పెళ్ళికి రావాల్సిందే.. వినూత్నంగా పెళ్లి పత్రిక
ట్విట్టర్లో విశేషంగా చూస్తున్న నెటిజన్లు
మా ఇంట పెళ్లి.. మీరంతా రావడం మా కల.. పెళ్లి పందిరి నవ్వాలి కిలకిల. మీరాక మాకెంతో శుభదినం.. ఇలా కదా పెళ్లి పత్రిక రాస్తారు.. కానీ ఈ కుటుంబం వేసిన పెళ్లి ఆహ్వాన పత్రిక చూసి నెటిజన్లు అబ్బా.. ఏం రాసిర్రు భయ్యా అంటూ నవ్వుతూనే.. కామెంట్లు సైతం పెడుతున్నారు. ట్విట్టర్లో పోస్ట్ చేసిన కొద్దీ సమయానికే లక్షదాటిన వ్యూస్.. దీంతో ఇదిప్పుడు వైరల్ ఐంది.
సాధారణ సంప్రదాయానికి భిన్నంగా ఉన్న ఈ పెళ్లి పత్రిక చూసి పలువురు నవ్వుకుంటూనే.. మొత్తానికి అన్నీ నిజాలే రాసారు అని కామెంట్లు చేస్తున్నారు. మీరు పెళ్ళికి రాకుంటే ఎలా ? భోజనాల గురించి కామెంట్లు ఎవరు పెడతారు.. అది అలా ఉంది.. ఇది ఇలా ఉందని ఎవరు చెబుతారు ? కాబట్టి మీరు తప్పనిసరిగా రావాల్సిందే అని అందులో పేర్కొన్నారు.
వధువు, “శర్మాజీకి లడ్కీ” (శర్మాజీ గారి కుమార్తె ) “మంచి తెలివైన అమ్మాయి" అని రాశారు. వరుడు, “గోపాలజీ కా లడ్కా” (గోపాలజీ గారికి కుమారుడు ) అంటూనే ఈయన బీటెక్ పూర్తి చేసినప్పటికీ, ఇప్పుడు ఒక చిన్న వ్యాపారం చేస్తున్నాడని వివరించారు. జనవరి ఐదోతేదీ నాటికి తమ పిల్లలతోబాటు, బంధువుల పిల్లల పరీక్షలు కూడా ముగుస్తున్నందున ఆరోజు పెళ్లి చేస్తే బావుంటుందని ముగ్గురు పురోహితులు కలిసి ముహుర్తాన్ని ఖరారు చేసారని పేర్కొన్నారు.
వియ్యాలవారి మధ్య చిన్నచిన్న కయ్యలు ఉంటాయి...వాటిని పట్టించుకోవద్దు అని చెబుతూనే పెళ్లి వేదికమీదకు వధూవరులు ఆలస్యంగా వస్తారని, అంత వరకు ఓపిక పట్టాలని రాసారు. అసలే వివాహవేదిక చాలా ఖరీదుపెట్టి డెకరేట్ చేయించాం. అందుకే అక్కడ మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి.. అదేం మీ పిల్లలు ఆదుకునే అట స్థలం కాదు కదా.. అని గుర్తు చేశారు
ఫుడ్ చాలా కాస్ట్లీ.. ఒకసారే తినండి పెళ్లికోసం బుక్ చేసిన భోజనం చాలా ఖరీదైంది.. ఒక్కో ప్లేట్ భోజనం రూ. 2000 కాబట్టి.. కాస్త తక్కువ తినండి. లేదా ఒకసారి మాత్రమే తినండి. వివాహ వేదిక మీకు తెలుసుగా మన దూబే గారి రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది కదా.. అక్కడే ఈ పెళ్లి కూడా అని రాశారు.
కానుకలు వద్దు.. క్యాష్ కొట్టండి
పెళ్లిలో ఇచ్చే కనుకలగురించి కూడా వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఇప్పటికే ఇంట్లో ఆల్రెడీ 20 ఫోటో ఫ్రేమ్స్.. బోలెడు డిన్నర్ సెట్లు ఉన్నాయి కాబట్టి.. క్యాష్ కొట్టండి. లేదా గూగుల్ పే చేయండి అని గుర్తు చేసారు.
బంధుమిత్రులగురించి చెబుతూ వాళ్లంతా ఎప్పట్లానే బోరింగ్ బ్యాచ్ అని రాశారు.. ఇంకా భారీగా కానుకలు ఇస్తారు కాబట్టి.. తాతయ్య పేరును పత్రిక పైన రాశామని సరదాగా చెప్పారు. మామ.. అత్తయ్యలను గురించి వివరిస్తూ ఇంట్లో గొడవలను తీర్చే స్పెషలిస్టులుగా వివరించారు.
ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ పత్రికను దాదాపు 1.94 లక్షల మంది చూశారు. అయ్యో నేను ఈ కార్డు ముందే చూసి ఉంటె మా అబ్బాయి పెళ్ళికార్డును కూడా ఇలాగె ప్రింట్ చేయించేవాడిని అని ఒకాయన కామెంట్ చేయగా.. వామ్మో మరీ ఇంత నిజాయితీగా రాసేశారు.. బంధువులు ఏమనుకుంటారో అని ఇంకో అయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఈ పోస్ట్ కింద వందలాది ఎమోజీలు కూడా వచ్చాయి.
సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment