
మత్తు వదలరా...
అసలే ఎండాకాలం... అదీ మధ్యాహ్న సమయం.. చల్లని కూలర్ల గాలి... మరోవైపు అధినేత సుదీర్ఘ ప్రసంగం.. ఇంకేముందీ అధికార పార్టీ నేతలు హాయిగా నిద్రలోకి జారుకున్నారు. పామిడిలో గురువారం జరిగిన సీఎం చంద్రబాబు బహిరంగ సభలో మంత్రి దేవినేని, పల్లె రఘునాథరెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి, పార్ధసారధి, జితేంద్రగౌడ్, అత్తార్ చాంద్‌బాషా పయ్యావుల కేశవ్, శమంతకమణి, గుండుమల తిప్పేస్వామి కునుకుపాట్లు పడ్డారు.