సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు | arrangements to cm programme | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

Published Tue, Jan 3 2017 11:28 PM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM

సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

బుక్కపట్నం : మండలకేంద్రంలో జరిగే ‘‘జన్మభూమి–మాఊరు’’ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుక్కపట్నం వస్తున్న సందర్భంగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కలెక్టర్‌ కోన శశిధర్‌ ఇతర అధికారులు ముమ్మరం చేశారు. స్థానిక చౌడేశ్వరీ ఆలయ సమీపంలోని డిగ్రీ కళాశాల మైదానాన్ని మంగళవారం వారు పరిశీలించారు. ఈ స్థలంలోనే సీఎం సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బుక్కపట్నంలో పోలీసు అధికారులు భారీగా మొహరించారు. అలాగే బుక్కపట్నం బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని వారు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలసి భోజనం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ చమన్‌, సర్పంచ్‌ సాకే యశోద, ఎంపీపీ రవి, టీడీపీ మండల కన్వీనర్‌ వెంకటనారాయణరెడ్డి, గూనిపల్లి సర్పంచ్‌ లత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement