cm programme
-
మత్తు వదలరా...
అసలే ఎండాకాలం... అదీ మధ్యాహ్న సమయం.. చల్లని కూలర్ల గాలి... మరోవైపు అధినేత సుదీర్ఘ ప్రసంగం.. ఇంకేముందీ అధికార పార్టీ నేతలు హాయిగా నిద్రలోకి జారుకున్నారు. పామిడిలో గురువారం జరిగిన సీఎం చంద్రబాబు బహిరంగ సభలో మంత్రి దేవినేని, పల్లె రఘునాథరెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి, పార్ధసారధి, జితేంద్రగౌడ్, అత్తార్ చాంద్‌బాషా పయ్యావుల కేశవ్, శమంతకమణి, గుండుమల తిప్పేస్వామి కునుకుపాట్లు పడ్డారు. -
సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
బుక్కపట్నం : మండలకేంద్రంలో జరిగే ‘‘జన్మభూమి–మాఊరు’’ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుక్కపట్నం వస్తున్న సందర్భంగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కలెక్టర్ కోన శశిధర్ ఇతర అధికారులు ముమ్మరం చేశారు. స్థానిక చౌడేశ్వరీ ఆలయ సమీపంలోని డిగ్రీ కళాశాల మైదానాన్ని మంగళవారం వారు పరిశీలించారు. ఈ స్థలంలోనే సీఎం సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బుక్కపట్నంలో పోలీసు అధికారులు భారీగా మొహరించారు. అలాగే బుక్కపట్నం బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని వారు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలసి భోజనం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ చమన్, సర్పంచ్ సాకే యశోద, ఎంపీపీ రవి, టీడీపీ మండల కన్వీనర్ వెంకటనారాయణరెడ్డి, గూనిపల్లి సర్పంచ్ లత పాల్గొన్నారు. -
త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటా: డీఎల్
వైఎస్ఆర్ జిల్లా: తన సొంత గ్రామంలో ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. 'నాలాంటి సీనియర్ నేతలను కూడా సీఎం లెక్కచేయనందుకు నిరసనగా సీఎం కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్నాను' అని డీఎల్ ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ నేత మల్లికార్జునరెడ్డి ఈ విషయంలో తనను కలిసి మాట్లాడినట్టు డీఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. త్వరలోనే తమ పార్టీ కార్యకర్తలతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటానని డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు.