Indian wedding
-
మీరు రాకుంటే కామెంట్లు ఎవరు చేస్తారు.. ?
మా ఇంట పెళ్లి.. మీరంతా రావడం మా కల.. పెళ్లి పందిరి నవ్వాలి కిలకిల. మీరాక మాకెంతో శుభదినం.. ఇలా కదా పెళ్లి పత్రిక రాస్తారు.. కానీ ఈ కుటుంబం వేసిన పెళ్లి ఆహ్వాన పత్రిక చూసి నెటిజన్లు అబ్బా.. ఏం రాసిర్రు భయ్యా అంటూ నవ్వుతూనే.. కామెంట్లు సైతం పెడుతున్నారు. ట్విట్టర్లో పోస్ట్ చేసిన కొద్దీ సమయానికే లక్షదాటిన వ్యూస్.. దీంతో ఇదిప్పుడు వైరల్ ఐంది. సాధారణ సంప్రదాయానికి భిన్నంగా ఉన్న ఈ పెళ్లి పత్రిక చూసి పలువురు నవ్వుకుంటూనే.. మొత్తానికి అన్నీ నిజాలే రాసారు అని కామెంట్లు చేస్తున్నారు. మీరు పెళ్ళికి రాకుంటే ఎలా ? భోజనాల గురించి కామెంట్లు ఎవరు పెడతారు.. అది అలా ఉంది.. ఇది ఇలా ఉందని ఎవరు చెబుతారు ? కాబట్టి మీరు తప్పనిసరిగా రావాల్సిందే అని అందులో పేర్కొన్నారు. వధువు, “శర్మాజీకి లడ్కీ” (శర్మాజీ గారి కుమార్తె ) “మంచి తెలివైన అమ్మాయి" అని రాశారు. వరుడు, “గోపాలజీ కా లడ్కా” (గోపాలజీ గారికి కుమారుడు ) అంటూనే ఈయన బీటెక్ పూర్తి చేసినప్పటికీ, ఇప్పుడు ఒక చిన్న వ్యాపారం చేస్తున్నాడని వివరించారు. జనవరి ఐదోతేదీ నాటికి తమ పిల్లలతోబాటు, బంధువుల పిల్లల పరీక్షలు కూడా ముగుస్తున్నందున ఆరోజు పెళ్లి చేస్తే బావుంటుందని ముగ్గురు పురోహితులు కలిసి ముహుర్తాన్ని ఖరారు చేసారని పేర్కొన్నారు. వియ్యాలవారి మధ్య చిన్నచిన్న కయ్యలు ఉంటాయి...వాటిని పట్టించుకోవద్దు అని చెబుతూనే పెళ్లి వేదికమీదకు వధూవరులు ఆలస్యంగా వస్తారని, అంత వరకు ఓపిక పట్టాలని రాసారు. అసలే వివాహవేదిక చాలా ఖరీదుపెట్టి డెకరేట్ చేయించాం. అందుకే అక్కడ మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి.. అదేం మీ పిల్లలు ఆదుకునే అట స్థలం కాదు కదా.. అని గుర్తు చేశారు ఫుడ్ చాలా కాస్ట్లీ.. ఒకసారే తినండి పెళ్లికోసం బుక్ చేసిన భోజనం చాలా ఖరీదైంది.. ఒక్కో ప్లేట్ భోజనం రూ. 2000 కాబట్టి.. కాస్త తక్కువ తినండి. లేదా ఒకసారి మాత్రమే తినండి. వివాహ వేదిక మీకు తెలుసుగా మన దూబే గారి రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది కదా.. అక్కడే ఈ పెళ్లి కూడా అని రాశారు. కానుకలు వద్దు.. క్యాష్ కొట్టండి పెళ్లిలో ఇచ్చే కనుకలగురించి కూడా వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఇప్పటికే ఇంట్లో ఆల్రెడీ 20 ఫోటో ఫ్రేమ్స్.. బోలెడు డిన్నర్ సెట్లు ఉన్నాయి కాబట్టి.. క్యాష్ కొట్టండి. లేదా గూగుల్ పే చేయండి అని గుర్తు చేసారు. బంధుమిత్రులగురించి చెబుతూ వాళ్లంతా ఎప్పట్లానే బోరింగ్ బ్యాచ్ అని రాశారు.. ఇంకా భారీగా కానుకలు ఇస్తారు కాబట్టి.. తాతయ్య పేరును పత్రిక పైన రాశామని సరదాగా చెప్పారు. మామ.. అత్తయ్యలను గురించి వివరిస్తూ ఇంట్లో గొడవలను తీర్చే స్పెషలిస్టులుగా వివరించారు. ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ పత్రికను దాదాపు 1.94 లక్షల మంది చూశారు. అయ్యో నేను ఈ కార్డు ముందే చూసి ఉంటె మా అబ్బాయి పెళ్ళికార్డును కూడా ఇలాగె ప్రింట్ చేయించేవాడిని అని ఒకాయన కామెంట్ చేయగా.. వామ్మో మరీ ఇంత నిజాయితీగా రాసేశారు.. బంధువులు ఏమనుకుంటారో అని ఇంకో అయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఈ పోస్ట్ కింద వందలాది ఎమోజీలు కూడా వచ్చాయి. సిమ్మాదిరప్పన్న -
ఏటా రూ.10 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారతీయులు వివాహానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలియనది కాదు. జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లి వేడుక కోసం ఎంత ఖర్చుకైనా సరే తగ్గేదే లేదంటున్నారు. వివాహాల కోసం భారతీయులు ఏటా రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ తెలిపింది. అది కూడా విద్యపై చేసే వ్యయం కంటే వివాహాల కోసం చేస్తున్నదే రెట్టింపు స్థాయిలో ఉన్నట్టు వెల్లడించింది. వ్యయాల పరంగా ఆహారం, గ్రోసరీ (ఎఫ్ఎంసీజీ) తర్వాతి స్థానంలో పెళ్లిళ్లు ఉంటున్నట్టు జెఫరీస్ నివేదిక తెలిపింది. ఇంకా ఈ నివేదికలో ఆసక్తికరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. భారత్‌లో ఏటా 80 లక్షల నుంచి కోటి వరకు వివాహాలు జరుగుతున్నాయి. అదే చైనాలో ఏటా 70–80 లక్షలు, అమెరికాలో 20–25 లక్షల వరకు పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. అమెరికాలో వివాహాల కోసం అక్కడి వారు చేస్తున్న వార్షిక వ్యయం 70 బిలియన్ డాలర్లు (రూ.5.81 లక్షల కోట్లు) కంటే భారతీయుల వ్యయం రెట్టింపుగా ఉంది. ఇక చైనాలో ఏటా జరిగే పెళ్లి వేడుకలు భారత్ కంటే 20 శాతం మేర తక్కువే ఉన్నప్పటికీ.. భారతీయుల కంటే 50 శాతం అధికంగా 170 బిలియన్ డాలర్లు (రూ.14.11 లక్షల కోట్లు) ఖర్చు చేస్తున్నారు. వినియోగంలో భారత్‌లో రిటైల్ వినియోగ విభాగంలో వివాహాలది రెండో స్థానం. ఆహారం, గ్రోసరీలపై చేస్తున్న 681 బిలియన్ డాలర్లు (రూ.56.52 లక్షల కోట్లు) తర్వాత వివాహాలకే ఎక్కువ కేటాయిస్తున్నారు. వివాహం అంటే ఎన్నో రకాల కొనుగోళ్లతో ఉంటుందని తెలిసిందే. ముఖ్యంగా బంగారం ఆభరణాలు, వస్త్రాలు, వేడుక నిర్వహణ కేంద్రాలు, హోటల్ బుకింగ్‌లు, అలంకరణలు, ఆహారంపై భారీగా వ్యయం చేయాల్సి వస్తుంది. వివాహాలు పరోక్షంగా ఆటోమొబైల్, ఎల్రక్టానిక్స్ కొనుగోళ్లకూ మద్దతునిస్తాయి. ప్రాంతం, మతం, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పెళ్లిళ్లపై చేసే వ్యయాలు కూడా ఆధారపడి ఉంటాయని తెలిసిందే. ‘‘ఏటా 8–10 మిలియన్ల వివాహాలతో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రంగా ఉంటోంది. రిటైలర్ల సమాఖ్య సీఏఐటీ అంచనా ప్రకారం చూస్తే దీని పరిమాణం 130 బిలియన్ డాలర్ల మేర ఉంటుంది. యూఎస్‌తో పోలిస్తే దాదాపు రెట్టింపు. కీలక వినియోగ విభాగాలకు వివాహాలు ఊతమిస్తున్నాయి. విలువలకు ప్రాధాన్యమిచ్చే భారతీయ సమాజంలో వివాహాలపై ఖర్చు చేసేందుకు ఇష్టపడుతుంటారు. వారి సంపద, ఆదాయ స్థాయిలకు అనుగుణంగా ఈ వ్యయాలు ఉంటాయి. ఆర్థిక తరగతులతో సంబంధం లేకుండా అధిక వ్యయం చేసే ధోరణి కూడా నెలకొంది’’అని జెఫరీస్ నివేదిక వివరించింది. ఒక్కో పెళ్లికి రూ.1.25 లక్షలు ఒక్కో వివాహంపై చేసే ఖర్చు సగటున 15,000 డాలర్లు (రూ.1.25 లక్షలు సుమారు)గా ఉంటున్నట్టు జెఫరీస్ నివేదిక తెలిపింది. ‘‘ఇది తలసరి ఆదాయం కంటే రెట్టింపు. గ్రాడ్యుయేషన్ వరకు విద్యపై చేసే ఖర్చు కంటే రెండు రెట్లు అధికంగా ఒక జంట వివాహంపై వెచి్చస్తోంది. అదే యూఎస్‌లో వివాహంపై చేసే సగటు ఖర్చు విద్యలో సగమే ఉంటోంది’’అని ఈ నివేదిక వెల్లడించింది. ఖరీదైన ఆతిథ్యాలు, భారీ మెనూతో కూడిన ఆడంబరమైన కేటరింగ్, స్టార్ చెఫ్‌లు రూపొందించిన మెనూలు, నటులు, సెలబ్రిటీల ప్రదర్శనలను భారత్‌లో ఖరీదైన వివాహాల్లో చూ డొచ్చని పేర్కొంది. ‘‘వివాహ మార్కెట్ పరిమాణం దృష్ట్యా చూస్తే భారత్‌లో ఆభరణాలు, వ్రస్తాలు, కేటరింగ్, ప్రయాణాలు తదితర రంగాల్లో డిమాండ్‌కు ఇది మద్దతుగా నిలుస్తోంది. పరోక్షంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెయింట్స్‌కు సైతం డిమాండ్‌ను తెచ్చి పెడుతోంది’’అని వివరించింది. -
మళ్లీ పెళ్లి!
‘ప్రియానిక్’ (ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్) వెడ్డింగ్ అంటే తెలియనివాళ్లు ఉండరేమో? తన వెడ్డింగ్‌తో టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యారు ప్రియాంక చోప్రా. రాజస్థాన్‌లో బాయ్‌ఫ్రెండ్ నిక్ జోనస్‌ను వివాహమాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ పెళ్లి ప్రస్తావన ఎందుకంటే లేటెస్ట్గా మరోసారి పెళ్లి సందడి చేయడానికి రెడీ అయ్యారు ప్రియాంక. ఈ సందడి స్క్రీన్ మీద. ప్రియాంక నటిస్తున్న లేటెస్ట్ హాలీవుడ్ చిత్రం వెడ్డింగ్ కామెడీ జానర్లో ఉండబోతోందట. దేశీ వెడ్డింగ్స్ ఎలా జరుగుతాయో ఇందులో చూపించనున్నారట. అందుకోసం రాజస్థాన్, న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకూ ఎవ్వరూ షూట్ చేయని లొకేషన్స్‌లో షూటింగ్ జరపాలనుకుంటున్నారట చిత్రబృందం. నవంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో హాలీవుడ్ నటి మిండీ కలింగ్, ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. -
వివాహాల్లో ఊహించని అపశ్రుతులు
-
వివాహాల్లో ఊహించని అపశ్రుతులు
ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెళ్లి మరుపురాని మధురానుభూతి. అందుకే పెళ్లి వేడుకను ప్రతి క్షణాన్ని ఫొటోలోనూ, వీడియో కెమెరాలో బంధిస్తాం. అడుగడుగునా ఆ మధురానుభూతుల్ని చూసుకొని మురిసిపోతాం. జీవితంలో ఎంతో కీలకమైనది కావడంతో పెళ్లి కోసం ఎంతో ముందుగానే పక్కా ప్రణాళికలు వేసి.. పర్ఫెక్ట్గా నిర్వహించేందుకు తపిస్తాం. కానీ ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా పెళ్లిళ్ల సందర్భంగా కొన్ని ఊహించని అపశ్రుతులు దొర్లుతుంటాయి. అప్పటికప్పుడు జరిగిపోతుంటాయి. బంధుమిత్రులు, ఎవరో తెలియని కొత్తవారి ముందు జరిగే ఈ ఊహించని పరిణామాలు అప్పటికప్పుడు చికాకు కలిగిస్తాయి. జీవితంలోని కీలక సమయంలో జరిగిన ఈ అనుకోని అపశ్రుతులు కొందరికీ షాక్ కూడా మిగిలిస్తుంటాయి. పెళ్లిల్లో జరిగిన ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లు ఇప్పుడు ఒక వీడియోరూపంలో హల్చల్ చేస్తున్నాయి. అనుకోకుండా జరిగిన ఈ అపశ్రుతులు అప్పటికప్పుడు కొంత చికాకు కలిగించినా.. వీటిని చూసినవారికి మాత్రం ఒకింత నవ్వురాక మానదు. పెళ్లి సందర్భంగా ఏడడుగులు వేస్తుండగా వరుడి పంచె వధువు పొరపాటున కాలుపెట్టడంతో వరుడి పంచె ఊడిపోవడం, తాళి కడుతుండగా వరుడి ముఖం నిండా నురగతో నింపడం, వరుడికి పూలమాల వేయబోతూ వధువు కిందపడిపోవడం, గుర్రం మీద నుంచి వరుడు పడిపోవడం వంటి అనుకోనివిధంగా దొర్లిన అపశ్రుతులు ఇప్పుడు నెటిజన్లకు నవ్వు తెప్పిస్తున్నాయి. మీరు కూడా ఇక్కడ చూడొచ్చు.