
హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి ఆహ్వనం
న్యూఢిల్లీ: హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ సోలంకి బీజేపీని ఆహ్వానించారు.
హర్యానా అసెంబ్లీలో 90 సీట్లు ఉండగా, బీజేపీ 47 సీట్లు గెలుచుకుని మెజార్టీ సాధించింది. హర్యానా బీజేపీ శాసన సభ పక్ష నాయకుడిగా ఖట్టర్ను ఎన్నుకున్నారు. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుండటం ఇదే తొలిసారి.