సాక్షి, విజయవాడ: అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 19న విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎంపీ కేశినేని నాని, మంత్రి మేరుగ నాగార్జున, సీం టూర్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మీ, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జి ఆసిఫ్, తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. 400 కోట్లకు పైగా వ్యయం చేసి అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేశాం. చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.
తరతరాల వివక్షతను రూపుమాపేందుకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు. అంబేద్కర్ కృషి మరువలేనిది. అంటరానితనం నిర్మూలించాలని పోరాడిన యోధులు అంబేద్కర్. సమసమాజ నిర్మాణానికి అంబేద్కర్ న్యాయ మహాశిల్పం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. అంబేద్కర్ భారత గడ్డ పై పుట్టి ఉండకపోతే నేటికీ బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెంది ఉండేవి కాదు. అంబేద్కర్ ఆశయాలను సీఎం జగన్ కొనసాగిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం సీఎం జగన్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగానే నవరత్నాలను రూపొందించారు’’ విజయసాయి పేర్కొన్నారు.
విగ్రహావిష్కరణ సందర్భంగా సమతాసభ ఏర్పాటు చేశాం. సమతా సభకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి తరలిరానున్నారు. లక్షా 20 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. 6 గంటలకు లేజర్ షో లేదా డ్రోన్ షో ఉంటుంది. 20 నుంచి సందర్శకులకు అనుమతి ఉంటుంది. దార్శనికుడి విగ్రహావిష్కరణకు ప్రత్యేక ఆహ్వానం అవసరం లేదు. చరిత్రలో గొప్ప పర్యాటక కేంద్రంగా అంబేద్కర్ విగ్రహం నిలిచిపోతుంది’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment