతి విషయంపై కాంగ్రెస్‌కు ఎందుకు అంత అభ్యంతరం? వ్యక్తం చేస్తోంది. భారత్ జోడో పేరుతో రాజకీయ యాత్రలు చేసిన వాళ్లు.. భారత్ మాతా కీ జై అనే ప్రకటనను ఎందుకు ద్వేషిస్తున్నారు. కాంగ్రెస్‌కు దేశంపైనా, దేశ రాజ్యాంగంపైనా, రాజ్యాంగ సంస్థలపైనా గౌరవం లేదని మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ దేశ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక ఉద్దేశాల గురించి దేశం మొత్తానికి బాగా తెలుసు అని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. कांग्रेस को देश के सम्मान एवं गौरव से जुड़े हर विषय से इतनी आपत्ति क्यों है? भारत जोड़ो के नाम पर राजनीतिक यात्रा करने वालों को “भारत माता की जय” के उद्घोष से नफरत क्यों है? स्पष्ट है कि कांग्रेस के मन में न देश के प्रति सम्मान है, न देश के संविधान के प्रति और न ही संवैधानिक… — Jagat Prakash Nadda (@JPNadda) September 5, 2023 కొత్త భవనంలోనేనా? ఆంగ్లంలో ఇండియా(India)గా ఉచ్చరించే పేరును.. భారత్(Bharat)గా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టేందుకు.. 18 నుంచి 22వ తేదీలో జరగబోయే పార్లమెంట్ సమావేశాలను కేంద్రం వేదికగా చేసుకుంటుందా? అనే దానిపై ఒక స్పష్టత మాత్రం రావాలి. తొలి రెండు రోజులు పాత పార్లమెంట్ భవనంలో.. తర్వాతి మూడు రోజులు కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరుగుతాయి. కొత్త పార్లమెంట్ భవనంలోనే.. పేరుపై తీర్మానంతో పాటు జమిలి ఎన్నికలు, బ్రిటిష్‌కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో తీసుకురాబోయే కొత్త చట్టాలను చర్చించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. So the news is indeed true. Rashtrapati Bhawan has sent out an invite for a G20 dinner on Sept 9th in the name of 'President of Bharat' instead of the usual 'President of India'. Now, Article 1 in the Constitution can read: “Bharat, that was India, shall be a Union of States.”… — Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2023 దేశం పేరును ఇండియా అని కాకుండా భారత్ అని పిలవాలని ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భగవత్ రెండ్రోజుల క్రితం పిలుపునిచ్చారు. ఆ తర్వాత రాష్ట్రపతికి పంపిన ఆహ్వానం వెలుగులోకి వచ్చింది. ప్రతిపక్షాల కూటమి ఇండియా పేరును పెట్టుకున్న తర్వాత దేశం పేరును ఇండియా అని పిలవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వర్సెస్ మోదీ లాంటి నినాదాలు చర్చలను తీవ్రతరం చేశాయి. ఇదీ చదవండి: ఇండియా కూటమి కోఆర్డినేషన్ కమిటీ తొలి భేటీ ఎప్పుడంటే..? -
283 ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్య
– టీచర్ల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానం ఏలూరు సిటీ : జిల్లాలోని 283 ఉన్నత పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి కంప్యూటర్ విద్యను ప్రారంభిస్తున్నామని, కంప్యూటర్ విద్యను బోధించేందుకు టీచర్ల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డీఈవో డి.మధుసూదనరావు శుక్రవారం తెలిపారు. ఏడు నెలల కాలానికి తాత్కాలిక పద్ధతిలో కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్స్‌గా పనిచేసేందుకు అసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఖాళీల వివరాలను పాఠశాలల వారీగా డీఈవో వెస్ట్ గోదావరి వెబ్సైట్లో ఉంచామన్నారు. మరిన్ని వివరాలకు ఉప విద్యాధికారులను సంప్రదించాలని తెలిపారు. అభ్యర్థులు డిగ్రీ, పీజీ స్థాయిలో కంప్యూటర్ ఒక సబ్జెక్టుగా చదివిఉండాలన్నారు. 21 సంవత్సరాలు నించి 40 సంవత్సరాలు మించకూడదని తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 19 తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు ఆన్లైన్లో చేయాలని, 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అభ్యర్థులకు ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షను ఏలూరులో నిర్వహిస్తామని, మండలం యూనిట్‌గా మెరిట్ కమ్ రోస్టర్ ప్రాతిపదికన ఎంపికలు చేపడతామని తెలిపారు. మండల స్థానికులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనంగా రూ.6 వేలు గౌరవవేతనంగా చెల్లిస్తారన్నారు. హాల్‌టిక్కెట్స్, పరీక్షా కేంద్రాలను వెస్ట్‌గోదావరి డాట్ ఓఆర్జీ వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపారు. -
283 ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్య
– టీచర్ల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానం ఏలూరు సిటీ : జిల్లాలోని 283 ఉన్నత పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి కంప్యూటర్ విద్యను ప్రారంభిస్తున్నామని, కంప్యూటర్ విద్యను బోధించేందుకు టీచర్ల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డీఈవో డి.మధుసూదనరావు శుక్రవారం తెలిపారు. ఏడు నెలల కాలానికి తాత్కాలిక పద్ధతిలో కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్స్‌గా పనిచేసేందుకు అసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఖాళీల వివరాలను పాఠశాలల వారీగా డీఈవో వెస్ట్ గోదావరి వెబ్సైట్లో ఉంచామన్నారు. మరిన్ని వివరాలకు ఉప విద్యాధికారులను సంప్రదించాలని తెలిపారు. అభ్యర్థులు డిగ్రీ, పీజీ స్థాయిలో కంప్యూటర్ ఒక సబ్జెక్టుగా చదివిఉండాలన్నారు. 21 సంవత్సరాలు నించి 40 సంవత్సరాలు మించకూడదని తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 19 తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు ఆన్లైన్లో చేయాలని, 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అభ్యర్థులకు ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షను ఏలూరులో నిర్వహిస్తామని, మండలం యూనిట్‌గా మెరిట్ కమ్ రోస్టర్ ప్రాతిపదికన ఎంపికలు చేపడతామని తెలిపారు. మండల స్థానికులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనంగా రూ.6 వేలు గౌరవవేతనంగా చెల్లిస్తారన్నారు. హాల్‌టిక్కెట్స్, పరీక్షా కేంద్రాలను వెస్ట్‌గోదావరి డాట్ ఓఆర్జీ వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపారు. -
ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ బాలికల ఐటీఐలో 2016–17 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఆర్ఎల్ రంగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు ఐటీఐలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు లభిస్తాయని పూర్తి చేసిన దరఖాస్తులు ఆగస్టు 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటామన్నారు. -
'సంజయ్ దత్‌ను పిలవడం పెద్ద మిస్టేకే'
ముంబయి: బీజేపీ యువజన విభాగం నిర్వహించిన ఓ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు, ఇటీవల జైలు నుంచి విడుదలైన సంజయ్ దత్‌ను ఆహ్వానించడంపట్ల ముంబయి బీజేపీ చీఫ్ ఆశిష్ షేలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్‌ను ఆహ్వానించడం పెద్ద మిస్టేక్ అని అన్నారు. మే 1న ముంబయిలోని దిందోషిలో మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బీజేపీ యువజన విభాగం అధ్యక్షుడు మోహిత్ కాంబోజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంజయ్ దత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే, ఇది పలు రాజకీయ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 'ఇది తెలివితక్కువ పని. ఈ కార్యక్రమ నిర్వాహకుడు చేసిన పెద్ద తప్పు. ఇలాంటి తప్పు మరోసారి రిపీట్ అవకూడదు' అని షెలార్ గట్టిగా మందలించారు. ఈ విషయాన్ని తాను తీవ్రంగా భావిస్తున్నానని, అయితే, ఈ ఒక్కసారికి కాంబోజ్ పై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. -
త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటా: డీఎల్
వైఎస్ఆర్ జిల్లా: తన సొంత గ్రామంలో ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. 'నాలాంటి సీనియర్ నేతలను కూడా సీఎం లెక్కచేయనందుకు నిరసనగా సీఎం కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్నాను' అని డీఎల్ ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ నేత మల్లికార్జునరెడ్డి ఈ విషయంలో తనను కలిసి మాట్లాడినట్టు డీఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. త్వరలోనే తమ పార్టీ కార్యకర్తలతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటానని డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. -
వెల్కమ్ ఒబామా
అమెరికా అధ్యక్షుడికి తెలంగాణ సర్కారు ఆహ్వానం సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలంగాణను సందర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాశారు. వచ్చే నెలలో భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు వస్తున్న ఒబామాను హైదరాబాద్‌కు కూడా ఆహ్వానించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు లేఖ రాసినట్లు ప్రభుత్వవర్గాలు వివరించాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామా భారతదేశ సందర్శన సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చే అంశంపై ఇదివరకే తమ మంత్రి తారక రామారావు అమెరికా ఎంబసీతో మాట్లాడిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన లేఖలో ప్రస్తావించినట్లు ఆ వర్గాలు వివరించాయి. కాగా మంగళవారం సచివాలయంలో అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ (పొలిటికల్, మిలటరీ) పునీత్ తల్వార్తోపాటు వచ్చిన ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్ సమావేశమై.. రాష్ట్రంలో పెట్టుబడులు, అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. -
హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి ఆహ్వనం
న్యూఢిల్లీ: హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ సోలంకి బీజేపీని ఆహ్వానించారు. హర్యానా అసెంబ్లీలో 90 సీట్లు ఉండగా, బీజేపీ 47 సీట్లు గెలుచుకుని మెజార్టీ సాధించింది. హర్యానా బీజేపీ శాసన సభ పక్ష నాయకుడిగా ఖట్టర్‌ను ఎన్నుకున్నారు. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుండటం ఇదే తొలిసారి. -
నయన్‌కు నిత్యానంద ఆహ్వానం?
ఆధ్యాత్మిక స్వామీజీ నిత్యానంద నుంచి నటి నయనతారకు ఆహ్వానం వచ్చినట్లు సమాచారం. సంచలనాలకు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారిన వీరిద్దరి గురించే ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ముందు నిత్యం వార్తల్లో ఉన్న నిత్యానంద కొద్ది రోజులుగా అలాంటివాటికి దూరంగా ఉన్నారనుకున్నారు. అంతలోనే నయనతారకు ఆహ్వానం అంటూ మళ్లీ కోలీవుడ్‌లో కలకలానికి కారణం అయ్యారు. ఇక నటి నయనతార గురించి చెప్పనే అక్కర్లేదు. ప్రేమలు, బ్రేకప్లంటూ ఈ బ్యూటీ సృష్టించిన సంచలనాలు ఎన్నో. అలాంటి నయనతార ప్రస్తుతం కొంచెం మనశ్శాంతి కోరుకుంటుందట. ఈ విషయం తెలుసుకున్న నిత్యానంద స్వామీజీ తమ ఆశ్రమానికి ఆహ్వానించినట్లు సమాచారం. ఆయన తరపున ఓ వ్యక్తి ఇటీవల నయనతారను కలిసి మెడిటేషన్ వల్ల కలిగే సత్ఫలితాలు, తమ ఆశ్రమంలో కలిగే ప్రశాంతత, మనశ్శాంతిల గురించి వివరించినట్లు తెలిసింది. అయితే నయనతార ప్రస్తుతానికి నిత్యానంద ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు సమాచారం. అందుకు కారణం పలు షూటింగ్‌లతో బిజీగా ఉండటమేనని తెలిసింది. రీఎంట్రీలో వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్న నయనతార చేతి నిండా చిత్రాలతో యమ బిజీగా ఉంది. ప్రస్తుతం జయం రవి సరసన తనీ ఒరువన్ చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నన్బేండా, సూర్యతో మాస్, విజయ్ సేతుపతికి జంటగా నానుం రౌడీదాన్ చిత్రాలు చేస్తోంది. ఇప్పటికీ నటి రంజిత నిత్యానంద స్వామీజీకి ప్రథమ శిష్యురాలిగా ఆయన ఆశ్రమ సేవలకే అంకితమైంది. ఇటీవల బాలీవుడ్ నటి శ్వేతా తివారీని కూడా నిత్యానందస్వామీజీ ఆహ్వానించారని తెలిసింది. మరి ఆమె స్పందన ఏమిటో తెలియలేదు.